తెలుగు న్యూస్ / ఫోటో /
Maniratnam: 2003లో మణిరత్నం సోదరుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే? - తమిళ ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్
Maniratnam: మణిరత్నం సోదరుడు, తమిళ సినీ నిర్మాత జీ వెంకటేశ్వరన్ అలియాస్ జీవీ 2003లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మౌనరాగం నుంచి దళపతి వరకు మణిరత్నం దర్శకత్వం వహించిన పలు సినిమాలకు జీవీ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు.
(1 / 6)
జీవీ ఆత్మహత్యకు గల కారణాలపై తమిళ సీనియర్ ప్రొడ్యూసర్ మాణిక్కం నారాయణన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ తమిళ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. ఆర్థిక సమస్యలతోనే మణిరత్నం సోదరుడు జీవీ ఆత్మహత్య చేసుకున్నట్లు తమిళ సీనియర్ ప్రొడ్యూసర్ మాణిక్కం నారాయణన్ అన్నాడు.
(2 / 6)
జీవీ మరణానికి పరోక్షంగా మణిరత్నం ఓ కారణమని మాణిక్కం నారాయణన్ అన్నాడు. సోదరుడు కష్టాలు తెలిసి కూడా మణిరత్నం సాయం చేయలేకపోయారని పేర్కొన్నాడు.
(3 / 6)
మణిరత్నంతో సినిమాలు చేస్తే జీవీ అప్పుల బాధ నుంచి బయటపడవచ్చని నాకుఅనిపించిందని, మణిరత్నంతో మాట్లాడతానని తాను అంటే జీవీ ఒప్పుకోలేదని మాణిక్కం నారాయణన్ అన్నాడు. మణిరత్నం మానవత్వం లేని మనిషి అని, అతడి గురించి తన దగ్గర మాట్లాడొద్దు అంటూ మణిరత్నంపై జీవీ ఫైర్ అయ్యాడని మాణిక్కం నారాయణన్ చెప్పాడు.
(4 / 6)
తన కొడుకు పెళ్లి సమయంలో కూడా జీవీ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడిని తట్టుకోలేకపోయారని మాణిక్కం నారాయణన్ ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
(5 / 6)
చనిపోవడానికి ముందు ఆర్థిక సమస్యలు తట్టుకోలేక మూడు, నాలుగు రోజుల పాటు జీవీ అదృశ్యమయ్యారని మాణిక్కం నారాయణన్ పేర్కొన్నాడు.
ఇతర గ్యాలరీలు