Anurag Kashyap: ఆ నటుడి వంట మనిషికి రోజుకే 2 లక్షలు.. నిర్మాతలకు దారుణమైన డిమాండ్స్.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్-director anurag kashyap shocked to an actor chef charged 2 lakh per day bollywood celebrity charges from producers ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anurag Kashyap: ఆ నటుడి వంట మనిషికి రోజుకే 2 లక్షలు.. నిర్మాతలకు దారుణమైన డిమాండ్స్.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Anurag Kashyap: ఆ నటుడి వంట మనిషికి రోజుకే 2 లక్షలు.. నిర్మాతలకు దారుణమైన డిమాండ్స్.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Jun 22, 2024 10:46 AM IST

Director Anurag Kashyap About Bollywood Celebrities: బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్ హిందీ సెలబ్రిటీలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ స్టార్స్ నిర్మాతల నుంచి వసూలు చేస్తున్న ఖర్చులు దారుణంగా ఉంటాయని ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ నటుడి వంట మనిషికి రోజుకే 2 లక్షలు.. నిర్మాతలకు దారుణమైన డిమాండ్స్.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
ఆ నటుడి వంట మనిషికి రోజుకే 2 లక్షలు.. నిర్మాతలకు దారుణమైన డిమాండ్స్.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ (Photo: Raajessh Kashyap/HT)

Anurag Kashyap About Bollywood Stars Charges: బాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నవాళ్లలో అనురాగ్ కశ్యప్ ఒకరు. దర్శకుడిగా, నటుడిగా మంచి గుర్తింపు పొందారు అనురాగ్ కశ్యప్. ఇటీవల విజయ్ సేతుపతి మహారాజ సినిమాలో సైతం విభిన్నమైన రోల్‌లో కనిపించి నటనతో ఆకట్టుకున్నారు.

అయితే, తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీలపై అనురాగ్ కశ్యప్ చేసిన కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. జానీస్ సెక్వేరాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిర్మాతల వద్ద బాలీవుడ్ సెలబ్రిటీలు చేసే అత్యంత దారుణమైన డిమాండ్స్, ఖర్చుల గురించి సంచలన విషయాలు చెప్పుకొచ్చారు దర్శకుడు అనురాగ్ కశ్యప్.

"కొందరు నటులు ఏమాత్రం సమంజసం కానీ, దారుణమైన డిమాండ్స్ చేస్తున్నారు. షూటింగ్ సమయంలో కొంతమంది యాక్టర్స్ తమ వ్యక్తిగత చెఫ్‌లను నియమించుకోడానికి ఇష్టపడతారు. అయితే, ఆ చెఫ్‌కు రోజుకు ఏకంగా రూ. 2 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్స్ చాలా హాస్యాస్పదంగా, నవ్వు తెప్పిస్తుంటాయి" అని అనురాగ్ కశ్యప్ షాకింగ్ విషయాలు తెలిపారు. అయితే, ఆ యాక్టర్ ఎవరనేది మాత్రం చెప్పలేదు.

"అయితే, కొందరి నటులకు పలు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అందుకే వారు బయట ఫుడ్ కాకుండా సొంత చెఫ్ వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. చెఫ్‌లు కాకుండా హెయిర్, మేకప్ ఆర్టిస్ట్‌లు రోజుకు రూ. 75 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇది టెక్నిషియన్ల కంటే ఎక్కువ. ఒకవేళ నేను హెయిర్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అయి ఉంటే ఈపాటికి చాలా రిచ్ అయ్యేవాన్ని" అని అనురాగ్ కశప్ అన్నారు.

"ఈ అనవసరపు ఖర్చులన్నీ నిర్మాతలు, వారి ఏజెంట్ల తప్పు వల్లే జరుగుతోంది. నిర్మాతలు ఇలాంటి వాటిని సెట్స్‌లోకి ఎందుకు అనుమతిస్తారో నాకు అర్థం కావడం లేదు. నా సెట్స్‌లో మాత్రం ఇలాంటివి జరగవు" అని యాక్టర్, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ వెల్లడించారు.

"కొద్ది రోజుల క్రితం ఓ నటుడు షూటింగ్ సెట్‌కు కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ నుంచి బర్గర్ తీసుకురావాలని తమ డ్రైవర్‌ను కోరాడు. షూటింగ్ సెట్ నుంచి హోటల్‌కు మూడు గంటల పాటు అటు ఇటు తిరగాల్సి వచ్చింది. ఆ బర్గర్ ఆ నటుడి వద్దకు వచ్చేసరికి అది చల్లారిపోయింది" అని అనురాగ్ చమత్కరించారు.

అనురాగ్ కశ్యప్ మాత్రమే కాకుండా ఓ ఇంటర్వ్యూలో సైంధవ్ విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీ సైతం యాక్టర్స్ అనవసరమైన ఖర్చుల గురించి కామెంట్స్ చేశారు. "నటులకు అనవసరమైన డిమాండ్స్ చాలా ఉన్నాయి. వారు ప్రతిదీ విలాసవంతంగా ఉండాలని కోరుకుంటారు. కొంతమంది నటులకు ఏకంగా 5 వ్యానిటీ వ్యాన్లు ఉన్నాయని నేను విన్నాను. ఒకటి జిమ్మింగ్ కోసం, వంట కోసం, ఒకటి తినడానికి, మరొకటి స్నానం చేసేందుకు, మరొకటి డైలాగ్స్ ప్రాక్టీస్ చేసేందుకు" అని సిద్ధిఖీ తెలిపారు.

"దీన్ని పిచ్చి అంటారు. పిచ్చివాడు మాత్రమే ఇలా 5 వ్యానిటీ వ్యాన్లలో తిరగగలడు" అని నవాజుద్ధీన్ సిద్ధిఖీ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. ఇక తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీల ఖర్చులపై డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కామెంట్స్ చేయడంతో ఈ విషయంపై మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

Whats_app_banner