Aishwarya Rai Divorce: ఐశ్వర్య రాయ్‌తో విడాకులు.. అభిషేక్ బచ్చన్ రియాక్షన్ ఇదీ.. ఇప్పటికీ తాను..
Aishwarya Rai Divorce: ఐశ్వర్య రాయ్ కి అభిషేక్ బచ్చన్ విడాకులు ఇచ్చేస్తున్నాడంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి ఈ వార్తలపై అభిషేక్ నోరు విప్పాడు.
Aishwarya Rai Divorce: బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడిపోతున్నారంటూ కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ మధ్యే తాను ఐశ్వర్యకు ఎందుకు విడాకులు ఇవ్వబోతున్నానంటే అంటూ అభిషేక్ చెబుతున్నట్లుగా ఓ వీడియో కూడా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో విడాకుల పుకార్లపై అభిషేక్ స్పందించాడు.
ఇప్పటికీ కలిసే ఉన్నాం..
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, కొన్ని ఈవెంట్లకు బచ్చన్లతో కాకుండా ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి వేరుగా హాజరవడం విడాకుల వార్తలకు ఊతమిచ్చాయి. అయితే ఎన్నో నెలలుగా ఈ వార్తలు వస్తున్న ఈ జంట దీనిపై స్పందించలేదు. అయితే ఈ మధ్యే పారిస్ ఒలింపిక్స్ కు వెళ్లిన అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్యతో విడాకులపై స్పందించాడు.
అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ఇందులో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశాడు. తాను ఐశ్వర్యతో ఎందుకు విడాకులు తీసుకున్నానో అభిషేక్ వివరిస్తున్న ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మరుసటి రోజే అతడు దీనిపై స్పందించాడు.
బాలీవుడ్ యూకే మీడియాతో అతడు మాట్లాడాడు. తాము ఇప్పటికీ కలిసే ఉన్నట్లు స్పష్టం చేశాడు. "దాని గురించి నేను చెప్పడానికి ఏమీ లేదు. దురదృష్టవశాత్తూ మీరు అనవసరంగా దానిని చాలా పెద్దది చేశారు. మీరు అలా ఎందుకు చేశారో నాకు తెలుసు. మీరు కొన్ని స్టోరీలు ఫైల్ చేయాలి కదా. మేము సెలబ్రిటీలం కాబట్టి ఇలాంటివి భరించాల్సిందే తప్పదు" అని అభిషేక్ అనడం గమనార్హం.
అభిషేక్ వైరల్ వీడియో
ఐశ్వర్యతో విడాకులపై అభిషేక్ స్పందించడానికి ఒక రోజు ముందు అతనికి చెందిన ఓ ఫేక్ వీడియో వైరల్ అయింది. ఏఐ సాయంతో ఆ వీడియో చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఐశ్వర్యతో తాను విడాకులు తీసుకోబోతున్నానని, దీనికి కారణం ఏంటంటే అంటూ అభిషేక్ వివరిస్తున్నట్లుగా ఆ వీడియోలో చూడొచ్చు. అయితే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆ వీడియో చేసినట్లు తెలుస్తూనే ఉంది.
అయితే ఐశ్వర్యతో అభిషేక్ విభేదాలకు ఓ డాక్టరే కారణమని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఆ డాక్టర్ పేరు జిరాక్ మార్కర్. అతను ఐశ్వర్య రాయ్‌కు క్లోజ్ ఫ్రెండ్. వీరిద్దరి మధ్య డీప్ ఫ్రెండ్షిప్ చాలా కాలంగా ఉందని సమాచారం. వీరిద్దరి స్నేహమే ఐశ్వర్య రాయ్ విడాకులకు కారణం అయ్యాయని బాలీవుడ్ మీడియా పేర్కొంటుంది.
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఐశ్వర్య రాయ్, జిరాక్ మార్కర్ చాలా కాలంగా స్నేహితులు. వీరిద్దరు ఇప్పటికీ ఫ్రెండ్షిప్ కొనసాగించకపోతే ఈ డివోర్స్ రూమర్స్ వినిపించేవి కావని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఇటీవల, ఒక ఈవెంట్‌లో ఐశ్వర్య రాయ్, జిరాక్ మార్కర్‌కు సంబంధించి కలిసి ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఏప్రిల్ 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఆరాధ్య బచ్చన్ అనే కూతురు ఉంది. ఆరాధ్య నవంబర్ 2011లో జన్మించింది. పెళ్లికి ముందు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ కలిసి ఉమ్రావ్ జాన్, ఢాయి అక్షర్ ప్రేమ్ కే, కుచ్ నా కహో, ధూమ్ 2, గురు, రావన్ సినిమాల్లో నటించారు.