తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balagam Trp Rating: బ‌ల‌గం టీఆర్‌పీ రేటింగ్ - ఆస్కార్ విన్నింగ్ మూవీని దాటేసిందిగా

Balagam Trp Rating: బ‌ల‌గం టీఆర్‌పీ రేటింగ్ - ఆస్కార్ విన్నింగ్ మూవీని దాటేసిందిగా

HT Telugu Desk HT Telugu

19 May 2023, 12:09 IST

  • Balagam Trp Rating: బ‌ల‌గం సినిమా బుల్లితెర‌పై కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. ప‌లు టాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ కంటే టీఆర్‌పీ రేటింగ్‌ను ద‌క్కించుకొంది.

బ‌ల‌గం సినిమా
బ‌ల‌గం సినిమా

బ‌ల‌గం సినిమా

Balagam Trp Rating: బ‌ల‌గం మూవీ రికార్డ్ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకొని బుల్లితెర‌పై సంచ‌ల‌నం సృష్టించింది. గ‌త ఆదివారం స్టార్ మా ఛానెల్‌లో ఈ సినిమా టెలికాస్ట్ అయ్యింది. ఫ‌స్ట్ టీవీ ప్రీమియ‌ర్ కు 14.30 టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఈ ఏడాది రిలీజైన భారీ బ‌డ్జెట్ సినిమాల్ని బ‌ల‌గం దాటేయ‌డం గ‌మ‌నార్హం.

ట్రెండింగ్ వార్తలు

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో ఆవేశం మూవీ రికార్డు.. ఎన్ని కోట్లంటే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!

Prashanth Neel: సలార్ 2, కేజీఎఫ్ 3 సినిమాలపై అప్‍డేట్ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ముందు ఏదో క్లారిటీ ఇచ్చేశారు

Project Z OTT: ఆరున్నరేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న సందీప్ కిషన్ సినిమా 'ప్రాజెక్ట్ జెడ్'

Heeramandi Sex Scene: ఆ బోల్డ్ సెక్స్ సీన్ అందుకే చేయాల్సి వచ్చింది.. మగాళ్లంటే ఇష్టం లేకే..: సోనాక్షి సిన్హా

అంతే కాకుండా ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌ ఆస్కార్ విన్నింగ్ మూవీ ఆర్ఆర్ఆర్ (8.17), వీర‌సింహారెడ్డి (8.83) , అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ (13.7) పాటు ప‌లు టాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ కంటే బ‌ల‌గం సినిమాకు ఎక్కువ‌గా టీఆర్‌పీ రేటింగ్ రావ‌డం గ‌మ‌నార్హం. మార్చి 3న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మూవీ అంచ‌నాల‌కు మించి విజ‌యాన్ని అందుకున్న‌ది.

కేవ‌లం కోటి రూపాయ‌ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన బ‌లగం 30 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఓటీటీలో రిలీజైన కూడా థియేట‌ర్ల‌లో అద్భుత‌మైన ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకొని నిర్మాత‌ల‌కు ప‌దిహేను కోట్ల‌కుపైగా లాభాల్ని మిగిల్చింది. ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో అవార్డుల‌ను అందుకున్న‌ది.

ఈ సినిమాతో క‌మెడియ‌న్ వేణు టిల్లు ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేశాడు. చావు నేప‌థ్యంలో కుటుంబ అనుబంధాలు, ఆప్యాయ‌త‌ల‌కు పెద్ద‌పీట వేస్తూ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. బ‌ల‌గం సినిమాలో ప్రియ‌ద‌ర్శి, కావ్య క‌ళ్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆయ‌న కూతురు హ‌న్షిత‌, హ‌ర్షిత్‌రెడ్డి బ‌లగం సినిమాను నిర్మించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.