తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balakrishna Movie Banned: 50 రోజులు ఆడిన తర్వాత బ్యాన్ అయిన బాలకృష్ణ మూవీ.. 2 సార్లు రిలీజ్, 2 నెలలు నిషేధం

Balakrishna Movie Banned: 50 రోజులు ఆడిన తర్వాత బ్యాన్ అయిన బాలకృష్ణ మూవీ.. 2 సార్లు రిలీజ్, 2 నెలలు నిషేధం

Sanjiv Kumar HT Telugu

22 June 2024, 14:26 IST

google News
  • Balakrishna Movie Tatamma Kala Banned For 2 Months: బాలకృష్ణ చేసిన మొదటి సినిమా తాతమ్మ కళ రెండు నెలలు బ్యాన్‌కు గురైంది. అది కూడా థియేటర్లలో 50 రోజులు ఆడిన తర్వాత నిషేధానికి గురికావడం విశేషంగా మారింది. దాంతో ఈ సినిమా రెండు సార్లు రిలీజ్ అయింది. మరి బ్యాన్ అవ్వడానికి గల కారణాలు చూస్తే..

50 రోజులు ఆడిన తర్వాత బ్యాన్ అయిన బాలకృష్ణ మూవీ.. 2 సార్లు రిలీజ్, 2 నెలలు నిషేధం
50 రోజులు ఆడిన తర్వాత బ్యాన్ అయిన బాలకృష్ణ మూవీ.. 2 సార్లు రిలీజ్, 2 నెలలు నిషేధం

50 రోజులు ఆడిన తర్వాత బ్యాన్ అయిన బాలకృష్ణ మూవీ.. 2 సార్లు రిలీజ్, 2 నెలలు నిషేధం

Balakrishna Movie Banned After 50 Days: నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలంటే అభిమానుల్లో ఫుల్ క్రేజ్. మొన్నటివరకు ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఎన్‌బీకే 109 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దానికి సంబంధించిన గ్లింప్స్ అదిరిపోయింది.

ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఎన్‌బీకే 109 సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే బాలకృష్ణ సినిమా ఒకటి నిషేధానికి గురైంది. అది కూడా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత బ్యాన్‌కు గురి కావడం ఆశ్చర్యకరమైన విషయంగా మారింది.

రెండు నెలల పాటు బ్యాన్‌కు గురైన బాలకృష్ణ మూవీ ఏదో కాదు ఆయన నటించిన మొదటి సినిమానే. అదే తాతమ్మ కల. స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా బాలయ్య బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు అవుతోంది. బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా తాతమ్మ కల. తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణతోపాటు నందమూరి హరికృష్ణ కూడా నటించారు.

బాలయ్యకు నటనపై ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా తాతమ్మ కల సినిమాలో ఓ క్యారెక్టర్ క్రియేట్ చేశారు సీనియర్ ఎన్టీఆర్. 1974 ఆగస్ట్ 29న విడుదలైన ఈ సినిమాలో తాతమ్మగా భానుమతి నటించారు. సినిమాలో వివాదాస్పద అంశాలు, అభ్యంతరక సన్నివేశాలు ఉంటే సెన్సార్ సమస్యలు రావడం పరిపాటే. సెన్సార్ సూచనలతో సినిమా సీన్లను మారుస్తుంటారు.

అయితే, సెన్సార్ పూర్తయి.. విడుదలైన అన్ని కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని బ్యాన్ చేయడం తాతమ్మకల మూవీకే జరిగింది. కుటుంబ నియంత్రణ కోసం ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్న రోజుల్లో ఈ సినిమా విడుదలైంది. అయితే, ఇందులో ఫ్యామిలీ ప్లానింగ్‌ను వ్యతిరేకిస్తూ భానుమతితో డైలాగ్స్ చెప్పించారు దర్శకుడు ఎన్టీఆర్.

అలాగే భూ సంస్కరణలను కూడా వ్యతిరేకిస్తూ ప్రభుత్వ విధానాలను విమర్శించేలా డైలాగ్స్ ఉన్నాయి. దాంతో ఈ సినిమాపై అసెంబ్లీలో తీవ్రమైన చర్చ జరిగింది. ఫలితంగా తాతమ్మ కల సినిమాను రెండు నెలలు నిషేధించారు. అప్పుడు అందులో సన్నివేశాలకు ఎన్టీఆర్ వివరణ ఇచ్చారు. కుటుంబ నియంత్రణకు, భూ సంస్కరణలకు తాను వ్యతిరేకం కాదని, దేశంలోని ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేస్తే అవి అవసరం లేదనేది తన అభిప్రాయంగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

అనంతరం తాతమ్మ కల సినిమాలో మార్పులు చేశారు. 2 నెలల నిషేధం తర్వాత దినపత్రికలో తాతమ్మ కల 50వ రోజు ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటనలో తమ సినిమాను మరొక విధంగా రూపొందిస్తున్నట్లు, అందుకే చిత్ర ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని మార్పులు చేసి 1975 జనవరి 8న మళ్లీ తాతమ్మకల సినిమాను విడుదల చేశారు. అలా రెండు సార్లు ఈ సినిమా రిలీజ్ అయింది.

మొదటిసారి బ్లాక్ అండ్ వైట్‌లో విడుదలైన ఈ మూవీ రెండోసారి రిలీజ్‌లో పాటలు కలర్‌లో చిత్రీకరించారు. ఇక తాతమ్మ భర్త సన్యాసుల్లో కలిసిపోయినట్లు మొదటగా చూపిస్తే.. రెండోసారి ఆయన తిరిగి ఇంటికి వచ్చినట్పు క్లైమాక్స్ మార్చారు.

బ్యాన్ అయిన బాలకృష్ణ సినిమా తాతమ్మకల
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం