Mahesh Babu: మహేష్ బాబు డైలాగ్‌ను బ్రేక్ చేసిన సుధీర్ బాబు.. సూపర్ స్టార్ బావ కామెంట్స్ వైరల్-sudheer babu breaks mahesh babu dialogue in harom hara pre release event sudheer babu new movie updates tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu: మహేష్ బాబు డైలాగ్‌ను బ్రేక్ చేసిన సుధీర్ బాబు.. సూపర్ స్టార్ బావ కామెంట్స్ వైరల్

Mahesh Babu: మహేష్ బాబు డైలాగ్‌ను బ్రేక్ చేసిన సుధీర్ బాబు.. సూపర్ స్టార్ బావ కామెంట్స్ వైరల్

Sanjiv Kumar HT Telugu
Jun 13, 2024 11:00 AM IST

Sudheer Babu Says Mahesh Babu Dialogue: సూపర్ స్టార్ మహేష్ బాబు డైలాగ్‌ను బ్రేక్ చేశాడు అతని బావ, హీరో సుధీర్ బాబు. హరోం హర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బిజినెస్ మ్యాన్ మూవీలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్‌ చెబుతూ సుధీర్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మహేష్ బాబు డైలాగ్‌ను బ్రేక్ చేసిన సుధీర్ బాబు.. సూపర్ స్టార్ బావ కామెంట్స్ వైరల్
మహేష్ బాబు డైలాగ్‌ను బ్రేక్ చేసిన సుధీర్ బాబు.. సూపర్ స్టార్ బావ కామెంట్స్ వైరల్

Sudheer Babu Harom Hara Pre Release Event: హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'హరోం హర'. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్‌గా అలరిస్తున్నాయి.

హరోం హర టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యుజ్ హైప్ క్రియేట్ చేశాయి. జూన్ 14న హరోం హర గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు యంగ్ హీరోలు అడివి శేష్, విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా హాజరు కాగా.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సుధీర్ బాబు ఆడియో ఇంట్రాక్షన్‌ని రిలీజ్ చేశారు.

ఆడియో ఇంట్రాక్షన్‍‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడారు. "అందరికీ నమస్కారం. హరోం హర టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా ట్రైలర్ చూశాను. చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. సుధీర్ బాబు చాలా కొత్తగా కనిపించారు. బ్యాక్ డ్రాప్, ప్రిమైజ్ కొత్తగా ఉంది.

ఈ రోజుల్లో ఆడియన్స్ ఇలాంటి బ్యాక్ డ్రాప్‌ని ఇష్టపడుతున్నారు. హరోం హర టైటిల్ ట్రాక్ చాలా నచ్చింది. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసింది. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని మహేష్ బాబు తెలిపారు.

ఇక ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "ఈ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌లుగా వచ్చిన విశ్వక్, అడివి శేష్‌కి థాంక్స్. మా నాన్నగారు ఫస్ట్ టైం నా సినిమాకి సంబధించిన ఈవెంట్‌కి రావడం ఆనందంగా ఉంది. ఆయన రైట్ సినిమాకే వచ్చారని నాకు తెలుస్తుంది" అని సుధీర్ బాబు తెలిపారు.

"మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమాలో 'నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే ఏమ్ ఫర్ ది లెవంత్ మైల్' అని ఉంటుంది. నేను ట్వెల్త్ మైల్‌కి గురి పెట్టాను. కొట్టాను. ఒక సాలిడ్ సినిమా తీసి, ఎంతో మందికి చూపించి, వారు ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌తో ఇంత నమ్మకంగా మాట్లాడుతున్నాను" అని సుధీర్ బాబు అన్నారు. దీంతో లెవెంత్ మైల్ కంటే ఒకటి ఎక్కువగా పెట్టుకుని మహేష్ బాబు డైలాగ్‌నే సుధీర్ బాబు బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది.

సుధీర్ బాబు ఇంకా మాట్లాడుతూ.. "ఈ సీన్ ఎలా తీస్తే పగిలిపోతుంది. ఈ ఫ్రేం ఎలా చూస్తే అదిరిపోతుందనే అప్రోచ్‌తో ఈ సినిమా చేశాం. ట్రైలర్‌లో చూస్తున్న ప్రతి డిటేయిల్ టీం అందరి ఎఫర్ట్ ఉంది. ఇప్పటివరకూ తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి బ్యాక్ డ్రాప్‌తో ఎలాంటి సినిమా రాలేదు. సినిమా చూసినప్పుడు ఆడియన్స్ ఇదే ఫీల్ అవుతారు" అని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు.

"జూన్ 14న ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సూపర్ స్టార్ట్ కృష్ణ గారు నా మావయ్య. నా హీరో. హరోం హర ఆయన కోరుకున్న సినిమా. ఆయన నన్ను ఎలాంటి క్యారెక్టర్‌లో చూడాలని అనుకున్నారో అలాంటి సినిమా అని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. ఆయన ఆశీస్సులు ఉంటాయి" అని సూపర్ స్టార్ మహేష్ బాబు బావ సుధీర్ బాబు అన్నారు.

WhatsApp channel