Daavudi Song Lyrics: అదిరిపోయేలా దేవర ‘దావూదీ’ సాంగ్.. లిరిక్స్ ఇవే
Daavudi song Lyrics - Devara Movie: దేవర సినిమా నుంచి మూడో పాట రిలీజ్ అయింది. ‘దావుదీ’ అంటూ క్యాచీ పదాలతో ఈ సాంగ్ విడుదలైంది. ఈ పాట వీడియో సాంగ్‍ను మూవీ టీమ్ తీసుకొచ్చింది. ట్రెండీగా ఉన్న ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూడండి.
హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘దేవర’పై అంచనాలు ఓ రేంజ్‍లో ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీనే రిలీజ్ కానుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీకి పాటలతోనే మరింత హైప్ యాడ్ అవుతోంది. దేవర చిత్రం నుంచి నేడు మూడో పాట వచ్చేసింది. అదిరిపోయే బీట్‍తో అడుగుపెట్టింది.
దేవర నయా సాంగ్ కూడా ఆకట్టుకుంటోంది. రిలీజ్ అయిన కాసేపటికే ఈ 'దావూదీ' సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్‍లో టాప్‍లోకి వచ్చేసింది. ఈ పాటకు ట్రెండీ ఫాస్ట్ బీట్‍ను ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. తెలుగులో లిరిక్స్ అందించారు రామజోగయ్య శాస్త్రి. ఈ పాటలో ‘దావూదీ’.. ‘కిళికిళియే’ అనే పదాలు ఎక్కువగా ఉన్నాయి. పాట క్యాచీగా డ్యాన్స్ నంబర్‌గా ఉండాలనే ఇలాంటి పదాలు వాడారు.
డైరెక్ట్‌గా వీడియో సాంగ్
దావూదీ పాటకు సంబంధించి లిరికల్ వీడియో కాకుండా వీడియో సాంగ్‍నే మూవీ టీమ్ తీసుకొచ్చింది. డ్యాన్స్‌తో అదరగొట్టారు ఎన్టీఆర్, జాన్వీ కపూర్. విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ వీడియోలో లిరిక్స్ ఇవ్వలేదు మూవీ టీమ్. అయితే, ఈ పాటకు సంబంధించిన లిరిక్స్ ఇక్కడ చూడండి.
దావూదీ పాట లిరిక్స్
కొర్రమీన నిన్ను కోసుకుంటా ఇయ్యాల
పొయిమీన మరిగిందె మసాలా
చెలికూన వయసాకు ఇస్తారెయ్యాల
కసి మీన తొలి విందులియ్యాల
కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియే కిళి కిళియో
కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియో
దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
యే వాది వాది రే.. యే వాది వాది రే.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
నీ ఏటవాలు చూపే ఎన్నెల సాంబ్రాణి
నన్నెక్కించావే పిల్లా.. రెక్కల గుర్రాన్ని
ఆకట్టు..కుంది ఈడు.. ఆకలి సింగాన్ని
జోకొట్టుకుంటా ఒళ్లో చీకటి కాలాన్ని
నల్కీసునడుం గింగిర గింగిర గింగిరమే
రంగుల పొంగుల బొంగరమే
సన్నగ నున్నగ బల్లేగా చెక్కావే
ఇంకేంది ఎడం కస్సున.. బుస్సున పొంగడమే
కాముడి చేతికి లొంగడమే
హక్కుగ మొక్కుగ బల్లేగ దక్కావే..
కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియే కిళి కిళియో
కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియో
దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
యే వాది వాది రే.. యే వాది వాది రే.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
దేవర సినిమా సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన మూడు పాటలు ఐదు భాషల్లోనూ వచ్చాయి. తొలి రెండు పాటలు అన్ని భాషల్లో పాపులర్ అయ్యాయి. ఈ మూడో సాంగ్ కూడా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్‍గా నటించారు.