తెలుగు న్యూస్  /  Entertainment  /  Anjali To Play Mass Character In Bahishkarana Web Series

Anjali: మాస్ క్యారెక్టర్ లో అంజ‌లి....బ‌హిష్క‌ర‌ణ ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌...

16 June 2022, 14:56 IST

  • గ‌త కొంత‌కాలంగా క‌థానాయిక పాత్ర‌ల‌కు దూరంగా ఉంటున్న అంజ‌లి డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్‌పై దృష్టిపెడుతోంది. కెరీర్‌లో తొలిసారి ఆమె తెలుగులో ఓ వెబ్‌సిరీస్ చేయ‌బోతున్న‌ది. బ‌హిష్క‌ర‌ణ పేరుతో తెర‌కెక్కుతున్న ఈ వెబ్‌సిరీస్‌లో అంజ‌లి ఫ‌స్ట్‌లుక్‌ను గురువారం విడుద‌ల‌చేశారు..

అంజ‌లి
అంజ‌లి (twitter)

అంజ‌లి

సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాతో తెలుగులో క‌థానాయిక‌గా మంచి పేరుతెచ్చుకున్న‌ది అంజ‌లి. ఈ స‌క్సెస్‌తో టాలీవుడ్‌లో ప‌లు అవ‌కాశాల్ని అందుకున్న‌ది. కానీ ఈ సినిమాలేవి బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌లేక‌పోవ‌డంతో అంజ‌లికి నిరాశే ఎదురైంది. స‌రైనోడుతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో ప్ర‌త్యేక గీతాల్లో మెరిసింది. గ‌త కొన్నేళ్లుగా క‌థానాయిక‌గా అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేయ‌డంపై దృష్టిపెడుతోంది. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్‌లో కీల‌క పాత్ర పోషించింది. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్‌-శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతున్న చిత్రంలో ముఖ్య పాత్ర‌ను అంజ‌లి చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్స్‌పై దృష్టిపెట్టిన అంజ‌లి బ‌హిష్క‌ర‌ణ పేరుతో తెలుగులో తొలిసారి ఓ వెబ్‌సిరీస్ చేయ‌బోతున్న‌ది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ వెబ్‌సిరీస్‌లో అంజ‌లి త‌న శైలికి భిన్నంగామాస్ క్యారెక్ట‌ర్ చేస్తోంది. గురువారం అంజ‌లి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆమె ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల‌చేశారు. ఈ పోస్ట‌ర్ లో చేతిలో పాన్ డ‌బ్బా ప‌ట్టుకొని చీర ధ‌రించి కుర్చీలో కూర్చొని మాస్ లుక్‌లో అంజ‌లి క‌నిపిస్తోంది. ఆమె గెట‌ప్ కొత్త‌గా ఉంది. ఈ వెబ్ సిరీస్ లో అంజ‌లితో పాటు అన‌న్య నాగ‌ళ్ల‌,ర‌వీంద్ర‌విజ‌య్‌,శ్రీతేజ్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్న‌ట్లు స‌మాచారం.

ప్రేమ‌,ప‌గ,హ‌త్య అంశాల చుట్టూ ఈ క‌థ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఏపీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సిరీస్ తెర‌కెక్కుతోంది. ఓ ప‌ల్లెటూరి స‌ర్పంచ్‌తో పాటు అత‌డి అనుచ‌రుల కార‌ణంగా ఓ యువ‌తి ఎలాంటి అవ‌మానాల్ని ఎదుర్కొన్న‌ది? వారిపై ఏ విధంగా ప్ర‌తీకారం తీర్చుకుంద‌నే పాయింట్ తో వెబ్‌సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. జీ5 ఓటీటీ ద్వారా ఈ ఏడాదే ఈ సిరీస్ రిలీజ్ కానుంది.

 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.