తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Exit Polls : మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్- 2019లో ఎగ్జిట్ పోల్స్, తుది ఫలితాల తేడా ఇలా!

AP Exit Polls : మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్- 2019లో ఎగ్జిట్ పోల్స్, తుది ఫలితాల తేడా ఇలా!

01 June 2024, 16:16 IST

google News
    • AP Exit Polls : మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. అయితే 2019 ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్, తుది ఫలితాలను ఒకసారి చూద్దాం.
మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్- 2019లో ఎగ్జిట్ పోల్స్, తుది ఫలితాల తేడా ఇలా!
మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్- 2019లో ఎగ్జిట్ పోల్స్, తుది ఫలితాల తేడా ఇలా!

మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్- 2019లో ఎగ్జిట్ పోల్స్, తుది ఫలితాల తేడా ఇలా!

AP Exit Polls : ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు మరో మూడ్రోజుల్లో తెలియనుంది. జూన్ 4న ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఏపీ పీఠం ఈసారి ఎవరిది? అంటూ చర్చలు నడుస్తున్నాయి. ఇక బెట్టింగ్ రాయుళ్లు అయితే కోట్లలో బెట్టింగులు కాస్తున్నాయి. అయితే నేటితో లోక్ సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగియనుంది. దీంతో ఈ రోజు సాయంత్రం 6.30 దాటాక ఎగ్జిట్ పోల్స్ విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తుది ఫలితాలకు దగ్గరగా ఉంటాయని విశ్లేషకులు అంచనా. మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానుండడంతో 2019 ఎగ్జిట్ పోల్స్, తుది ఫలితాలను ఒక గుర్తుచేసుకుందాం.

2019 ఎగ్జిట్ పోల్స్ వర్సెస్ తుది ఫలితాలు

అంసెబ్లీ స్థానాలు

  • ఇండియా టూడే : వైసీపీకి 130-135 సీట్లు, టీడీపీ 37-40 సీట్లు
  • ఆరా : వైసీపీకి 119-126, టీడీపీకి 47-56
  • సీపీఎస్ : వైసీపీకి 130-133, టీడీపీకి 43-44
  • వీడీపీ అసోసియేట్స్ : వైసీపీకి 111-121, టీడీపీ 54-60

లోక్ సభ స్థానాలు

  • ఇండియా టుడే-మై యాక్సిస్ - వైసీపీ 18-20 సీట్లు, టీడీపీకి 4-6 సీట్లు
  • ఆరా - వైసీపీ 20-24 సీట్లు, టీడీపీకి 1-5 సీట్లు
  • టైమ్స్‌ నౌ -వైసీపీకి 18 సీట్లు, టీడీపీకి 7 సీట్లు
  • న్యూస్‌ 18- వైసీపీ 13-14 సీట్లు, టీడీపీ 10-12 సీట్లు

అయితే తుది ఫలితాల్లో వైసీపీ ప్రభజనం సృష్టించింది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాల్లో వైసీపీ 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది. టీడీపీ 23 ఎమ్మెల్యేలు, 3 ఎంపీ స్థానాల్లో గెలవగా, జనసేన 1 ఎమ్మెల్యే స్థానంతో సరిపెట్టుకుంది. బీజేపీ, కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.

ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుందనే అంచనాలు, వైసీపీ వర్సెస్ కూటమిలో ఎవరికి ఎడ్జ్ ఉంటుందనే చర్చలకు ఎగ్జిట్ పోల్స్ క్లారిటీ ఇస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో మళ్లీ వైసీపీ గెలుస్తుందా? కూటమికి పట్టం కట్టారా? అనేది ఆసక్తిగా మారింది. ఇటు తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... ఎంత వరకు ప్రజల్ని ఆకట్టుకుందో లోక్ సభ ఎన్నికలు తీర్పు కానున్నాయి. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? లేదా? ఫలితాలు చెప్పనున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కాస్త అంచనా వేయనున్నాయి.

అయితే ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల సంఘం నిబంధనలు విధించింది. శనివారం సాయంత్రం 6.30 లోపు ఎవరైనా ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రసారం చేస్తే, వారికి చట్టప్రకారం గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే 6.30 గంటలు దాటిన తర్వాతే ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. అంతకు ముందు ఏమైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే అవి ఫేక్ గా అర్థం చేసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే... ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చే ఫలితాలు తుది ఫలితాలకు ప్రతిబించే అవకాశం ప్రతిసారీ లేకపోవచ్చు. అందుకే తుది ఫలితాలు వచ్చే వరకు ఎవరిది విజయమో చెప్పడం కష్టం.

తదుపరి వ్యాసం