తెలుగు న్యూస్  /  Entertainment  /  Balakrishna Veera Simha Reddy Second Single Unveiled

Veera Simha Reddy Second Single: వీరసింహారెడ్డి సెకండ్ సింగిల్ రిలీజ్ - బాల‌కృష్ణ మాస్ స్టెప్పులు హైలైట్‌

15 December 2022, 10:01 IST

  • Veera Simha Reddy Second Single: బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి సినిమాలోని సెకండ్ సింగిల్ లిరిక‌ల్ వీడియోను గురువారం రిలీజ్ చేశారు. ఈ పాట‌లో మాస్ స్టెప్పుల‌తో బాల‌కృష్ణ ఆక‌ట్టుకుంటున్నారు.

బాల‌కృష్ణ‌, శృతిహాస‌న్
బాల‌కృష్ణ‌, శృతిహాస‌న్

బాల‌కృష్ణ‌, శృతిహాస‌న్

Veera Simha Reddy Second Single: బాల‌కృష్ణ హీరోగా న‌టించిన వీర‌సింహారెడ్డి సినిమాలోని సెకండ్ సింగిల్ సుగుణ సుంద‌రిని గురువారం రిలీజ్ చేశారు. ఈ రొమాంటిక్ పెప్పీ సాంగ్‌లో మాస్‌ స్టెప్పుల‌తో బాల‌కృష్ణ‌, శృతిహాస‌న్ అదరగొట్టారు. రామ్ మిరియాల, స్నిగ్ధ ఈ పాట‌ను ఆల‌పించారు. రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. త‌మ‌న్ క్యాచీ ట్యూన్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

ఈ మాస్‌ లిరిక‌ల్ వీడియోకు బాల‌కృష్ణ‌, శృతిహాస‌న్ కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తోంది. స్టైలిష్‌ లుక్‌లో బాల‌కృష్ణ క‌నిపిస్తున్నాడు. ఈ సుగుణ సుంద‌రి పాట సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ సుగుణ సుంద‌రి లిరిక‌ల్ సాంగ్ బాల‌కృష్ణ అభిమానుల‌ను అలరిస్తోంది రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వీర‌సింహారెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు గోపీచంద్ మ‌లినేని.

ఇందులో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌తో పాటు మోడ్ర‌న్‌ క్యారెక్ట‌ర్‌లో బాల‌కృష్ణ క‌నిపించ‌బోతున్నాడు. రెండు షేడ్స్‌తో బాల‌కృష్ణ క్యారెక్ట‌ర్ డిఫ‌రెంట్‌గా సాగుతుంద‌ని స‌మాచారం. వీర‌సింహారెడ్డి లో క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఈ సినిమాతోనే దునియా విజ‌య్‌ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర పోషిస్తోంది.

సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.