తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balakrishna Attends Iffi: ఇఫీలో బాల‌కృష్ణ సంద‌డి - బోయ‌పాటి శ్రీనుతో క‌లిసి అఖండ స్క్రీనింగ్‌కు హాజ‌రు

Balakrishna Attends Iffi: ఇఫీలో బాల‌కృష్ణ సంద‌డి - బోయ‌పాటి శ్రీనుతో క‌లిసి అఖండ స్క్రీనింగ్‌కు హాజ‌రు

25 November 2022, 10:24 IST

  • Balakrishna Attends Iffi: గోవాలో జ‌రుగుతోన్న ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా(ఇఫీ)లో బాల‌కృష్ణ సంద‌డి చేశాడు. అఖండ స్క్రీనింగ్‌కు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీనుతో క‌లిసి బాల‌కృష్ణ హాజ‌ర‌య్యాడు.

మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి, బోయ‌పాటి శ్రీను, బాల‌కృష్ణ‌
మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి, బోయ‌పాటి శ్రీను, బాల‌కృష్ణ‌

మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి, బోయ‌పాటి శ్రీను, బాల‌కృష్ణ‌

Balakrishna Attends Iffi: గోవాలో జ‌రుగుతోన్న ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో గురువారం టాలీవుడ్ అగ్ర హీరో బాల‌కృష్ణ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాడు. అఖండ స్క్రీనింగ్‌కు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను, నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డితో బాల‌కృష్ణ హాజ‌ర‌య్యారు. ఇండియాలో జ‌రిగే ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో ఇఫీని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తుంటారు.

ట్రెండింగ్ వార్తలు

Prashanth Neel: సలార్ 2, కేజీఎఫ్ 3 సినిమాలపై అప్‍డేట్ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ముందు ఏదో క్లారిటీ ఇచ్చేశారు

Project Z OTT: ఆరున్నరేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న సందీప్ కిషన్ సినిమా 'ప్రాజెక్ట్ జెడ్'

Heeramandi Sex Scene: ఆ బోల్డ్ సెక్స్ సీన్ అందుకే చేయాల్సి వచ్చింది.. మగాళ్లంటే ఇష్టం లేకే..: సోనాక్షి సిన్హా

Bastar The Naxal Story OTT: అదాశర్మ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా..

ప్ర‌తి ఏటా ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వహించే ఈ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 53వ ఎడిష‌న్ ఇటీవ‌ల గోవాలో ప్రారంభ‌మైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో బాల‌కృష్ణ హీరోగా న‌టించిన అఖండ సినిమాను గురువారం ప్ర‌ద‌ర్శించారు. ఇండియ‌న్ ప‌నోర‌మ 2022 విభాగంలో ఈ సినిమా స్క్రీనింగ్ జ‌రిగింది. ఈ స్క్రీనింగ్‌కు బాల‌కృష్ణ హాజ‌ర‌య్యాడు. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను, నిర్మాత మిర్యాల ర‌వీంద్‌రెడ్డితో క‌లిసి ఇఫీలో సంద‌డిచేశారు.

ఇఫీలో బాల‌కృష్ణ పాల్గొన్న ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కొవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత రిలీజైన ఈ సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించి టాలీవుడ్‌తో పాటు భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో ధైర్యాన్ని నింపింద‌ని బాల‌కృష్ణ అన్నాడు. కొవిడ్ టైమ్‌లో క్లిష్ట ప‌రిస్థితుల్లో ఈసినిమా షూటింగ్ చేశామ‌ని బాల‌కృష్ణ పేర్కొన్నాడు.

స‌నాత‌న ధ‌ర్మంతో పాటు మ‌హాభార‌తం, రామాయ‌ణం లాంటి ఇతిహాసాల ఆవ‌శ్య‌క‌త‌ను, విలువ‌ను ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ఈ సినిమా ద్వారా క‌మ‌ర్షియ‌ల్ పంథాలో చ‌క్క‌గా ఆవిష్క‌రించార‌ని ఈ వేడుక‌లో బాల‌కృష్ణ తెలిపాడు.

ఇఫీలో ఈ ఏడాది తెలుగు నుంచి అఖండ‌తో పాటు ఆర్ఆర్ఆర్‌, ఖుదీరాంబోస్ సినిమాల‌ను స్క్రీనింగ్ కోసం ఎంపిక‌చేశారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌లైన అఖండ సినిమా బాల‌కృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.