తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun - Dj Martin Garrix: ఇంట‌ర్నేష‌న‌ల్ డీజేతో పుష్ప సాంగ్‌కు బ‌న్నీ స్టెప్పులు - వీడియో వైర‌ల్‌

Allu Arjun - Dj Martin Garrix: ఇంట‌ర్నేష‌న‌ల్ డీజేతో పుష్ప సాంగ్‌కు బ‌న్నీ స్టెప్పులు - వీడియో వైర‌ల్‌

05 March 2023, 11:16 IST

  • Allu Arjun Dj Martin Garrix: వ‌ర‌ల్డ్ టాప్ డీజేల్లో ఒక‌రైన మార్టిన్ గారిక్స్‌తో క‌లిసి పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ పాట‌కు అల్లు అర్జున్ డ్యాన్స్ చేశాడు. గారిక్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

మార్టిన్ గారిక్స్‌, అల్లు అర్జున్
మార్టిన్ గారిక్స్‌, అల్లు అర్జున్

మార్టిన్ గారిక్స్‌, అల్లు అర్జున్

Allu Arjun Dj Martin Garrix: పుష్ప సినిమాతో పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌తో పాటు విదేశాల్లోనూ చ‌క్క‌టి క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్‌. పుష్ప‌లో బ‌న్నీ మేన‌రిజ‌మ్స్‌ను ప‌లువురు ఫారిన్ సెల‌బ్రిటీలు కాపీ చేసిన వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. పుష్ప‌లో బ‌న్నీ యాక్టింగ్‌కు ఫిదా కావ‌డ‌మే కాకుండా అత‌డికి ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు.

ట్రెండింగ్ వార్తలు

Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

తాజాగా అత‌డి ఫ్యాన్స్ జాబితాలో వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ డీజే మార్టిన్ గారిక్స్‌ చేరాడు. శ‌నివారం హైద‌రాబాద్‌లో మార్టిన్ గారిక్స్‌ మ్యూజిక్ కాన్సెర్ట్ జ‌రిగింది. ఈ మ్యూజిక్ కాన్సెర్ట్‌లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. గారిక్స్‌తో క‌లిసి స్టేజ్‌పై పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ పాట‌కు అల్లు అర్జున్ డ్యాన్స్ చేశాడు.

అల్లు అర్జున్‌తో క‌లిసి పుష్ప సినిమా పాట‌కు డ్యాన్స్ చేసిన వీడియోను గారిక్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ గారిక్స్ పోస్ట్ చేసిన వీడియోను తెగ షేర్ చేస్తోన్నారు. అల్లు అర్జున్ క్రేజ్‌కు నిద‌ర్శ‌న‌మిద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

వ‌ర‌ల్డ్ టాప్ డీజే

నెద‌ర్లాండ్స్‌కు చెందిన మార్టిన్ గారిక్స్ వ‌ర‌ల్డ్ టాప్ 100 డీజేల్లో ఒక‌రిగా పేరుతెచ్చుకున్నాడు. యానిమ‌ల్స్‌, ఇన్ ద నేమ్ ఆఫ్ ల‌వ్ తో పాటు అత‌డు స్వ‌ర‌ప‌ర‌చిన ఎన్నో ఆల్బమ్స్ మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకున్నాయి.

పుష్ప సీక్వెల్‌

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 2021లో రిలీజైన పుష్ప సినిమా పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో పెద్ద విజ‌యాన్ని సాధించింది. నాలుగు వంద‌ల కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం పుష్ప ది రూల్ పేరుతో ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. హైద‌రాబాద్‌లో సీక్వెల్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సీక్వెల్‌లో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.