తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Actor: 10 నిమిషాలకే కోటిన్నర పారితోషికం.. సొంతగా ప్రైవేట్ ఐలాండ్.. ఈ యాక్టర్ లైఫ్ స్టైల్ తెలిస్తే షాకే!

Actor: 10 నిమిషాలకే కోటిన్నర పారితోషికం.. సొంతగా ప్రైవేట్ ఐలాండ్.. ఈ యాక్టర్ లైఫ్ స్టైల్ తెలిస్తే షాకే!

Sanjiv Kumar HT Telugu

13 June 2024, 12:12 IST

google News
  • Singer Mika Singh Remuneration And Properties: ఈ స్టార్ యాక్టర్ కేవలం 10 నిమిషాలకు రూ. 1.5 కోట్లు వసూలు చేస్తాడు. అతను ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లేదా సల్మాన్ ఖాన్ ఏ ఒక్కరు కూడా కాదు. అతను ఒక సింగర్. మరి ఆ సింగర్ ఎవరనే వివరాల్లోకి వెళితే..

10 నిమిషాలకే కోటిన్నర పారితోషికం.. సొంతగా ప్రైవేట్ ఐలాండ్.. ఈ యాక్టర్ లైఫ్ స్టైల్ తెలిస్తే షాకే!
10 నిమిషాలకే కోటిన్నర పారితోషికం.. సొంతగా ప్రైవేట్ ఐలాండ్.. ఈ యాక్టర్ లైఫ్ స్టైల్ తెలిస్తే షాకే!

10 నిమిషాలకే కోటిన్నర పారితోషికం.. సొంతగా ప్రైవేట్ ఐలాండ్.. ఈ యాక్టర్ లైఫ్ స్టైల్ తెలిస్తే షాకే!

Star Celebrity Mika Singh: స్టార్‌డమ్‌తో విలాసవంతమైన లైఫ్ స్టైల్‌తో ఎంటర్టైన్‌మెంట్‌ను బాగా ఆస్వాదించొచ్చు. షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి బాలీవుడ్ అగ్ర హీరోల నుంచి టాలీవుడ్ సూపర్ స్టార్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. అయితే ఈ సాధారణ యాక్టర్ అనుభవించే విలాసవంతమైన జీవితం గురించి తెలిస్తే కచ్చితంగా అవాక్కవాల్సిందే.

కీర్తనలు పాడి

మనం మాట్లాడుకుంటున్న స్టార్ పేరు మికా సింగ్ (Mika Singh). ఎన్నో అద్భుతమైన చార్ట్‌బస్టర్ సాంగ్స్ బాలీవుడ్‌కు అందించిన పాపులర్ సింగర్. మికా సింగ్ కేవలం సింగర్‌ మాత్రమే కాదు.. ఆయన ర్యాపర్, మ్యూజిషియన్, యాక్టర్ కూడా. మికా సింగ్ తన తండ్రి వద్ద శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నాడు. బాల్యం నుంతి పాట్నా సాహిబ్ గురుద్వారాలో కీర్తనలు పాడేవారు. అతని సోదరుడు కూడా స్టార్ సింగర్.

45 ఏళ్ల మికా సింగ్ దిల్ మే బాజీ గిటార్ రూపంలో తన మొదటి పెద్ద హిట్‌ను పొందాడు. ఆ తర్వాత జబ్ వి మెట్, బాములైజా, దిల్ బోలే హడిప్పా నుండి మౌజా హి మౌజా వంటి హిట్ ట్రాక్స్‌తో పాపులర్ అయ్యారు. కెరీర్ ప్రారంభంలోనే మంచి సక్సెస్‌ అందుకున్నాడు. సుబహ్ హోనే నా దే, లాంగ్ డ్రైవ్, పుంగి వంటి పాటలు ఇప్పటికీ జనాల నోళ్లలో నానుతుంటాయి. సింగ్ ఝలక్ దిఖ్లా జా 2, ఇస్ జంగిల్ సే ముజే బచావో వంటి షోలలో భాగమయ్యాడు.

అనంత్ అంబానీ వేడుకలో

సావన్ మే లాగ్ గయీ ఆగ్ వంటి పాటలతో అలరించిన సింగర్ మికా సింగ్ ఒక్కో పాటకు రూ. 20 నుంచి 22 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే, ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ (Anant Ambani Radhika Merchant) నిశ్చితార్థ వేడుకలో మికా సింగ్ కూడా పాల్గొన్నాడు.

ఈ వేడుకలో నటుడు, సింగర్ అయిన మికా సింగ్ కేవలం 10 నిమిషాల ప్రదర్శన కోసం రూ. 1.5 కోట్లు వసూలు చేశాడు. దీంతో మికా సింగ్ లైఫ్ స్టైల్, ఆస్తుల వివరాలపై దృష్టి పడింది. అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్న గాయకుడు మికా సింగ్ నికర విలువ రూ. 66 కోట్లు. అంతేకాకుండా మికా సింగ్ వద్ద అత్యంత ఖరీదైన కార్లు చాలానే ఉన్నాయి.

ప్రైవేట్ ఐలాండ్

మికా సింగ్‌కు సొంతగా ఒక ప్రైవేట్ ఐలాండ్ ఉంది. దానికి అందమైన సరస్సు కూడా ఉంది. ఆ ఐలాండ్ సందర్శించేందుకు అతని వద్ద 7 పడవలు ఉన్నాయి. అంతేకాకుండా మికా సింగ్ 10 గుర్రాలు కలిగి ఉన్నాడు. అలాగే ఒక ప్రైవేట్ జెట్‌ కూడా మికా సింగ్ వద్ద ఉండటం విశేషం. ఈ జెట్‌ను అతను తరచుగా హాలీ డే ట్రిప్, టూర్స్‌కు ఉపయోగిస్తుంటాడు.

ఇదిలా ఉంటే, మికా సింగ్‌ను హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 కోసం సంప్రదించినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంటోంది. ఈ ఓటీటీ మూడో సీజన్‌లో పాల్గొనడానికి మికా సింగ్‌ను సంప్రదించినట్లు ఇన్‌సైడ్ టాక్. మికా సింగ్ వంటి బాగా పాపులర్ సెలబ్రిటీలు ఉంటే షోకు అదనపు ఆకర్షణ వస్తుందన్న ఆలోచనతో సింగర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ ఓటీటీ 3 ఆఫర్

కాగా గత సంవత్సరం సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ OTT 2లో నటుడు-నిర్మాత పూజా భట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ బిగ్ బాస్ OTT 3లో పార్టిస్‌పేట్ చేసేందుకు సింగర్ మికా సింగ్ సంతకం చేశాడనే వివరాలు తెలియలేదు. ఈ బిగ్ బాస్ హిందీ ఓటీటీ 3 సీజన్‌ను అనిల్ కపూర్ హోస్ట్ చేస్తున్నారు. జూన్ 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

తదుపరి వ్యాసం