Ramoji Rao Death: హీరోగా జూనియర్ ఎన్టీఆర్ పరిచయం.. రామోజీరావు నిర్మించిన హిట్ సినిమాలు ఇవే!-eenadu group chairman ramoji rao passed away and ramoji rao produced hit movies introduced jr ntr as hero ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ramoji Rao Death: హీరోగా జూనియర్ ఎన్టీఆర్ పరిచయం.. రామోజీరావు నిర్మించిన హిట్ సినిమాలు ఇవే!

Ramoji Rao Death: హీరోగా జూనియర్ ఎన్టీఆర్ పరిచయం.. రామోజీరావు నిర్మించిన హిట్ సినిమాలు ఇవే!

Sanjiv Kumar HT Telugu
Jun 08, 2024 09:01 AM IST

Ramoji Rao Passed Away And He Produced Movies: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్, నిర్మాత రామోజీరావు జూన్ 8న తెల్లవారుజాముల కన్నుమూశారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను హీరోగా పరిచయం చేసిన రామెజీరావు నిర్మించిన హిట్ సినిమాలు ఏంటనే వివరాల్లోకి వెళితే..

హీరోగా జూనియర్ ఎన్టీఆర్ పరిచయం.. రామోజీరావు నిర్మించిన హిట్ సినిమాలు ఇవే!
హీరోగా జూనియర్ ఎన్టీఆర్ పరిచయం.. రామోజీరావు నిర్మించిన హిట్ సినిమాలు ఇవే!

Ramoji Rao Passed Away: మీడియా మొఘల్, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు (87) శనివారం (జూన్ 8) ఉదయం కన్నుమూశారు. తిరిగిరాని అనంతలోకాలకు వెళ్లిపోయారు. గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన హైదారాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ఉదయం 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో మీడియా, సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల ప్రముఖ రాజకీయ వేత్తలు, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ప్రభుత్వ లాంఛనాలతో

అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఓ మీడియా దిగ్గజానికి ప్రభుత్వం ఇలా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించటం దేశంలో ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే, రామోజీరావు నిర్మించిన సినిమాల ద్వారా ఎంతోమందిని హీరోలుగా పరిచయం చేశారు. వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. "నిన్ను చూడాలని" అనే సినిమాతో తారక్‌ను రామోజీ రావు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు.

శ్రీవారి ప్రేమలేఖ

1984లో శ్రీవారికి ప్రేమలేఖ సినిమాతో నిర్మాతగా మారిన రామోజీరావు అనేక చిత్రాలను నిర్మించి సక్సెస్ అయ్యారు. వాటిలో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నుంచి సమాజానికి ఉపయోగపడే సామాజిక సినిమాలు ఉన్నాయి. మెకానికి మామయ్య వంటి కమర్షియల్ హిట్ సినిమాలు సైతం ఉన్నాయి. అలాగే పీపుల్స్ ఎన్‌కౌంటర్ వంటి విప్లవాత్మక సినిమాలు, మౌన పోరాటం, ప్రతిఘటన, మయూరి వంటి లేడి ఒరియెంటెడ్ చిత్రాలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

80కిపైగా చిత్రాలు

1983లో ఉషా కిరణ్ మూవీస్ పేరుతో సినీ నిర్మాణ సంస్థను నెలకొల్పారు రామోజీరావు. ఈ నిర్మాణ సంస్థ తెలుగు, కన్నడ, హిందీ, ఇతర భాషలన్నింటిని కలిపి సుమారుగా 80కిపైగా చిత్రాలను నిర్మించింది. అయితే, వీటిలో ఎక్కువగా తెలుగు సినిమాలే ఉన్నాయి. ఈ బ్యానర్ నుంచి ఎక్కువగా న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేవారు. కొత్తవారికి అవకాశం ఇస్తూ సినిమాలను చిత్రీకరించారు రామోజీరావు.

ఇతర భాషల్లో రీమేక్

ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌లో మొదటగా 1984లో వచ్చిన సినిమా శ్రీవారికి ప్రేమలేఖ. అదే సంవత్సరం, కాంచన గంగ, సుందరి సుబ్బారావు సినిమాలను నిర్మించారు. ఇక 1985లో నిర్మించిన మయూరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీని హిందీలో నాచే మయూరిగా రీమేక్ చేశారు. అలాగే మయూరి అనే టైటిల్‌తోనే మలయాళం, తమిళంలో రీమేక్ చేశారు. ఇక విజయశాంతి మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన ప్రతిఘటనకు కూడా మంచి విజయం సాధించింది.

చిత్రం మూవీ

తేజ, ఉదయ్ కిరణ్, రీమా సేన్ వంటి కొత్త దర్శకుడు, హీరో హీరోయిన్లతో రామోజీ రావు నిర్మించిన సినిమా చిత్రం. ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. రాజశేఖర్, రంభ, ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రధానపాత్రలుగా మెకానిక్ మావయ్య వంటి కమర్షియల్ మూవీ నిర్మించారు. ఇష్టం అనే సినిమాతో శ్రీయ సరన్ హీరోయిన్‌గా పరిచయం చేశారు రామోజీ రావు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.

నువ్వే కావాలి

తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే కావాలి ఘన విజయం సాధించింది. అలాగే ఆకాశ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక జూనియర్ ఎన్టీఆర్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిన్ను చూడాలని నిర్మించారు రామోజీరావు. నచ్చావులో మూవీతో తనిష్‌ను హీరోగా, మాధవిలతను హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేశారు. నువ్విలాతో యామీ గౌతమ్, బీరువా మూవీతో సురభి హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చారు.

రామోజీరావు నిర్మించిన పాపులర్ సినిమాలు:

శ్రీవారికి ప్రేమలేఖ (1984)

మయూరి (1985)

మౌన పోరాటం (1989)

ప్రతిఘటన (1987)

పీపుల్స్ ఎన్‌కౌంటర్ (1991)

అశ్వని (1991)

చిత్రం (2000)

మెకానిక్ మామయ్య

ఇష్టం (2001)

నువ్వే కావాలి (2000)

ఆనందం (2001)

ఆకాశ వీధిలో (2001)

మూడుముక్కలాట

నిన్ను చూడాలని (2001)

తుఝె మేరీ కసమ్

వీధి (2005)

నచ్చావులే (2008)

నిన్ను కలిసాక (2009)

సవారి (కన్నద గమ్యమ్) (2009)

నువ్విలా (2011)

బీరువా (2015)

టీ20 వరల్డ్ కప్ 2024