తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anjali Fall Web Series Ott Release Date: అంజలి నటించిన ఫాల్‌ వెబ్‌సిరీస్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే

Anjali Fall Web Series OTT Release Date: అంజలి నటించిన ఫాల్‌ వెబ్‌సిరీస్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే

HT Telugu Desk HT Telugu

06 December 2022, 17:16 IST

    • Anjali Fall OTT Release Date: అంజలి నటించిన ఫాల్‌ వెబ్‌సిరీస్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. ఈ తమిళ థ్రిల్లర్‌ సిరీస్‌ తెలుగుతోపాటు హిందీలోనూ రాబోతోంది.
ఫాల్ వెబ్ సిరీస్ లో అంజలి
ఫాల్ వెబ్ సిరీస్ లో అంజలి

ఫాల్ వెబ్ సిరీస్ లో అంజలి

Anjali Fall OTT Release Date: టాలీవుడ్‌ నటి అంజలి ఇప్పుడు పూర్తిగా ఓటీటీపైనే దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఈ మధ్యే డిస్నీ హాట్‌స్టార్‌లో వచ్చిన ఝాన్సీ వెబ్‌సిరీస్‌లో కనిపించిన ఆమె.. ఇప్పుడు మరో సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె నటించిన తమిళ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్ ఫాల్‌ (Fall) కూడా హాట్‌స్టార్‌లోనే రిలీజ్‌ కాబోతోంది.

ట్రెండింగ్ వార్తలు

Friday Theatre Releases: ఐదు తెలుగు సినిమాలతో పోటీ పడనున్న హాలీవుడ్ మూవీ.. ఎవరిదో పైచేయి?

Upcoming Telugu Movies: ఒకే రోజు ఆరు సినిమాల రిలీజ్.. ఇన్నాళ్ల కరువంతా తీరిపోయేలా..

Chiranjeevi Padma Vibhushan: పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న మెగా స్టార్ చిరంజీవి.. వీడియో

Prabhas at Kannapa sets: కన్నప్ప సెట్స్‌లో అడుగుపెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్.. భారీ ప్రాజెక్టులో మరో స్టార్

ఈ సిరీస్‌ డిసెంబర్‌ 9 నుంచి స్ట్రీమ్‌ అవనుంది. సిద్ధార్థ్‌ రంగస్వామి డైరెక్ట్‌ చేసిన ఈ వెబ్‌సిరీస్‌.. పాపులర్‌ కెనడా మినీ సిరీస్ వెర్టిజ్‌ ఆధారంగా తెరకెక్కింది. ఈ సిరీస్‌లో అంజలితోపాటు సంతోష్‌ ప్రతాప్‌, తలైవాసల్‌ విజయ్, ఎస్‌పీబీ చరణ్‌, సోనియా అగర్వాల్‌ ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. సర్కిల్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, బనిజయ్‌ ఆసియా సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మించాయి.

కొన్ని వారాల కిందటే ఈ సిరీస్‌ ఫస్ట్‌ లుక్‌, ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాయి. ఓ ప్రమాదంలో గాయపడి తన గతాన్ని మరచిపోయిన ఓ అమ్మాయి చుట్టూ తిరిగే కథే ఈ ఫాల్‌. తన గతాన్ని తిరిగి పొందే క్రమంలో కొన్ని విషయాలు ఆమెను మరింత దారుణంగా దెబ్బతీస్తాయి. దీంతో ఆమె మానసిక ఆరోగ్యం మరింత దెబ్బ తింటుంది. వీటిని ఆమె ఎలా అధిగమిస్తుందనేది అసలు స్టోరీ.

ఈ ఫాల్‌ సిరీస్‌ తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ రిలీజ్ కానుండటం విశేషం. ఈ ఏడాది నితిన్‌తో మాచర్ల నియోజకవర్గం మూవీలో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేసిన అంజలి.. కన్నడ మూవీ భైరాగీలోనూ కనిపించింది. ఇక రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఆర్సీ15లోనూ అంజలి కనిపించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.