తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shakuntalam Ott Release : ఆ ఓటీటీలోనే సమంత 'శాకుంతలం' సినిమా

Shakuntalam OTT Release : ఆ ఓటీటీలోనే సమంత 'శాకుంతలం' సినిమా

Anand Sai HT Telugu

23 January 2023, 7:47 IST

    • Shakuntalam OTT Rights : సమంత లీడ్ రోల్ లో నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే.. ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి.
శాకుంతలం సినిమాలో సమంత
శాకుంతలం సినిమాలో సమంత

శాకుంతలం సినిమాలో సమంత

గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరెకెక్కిన సినిమా శాకుంతలం. ప్రధాన పాత్రలో నటించింది సమంత(Samantha). ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. శకుంతల పాత్రలో సమంత కనిపిస్తుండగా.. ఆమె సరసన దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్(Dev Mohan) నటించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్(allu Arjun) కుమార్తె అల్లు అర్హ(Allu Arha) కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అయితే గ్రాఫిక్స్ మీద కాస్త నెగటివ్ ప్రచారం జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Kannappa Prabhas: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్.. ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలంటూ..

Koratala Siva on Devara: నాకు, అభిమానులకు స్పెషల్ సినిమా: దేవరపై దర్శకుడు కొరటాల శివ.. అప్‍డేట్లపై కామెంట్

శాకుంతలం సినిమా(Shakuntalam) వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. గుణశేఖర్ టీమ్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి తుది మెరుగులు దిద్దడంలో బిజీగా ఉంది. మరోవైపు ఈ చిత్రం డిజిటల్, శాటిలైట్ హక్కుల విషయానికి వస్తే మంచి వసూళ్లు రాబట్టినట్టుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, శాకుంతలం OTT హక్కులను అమెజాన్(Amazon) భారీ ధరకు కొనుగోలు చేసింది. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

శాకుంతలం ఫిబ్రవరి 17, 2023న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. శాకుంత‌లం సినిమాలో టైటిల్ పాత్రలో స‌మంత క‌నిపిస్తోంది. మ‌హాభార‌తంలోని దుష్యంతుడు, శ‌కుంత‌ల ప్రేమ‌క‌థ ఆధారంగా ద‌ర్శకుడు గుణ‌శేఖ‌ర్(Guna Shekar) ఈ సినిమాను తెర‌కెక్కించాడు. దుష్యంతుడిగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ న‌టిస్తున్నాడు. దుర్వాస మ‌హామునిగా మోహ‌న్ బాబు(Mohan Babu) క‌నిపించాడు. గౌత‌మి, సుబ్బ‌రాజుతో పాటు ప‌లువురు టాలీవుడ్(Tollywood) న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్ని పోషించారు.

2015 పీరియాడికల్ డ్రామా 'రుద్రమదేవి' తర్వాత.. 7 సంవత్సరాల అనంతరం గుణశేఖర్ తీస్తున్న సినిమా ఇది. సమంత స్టార్ డమ్, గుణశేఖర్ డైరక్షన్ నడుమ భారీ అంచనాలతో సినిమా విడుదల కానుంది. ఓటీటీ రైట్స్(OTT Rights) కూడా భారీ ధరకే అమ్ముడుపోయాయి. సమంత స్టార్ డమ్ కారణంగానే ధర ఎక్కువగా పెట్టారని తెలుస్తోంది.

సమంత నటించిన యశోద, ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్, అత్తారింటికి దారేది, మజిలీ, జాను, రంగస్థలం, యూ టర్న్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులాంటి సినిమాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే ఉన్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.