తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ajith: 105 కోట్ల రెమ్యున‌రేష‌న్‌, 30కోట్ల అడ్వాన్స్‌...కోలీవుడ్ స్టార్ హీరో డిమాండ్ మాములుగా లేదుగా...

ajith: 105 కోట్ల రెమ్యున‌రేష‌న్‌, 30కోట్ల అడ్వాన్స్‌...కోలీవుడ్ స్టార్ హీరో డిమాండ్ మాములుగా లేదుగా...

HT Telugu Desk HT Telugu

30 June 2022, 12:52 IST

  • జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా  వ‌రుస‌గా సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకొస్తున్నారు అజిత్‌. ప్ర‌స్తుతం న‌య‌న‌తార భ‌ర్త, ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ తో అజిత్ ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఈ సినిమా కోసం అజిత్ అందుకున్న పారితోషికం కోలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది.

అజిత్‌
అజిత్‌ (twitter)

అజిత్‌

కోలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒక‌రిగా కొన‌సాగుతున్నారు అజిత్‌. స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కోలీవుడ్ లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు అజిత్‌. అత‌డి సినిమా వ‌చ్చిందంటే అభిమానుల‌కు పండుగానే ఉంటుంది. గ‌త కొన్నేళ్లుగా అజిత్ న‌టించిన ప్ర‌తి సినిమా వంద కోట్ల మైలురాయిని దాటింది. దాంతో అత‌డితో సినిమాలు చేసేందుకు అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. గ‌త ఫిబ్ర‌వ‌రిలో వ‌లీమై సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు అజిత్‌.

ట్రెండింగ్ వార్తలు

Devara Release: దేవర సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారనుందా?

Geethanjali Malli Vachindi OTT: ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అందుకునేందుకు ముహూర్తం ఖరారు.. హాజరుకానున్న రామ్‍చరణ్

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో ఆవేశం మూవీ రికార్డు.. ఎన్ని కోట్లంటే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!

సినిమాకు నెగెటివ్ టాక్ వ‌చ్చినా వ‌సూళ్ల ప‌రంగా మాత్రం కోలీవుడ్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమా త‌ర్వాత షూటింగ్‌ల‌కు గ్యాప్ ఇచ్చిన అజిత్ ప్ర‌స్తుతం యూర‌ప్ ట్రిప్‌లో ఉన్నారు. న‌య‌న‌తార భ‌ర్త‌, ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ తో అజిత్ ఓ సినిమా చేయ‌బోతున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ది.

ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. యాక్ష‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోసం అజిత్ 105 కోట్ల పారితోషికాన్ని అందుకోనున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే నిర్మాణ సంస్థ అత‌డికి 30 కోట్ల అడ్వాన్స్‌ల‌ను చెల్లించిన‌ట్లు స‌మాచారం. కోలీవుడ్ లో అజిత్‌కు ఉన్న డిమాండ్ మేర‌కు నిర్మాణ సంస్థ వంద కోట్ల‌కుపైగా పారితోషికాన్ని చెల్లించిన‌ట్లు చెబుతున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందించ‌బోతున్నారు. అజిత్ హీరోగా న‌టించ‌నున్న 62వ సినిమా ఇది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.