తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Janhvi Kapoor: ఫేవరెట్ క్రికెటర్‌పై ఒకే రోజు మూడు సార్లు మాట మార్చిన జాన్వీ కపూర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

Janhvi Kapoor: ఫేవరెట్ క్రికెటర్‌పై ఒకే రోజు మూడు సార్లు మాట మార్చిన జాన్వీ కపూర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

Galeti Rajendra HT Telugu

07 September 2024, 10:43 IST

google News
  • Devara Part 1: తెలుగులోకి దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ కపూర్.. ఎన్టీఆర్‌తో కలిసి ఆడిపాడుతోంది. బాలీవుడ్‌లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్ సాధించలేకపోయిన జాన్వీ.. టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.  

జాన్వీ కపూర్
జాన్వీ కపూర్ (Instagram/@janhvikapoor)

జాన్వీ కపూర్

Janhvi Kapoor favourite cricketer: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఒకే ప్రశ్నకి ఒకే రోజు మూడు సమాధానాలు చెప్పి నెటిజన్లకి దొరికిపోయింది. ఆ ప్రశ్న సినిమాల గురించి కాదు.. క్రికెటర్స్ గురించి. జాన్వీ కపూర్ నటించిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ అనే సినిమా గత జూన్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన రీతిలో వసూళ్లని రాబట్టలేకపోయింది. అయితే ఆ సినిమా ప్రమోషన్స్‌లో జాన్వీ కపూర్ కన్‌ప్యూజ్ అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ముంబయిలో ఆ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న జాన్వీ కపూర్‌ని ఫేవరెట్ క్రికెటర్ గురించి మూడు ఇంటర్వ్యూల్లో ప్రశ్న అడిగారు. ఈ మూడింట్లోనూ జాన్వీకపూర్ వేర్వేరు క్రికెటర్ల పేర్లు చెప్పి నెటిజన్లకి దొరికిపోయింది. ఆ ముగ్గురు క్రికెటర్లలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు. దాంతో ఇంతకీ ఈ ముగ్గరిలో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో ఇప్పటికైనా కాస్త క్లారిటీ ఇవ్వు అంటూ జాన్వీ కపూర్‌ని నెటిజన్లు సరదాగా ప్రశ్నిస్తున్నారు.

జాన్వీ కపూర్‌ని ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ క్రికెటర్ గురించి అడిగినప్పుడు మహేంద్రసింగ్ ధోనీ పేరు చెప్పింది. ఆ వెంటనే మరో ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ పేరు, ఆ తర్వాత ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ పేరు చెప్పింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మూడ్ స్వింగ్‌ మరీ ఇలానా?

జాన్వీ కపూర్ వీడియోను షేర్ చేసిన ఓ నెటిజన్ 'ఫన్ ఫ్యాక్ట్: జాన్వీ కపూర్ ఒకే రోజు ఈ మూడు ఇంటర్వ్యూలు ఇచ్చింది' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, 'డైవర్సిటీ బాస్' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ‘హీరోయిన్ జాన్వీ మూడ్ స్వింగ్స్’ అని ఒక నెటిజన్ ఫన్నీ ఎమోజీలతో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

ఒక నెటిజన్ మాత్రం చాలా తెలివిగా జాన్వీ కపూర్‌ లాజిక్‌ను వెలుగులోకి తెచ్చాడు. ‘‘జాన్వీ మూడు ఇంటర్వ్యూల్లో 'ధోనీ తన ఫేవరెట్', ‘రోహిత్‌కు వీరాభిమానిని’ ‘విరాట్ అభిమానిని’ అని ఆమె చెప్పింది.. ఓవరాల్‌గా ముగ్గురు స్టార్ క్రికెటర్ల అభిమానుల్ని జాన్వీ సంతృప్తిపరిచింది’’ వెనకేసుకొచ్చాడు.

దేవరలో నటిస్తున్న జాన్వీ

జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా చేస్తున్న దేవర: పార్ట్-1తో తెలుగులో అరంగేట్రం చేయడానికి జాన్వీ కపూర్ సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 27, 2024న ఈ దేవర మూవీ విడుదల కానుండగా.. ఇప్పటికే విడుదలైన 3 పాటల్లో జూనియర్ ఎన్టీఆర్‌, జాన్వీ మధ్య కెమిస్ట్రీ మూవీపై అంచనాల్ని మరింత పెంచేస్తోంది. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు కూడా ఈ చిత్రంలో నటించారు.

దేవర పార్ట్-1 తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోతున్న సినిమాలోనూ జాన్వీ కపూర్ నటించబోతోంది. 2018 నుంచి బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న జాన్వీకి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్ రాలేదు. నటించిన 11 సినిమాల్లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఉన్నాయి. 

 

తదుపరి వ్యాసం