Ganja Seized: వైజాగ్ టూ హైదరాబాద్.. పుష్ప సినిమా రేంజ్ లో గంజాయి స్మగ్లింగ్!-rachakonda police seized 400 kgs of ganja other incriminating material at choutuppal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ganja Seized: వైజాగ్ టూ హైదరాబాద్.. పుష్ప సినిమా రేంజ్ లో గంజాయి స్మగ్లింగ్!

Ganja Seized: వైజాగ్ టూ హైదరాబాద్.. పుష్ప సినిమా రేంజ్ లో గంజాయి స్మగ్లింగ్!

HT Telugu Desk HT Telugu
Mar 05, 2023 07:18 AM IST

Ganja Seized at Choutuppal : వైజాగ్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న 400 కేజీల గంజాయిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేయగా... రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి స్వాధీనం
గంజాయి స్వాధీనం

Rachakonda police seized Ganja: గంజాయి, డ్రగ్స్ దందాలు ఆగటం లేదు. హైదరాబాద్ పోలీసులు ఓవైపు విస్తృతందా దాడులు చేస్తున్నప్పటికీ... ఏదో ఒక చోట నిత్యం పట్టుబడుతూనే ఉన్నారు. ఇక తాజాగా రాచకొండ పోలీసులు... 400 కేజీల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువు కోటి రూపాయలకు పైగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఇందుకోసం నిందితులు డీసీఎం వాహనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవటాన్ని బట్టబయలు చేశారు.

వైజాగ్ టూ ఆంధ్రా...

పక్కా సమాచారంతో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను చౌటుప్పల్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 400 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ. కోటి వరకు ఉంటుంది. నిందితులు ఆంధ్రా, ఒడిశా సరిహద్దు నుంచి గంజాయిని సేకరించి అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా డీసీఎం వాహనం లోపల గంజాయి తరలించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు(సొరుగులు) చేసుకున్నారు. ఈ సొరుగుల్లో గంజాయి నింపి రవాణా చేస్తున్నారు. ఇప్పటికే ఆరుసార్లు ఇదే తరహాలో గంజాయిని తరలించినట్లు విచారణలో తేలింది. ఏడోసారి గంజాయి తీసుకొస్తుండగా ఈ ముఠా పోలీసులకు చిక్కింది. అయితే వీరు హైవేలపై కాకుండా గ్రామాల రోడ్ల మీదుగా రవాణా సాగిస్తున్నట్లు గుర్తించారు.

ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను గుర్తించిన పోలీసులు నలుగురి అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఓ హుండాయ్ కారు, మొబైల్ ఫోన్లు, 400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి లోతుగా విచారణ జరుపుతున్నామని రాచకొండ సీపీ రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు.

ఇక గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా గంజాయి పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రధానంగా ఏపీలోని ఒడిశా సరిహద్దు నుంచి విశాఖ మీదుగా వీటిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఆంధ్రా పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకోవటంతో పాటు… వందల ఏకరాల్లో గంజాయి పంటలను కూడా ధ్వంసం చేశారు. అయితే పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ… పలువురు అక్రమ మార్గాల్లో ఈ దందా సాగిస్తున్నారు.

IPL_Entry_Point