తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aishwarya Rai: అమితాబ్ ఇంటికి చాలా రోజుల తర్వాత కూతురితో కలిసి వెళ్లిన ఐశ్వర్య రాయ్.. ఆ రూమర్స్‌కి చెక్ చెప్పేనా?

Aishwarya Rai: అమితాబ్ ఇంటికి చాలా రోజుల తర్వాత కూతురితో కలిసి వెళ్లిన ఐశ్వర్య రాయ్.. ఆ రూమర్స్‌కి చెక్ చెప్పేనా?

Galeti Rajendra HT Telugu

03 September 2024, 13:07 IST

google News
  • Aishwarya Rai, Abhishek Bachchan Divorce Rumors: 
    అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతున్నారని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ జంట అధికారికంగా స్పందించలేదు. అయితే బహిరంగంగానే కొన్ని సంకేతాలు మాత్రం ఇస్తోంది. 

అమితాబ్ ఇంటికి మళ్లీ కూతురితో కలిసి వెళ్లిన ఐశ్వర్య
అమితాబ్ ఇంటికి మళ్లీ కూతురితో కలిసి వెళ్లిన ఐశ్వర్య

అమితాబ్ ఇంటికి మళ్లీ కూతురితో కలిసి వెళ్లిన ఐశ్వర్య

Amitabh Bachchan house: అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతున్నారని గత కొన్ని నెలలుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ కలిసి కనిపించి కూడా చాలా రోజులైపోయింది. ఇటీవల ముంబయిలో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహానికి కూడా విడివిడిగా అభిషేక్, ఐశ్వర్య వచ్చి ఫొటోలకి పోజులిచ్చారు.

అభిషేక్‌తో విడాకుల వార్తల నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ ఇంటికి తన కూతురితో కలిసి ఐశ్వర్య రాయ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో విడిగా ఉంటున్న విషయం తెలిసిందే.

ముభావంగా ఐశ్వర్య.. నో స్మైల్

ముంబయిలోని అమితాబ్ స్వగృహం ‘జల్సా’కి కూతురుతో కలిసి వచ్చిన ఐశ్వర్య ముఖంలో ఎలాంటి నవ్వు కనిపించలేదు. ఐశ్వర్య, ఆరాధ్య ఇంటి బయట కారు దిగి లోపలికి వెళ్లారు. ఆరాధ్య స్కూల్ యూనిఫాంలోనే కనిపించగా, ఐశ్వర్య ఆకుపచ్చ రంగు దుస్తుల్లో కనిపించింది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఐశ్వర్య రాయ్‌తో విడాకుల రూమర్స్‌పై అభిషేక్ బచ్చన్ ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ కొన్ని రోజుల క్రితం అభిషేక్ బయటకు వచ్చినప్పుడు అతని చేతి వేలికి ఐశ్వర్య రాయ్ తొడిగిన ఉంగరం కనిపించలేదు. దాంతో విడాకుల వార్తలకి బలం చేకూరింది.

విడాకుల పోస్ట్‌కి అభిషేక్ లైక్

2007లో ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ వివాహం జరిగింది. వీరికి 2011లో ఆరాధ్య అనే కుమార్తె జన్మించింది. వివాహం తర్వాత తమ వైవాహిక జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్ని చాలా గోప్యంగా ఉంచిన ఈ బాలీవుడ్ జంట.. జూలైలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల పెళ్లిలో విడివిడిగా వచ్చి ఫొటోలకి పోజిలివ్వడం ద్వారా తమ మధ్య మనస్పర్థలను బయటపెట్టింది.

అభిషేక్ ఇన్ స్టాగ్రామ్ లో విడాకుల గురించి ఉన్న ఓ పోస్ట్‌ను లైక్ చేయడంతో విడాకుల రూమర్స్‌పై వార్తలు రెట్టింపు అయ్యాయి. కానీ ఇద్దరూ అధికారికంగా విడాకులపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో అమితాబ్ ఇంటికి తన కూతురుతో కలిసి ఐశ్వర్య వెళ్లడంతో వీరి మధ్య రాజీ కోసం మళ్లీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఐశ్వర్య రాయ్ చివరిగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్- 2లో నటించింది. ఇది 2022లో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ మూవీకి సీక్వెల్. ఈ రెండు చిత్రాల్లోనూ ఐశ్వర్య నందిని, మందాకిని దేవిగా ద్విపాత్రాభినయం చేసింది.

మరోవైపు అభిషేక్ బచ్చన్ నటించిన హౌస్ ఫుల్-5 థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో అభిషేక్‌తో పాటు అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, నానా పటేకర్, రితేష్ దేశ్‌ముక్, చుంకీ పాండే తదితరులు నటించారు.

తదుపరి వ్యాసం