తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Darlings Tralier: ఇంట్రెస్టింగ్‌గా ఆలియా భట్‌ డార్లింగ్స్‌ ట్రైలర్‌

Darlings Tralier: ఇంట్రెస్టింగ్‌గా ఆలియా భట్‌ డార్లింగ్స్‌ ట్రైలర్‌

HT Telugu Desk HT Telugu

25 July 2022, 20:10 IST

    • Darlings Tralier: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ నటించిన డార్లింగ్స్‌ మూవీ ట్రైలర్‌ సోమవారం (జులై 25) రిలీజైంది. ఈ డార్క్‌ కామెడీ నేరుగా ఓటీటీలోనే రిలీజ్‌ కానుండటం విశేషం.
డార్లింగ్స్ మూవీలో ఆలియా భట్
డార్లింగ్స్ మూవీలో ఆలియా భట్

డార్లింగ్స్ మూవీలో ఆలియా భట్

పెళ్లి తర్వాత ఆలియా భట్‌ నటించిన తొలి మూవీ రిలీజ్‌ కాబోతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌, గంగూబాయి కఠియావాడి సక్సెస్‌ల తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు చాలానే ఉన్నాయి. డార్లింగ్స్‌ పేరుతో వస్తున్న ఈ సినిమా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లోనే రిలీజ్‌ కాబోతోంది. వచ్చే నెల 5న ఈ మూవీ రిలీజ్‌ కానుండగా.. సోమవారం ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

ఈ డార్క్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ట్రైలర్‌ ఆసక్తిగా సాగింది. భార్య, భర్త, మిస్సింగ్‌, కిడ్నాప్‌.. ఇలా ట్విస్ట్‌లతో ఈ ట్రైలర్‌ ఆడియెన్స్‌ మెచ్చేలా ఉంది. ఈ రెండు నిమిషాల 39 సెకన్ల ట్రైలర్‌ థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ మూవీలో ఆలియా భర్త పాత్రలో విజయ్‌ శర్మ నటిస్తున్నాడు. తన భర్త కనిపించడం లేదంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత తన ఇంట్లోనే అతన్ని కిడ్నాప్‌ చేసి టార్చర్‌ చేస్తుండటం ట్రైలర్‌లో చూడొచ్చు.

డొమెస్టిక్‌ వయొలెన్స్‌కు గురైన పాత్రలో ఆలియా నటించింది. అయితే తనను ఎంతో హింసించిన భర్తను తిరిగి అలాగే హింసించి రివేంజ్‌ తీర్చుకున్నట్లుగా ఈ ట్రైలర్‌లో చూపించారు. ఈ ట్రైలర్‌ మొత్తం ఆలియా, విజయ్‌ వర్మ, షెఫాలీ షాల చుట్టూ తిరిగింది. ఇండియాలో చాలా అరుదుగా డార్క్‌ కామెడీలు వస్తుంటాయి. ఆ జానర్‌లోనే వస్తున్న ఈ డార్లింగ్స్‌ ఫ్యాన్స్‌ను ఎంత వరకూ మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమాను షారుక్‌ఖాన్‌కు చెందిన రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌లైన్‌మెంట్‌ నిర్మించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.