తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aha Web Series: ఆహా ఓటీటీలోకి అర్ధ‌మ‌య్యిందా అరుణ్‌కుమార్ వెబ్ సిరీస్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Aha Web Series: ఆహా ఓటీటీలోకి అర్ధ‌మ‌య్యిందా అరుణ్‌కుమార్ వెబ్ సిరీస్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

HT Telugu Desk HT Telugu

07 June 2023, 11:31 IST

  • Aha Web Series: ఆహా ఓటీటీలో మ‌రో కొత్త తెలుగు వెబ్‌సిరీస్ రిలీజ్ కానుంది. కార్పొరేట్ వ‌ర‌ల్డ్ క‌ల్చ‌ర్‌ను ఆవిష్క‌రిస్తూ తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్ ఫ‌స్ట్‌లుక్‌, టైటిల్‌ను బుధ‌వారం రిలీజ్ చేశారు. ఈ సిరీస్ టైటిల్ ఏదంటే...

హ‌ర్షిత్‌రెడ్డి
హ‌ర్షిత్‌రెడ్డి

హ‌ర్షిత్‌రెడ్డి

Aha Web Series: ఆహా ఓటీటీలో ద్వారా మ‌రో కొత్త వెబ్‌సిరీస్ త్వ‌ర‌లోనే తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. ఈ వెబ్‌సిరీస్ టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్‌ను బుధ‌వారం రివీల్ చేశారు. ఈ సిరీస్‌కు అర్ధ‌మ‌య్యిందా అరుణ్‌కుమార్ అనేటైటిల్‌ను ఖ‌రారు చేశారు. కార్పొరేట్ వ‌ర‌ల్డ్ క‌ల్చ‌ర్‌లోని స‌మ‌స్య‌ల్ని ఆవిష్క‌రిస్తూ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ వెబ్‌సిరీస్ ను తెర‌కెక్కించారు.

ట్రెండింగ్ వార్తలు

NNS May 6th Episode: మిస్సమ్మపై పగ సాధిస్తున్న పిల్లలు.. అరుంధతి చివరి కోరిక.. అమర్ మాటలకు కుప్పకూలిన రామ్మూర్తి

GMV OTT Official: మారిన హారర్ కామెడీ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్- అధికారిక ప్రకటన- 2 రోజుల ముందుగానే స్ట్రీమింగ్- ఎక్కడంటే?

The Goat Life OTT Release Date: ఈవారం ఓటీటీలోకి మరో మలయాళ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

OTT Releases This Week: ఓటీటీలో ఈ వారం ఏకంగా 21 సినిమాలు.. ఇంట్రెస్టింగ్‌గా 7.. ఎక్కడ చూడాలంటే?

అమ‌లాపురానికి చెందిన అరుణ్‌కుమార్ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరుతాడు.అక్క‌డి భాష‌, రాజ‌కీయాల‌తో పాటు తోటి ఉద్యోగుల ఈస‌డింపుల‌ను భ‌రించ‌లేక అరుణ్ కుమార్ ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడ‌న్న‌ది ఈ సిరీస్‌లో వినోదంతో సందేశాత్మ‌కంగా చూపించ‌బోతున్నారు.

ఇందులో అరుణ్ కుమార్ పాత్ర‌లో హ‌ర్షిత్‌రెడ్డి న‌టిస్తోన్నాడు. అత‌డి ఫ‌స్ట్‌లుక్‌ను బ‌ధ‌వారం రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో గొలుసుల‌తో బంధించ‌బ‌డిన‌ట్లుగా హ‌ర్షిత్ రెడ్డి క‌నిపిస్తోన్నాడు. అత‌డి ముందు ఓ కంప్యూట‌ర్‌, గాలిలో ఎగురుతోన్న‌ పేప‌ర్స్ క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

హ‌ర్షిత్ రెడ్డితో పాటు అన‌న్య శ‌ర్మ‌, తేజ‌స్వి మ‌దివాడ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. గ‌తంలో హ‌ర్షిత్ రెడ్డి మెయిల్ సినిమాతో పాటు త‌ర‌గ‌తి గ‌ది, లూజ‌ర్ అనే వెబ్‌సిరీస్‌ల‌లో న‌టించాడు. అర్థ‌మ‌య్యిందా అరుణ్‌కుమార్‌ అత‌డు న‌టిస్తోన్న మూడో తెలుగు వెబ్‌సిరీస్ కావ‌డం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లోనే ఈ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌కు జోనాథ‌న్ ఎడ్వ‌ర్డ్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.