Mili Teaser Out: జాన్వీ కపూర్‌ 'మిలీ' టీజర్‌ వచ్చేసింది-mili teaser out as janhvi kapoor who stuck in a freezer fighting for survival ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Mili Teaser Out As Janhvi Kapoor Who Stuck In A Freezer Fighting For Survival

Mili Teaser Out: జాన్వీ కపూర్‌ 'మిలీ' టీజర్‌ వచ్చేసింది

HT Telugu Desk HT Telugu
Oct 12, 2022 05:07 PM IST

Mili Teaser out: జాన్వీ కపూర్‌ నటించిన 'మిలీ' మూవీ టీజర్‌ వచ్చేసింది. ఈ థ్రిల్లర్‌ మూవీ టీజర్‌ను బుధవారం (అక్టోబర్‌ 12) మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.

మిలీ మూవీలో జాన్వీ కపూర్
మిలీ మూవీలో జాన్వీ కపూర్

Mili Teaser out: హిందీలో మరో సౌత్‌ మూవీ రీమేక్‌ రాబోతోంది. ఈసారి బోనీ కపూర్‌, శ్రీదేవిల ముద్దుల తనయ జాన్వీ కపూర్‌ ఈ రీమేక్‌లో నటిస్తోంది. మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ హెలెన్‌ను హిందీలో మిలీగా రీమేక్‌ చేస్తున్నారు. హెలెన్‌లో అన్నా బెన్‌ లీడ్‌ రోల్‌లో నటించగా.. ఇప్పుడా పాత్రను మిలీలో జాన్వీ కపూర్‌ పోషించింది.

ఆ హెలెన్‌ మూవీ చాలా మందికి నచ్చింది. దీంతో హిందీలో ఈ మూవీని రీమేక్‌ చేయాలని భావించారు. ఆ హక్కులను బోనీ కపూరే దక్కించుకున్నారు. ఈ మిలీ మూవీ నుంచి బుధవారం (అక్టోబర్‌ 12) టీజర్‌ రిలీజైంది. హెలెన్‌ మూవీని దాదాపు అలాగే హిందీలోనూ కాపీ చేసినట్లు టీజర్‌ చూస్తే స్పష్టమవుతోంది. కోల్డ్ స్టోరేజ్‌లో ఇరుక్కుపోయిన ఓ అమ్మాయి ప్రాణాలతో బయటపడుతుందా లేదా అనే ఉత్కంఠ రేపే కథాంశంతో ఈ మిలీ మూవీ రూపొందింది.

ఓ రెస్టారెంట్‌లో పని చేసే అమ్మాయి ప్రమాదవశాత్తూ ఒక రోజు అక్కడి కోల్డ్‌ స్టోరేజ్‌లో ఇరుక్కుపోతుంది. అక్కడి నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుంది. చివరికి ఆమె బయటకు వచ్చిందా లేదా అనే ఉత్కంఠ కలిగేలా మిలీ టీజర్‌ను కట్‌ చేశారు. ఏఆర్‌ రెహమాన్‌ అందించిన మ్యూజిక్‌ ఈ టీజర్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది.

మలయాళ మూవీ హెలెన్‌ను డైరెక్ట్‌ చేసిన మాతుకుట్టి జేవియరే హిందీలోనూ మిలీని డైరెక్ట్‌ చేశాడు. చాలా వరకూ సినిమా మొత్తం ఆ కోల్ట్‌ స్టోరేజ్‌లోనే సాగేలా టీజర్‌ చూస్తే తెలుస్తోంది. ఈ మిలీ మూవీ నవంబర్‌ 4న రిలీజ్‌ కాబోతోంది. మలయాళంలో హెలెన్‌ మూవీ సూపర్‌ హిట్‌ కావడంతో ఆ సినిమాను హిందీతోపాటు తమిళంలోనూ ఇప్పటికే రీమేక్‌ చేశారు.

తెలుగు, కన్నడలోనూ రీమేక్‌ పనులు నడుస్తున్నాయి. 2019లో హెలెన్‌ మూవీ రిలీజైంది. ఆ ఏడాది నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డులలో బెస్ట్‌ డెబ్యూ ఫిల్మ్‌ ఆఫ్‌ ఎ డైరెక్టర్‌, బెస్ట్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ అవార్డులను హెలెన్‌ గెలుచుకోవడం విశేషం. కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌లోనూ స్పెషల్‌ జ్యూరీ అవార్డు దక్కించుకుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.