social media: ‘సోషల్ మీడియాలో లైక్స్ పొందడం ఎలా?’; క్రెడ్ సీఈఓ కునాల్ షా చెప్పిన ఈ టిప్స్ పాటించండి..
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. రాజకీయాల నుంచి దైనందిన వ్యవహారాల వరకు అన్నీ సోషల్ మీడియా కేంద్రంగానే సాగుతున్నాయి. సోషల్ మీడియా ‘లైక్స్’ అండ్ ‘వ్యూస్’ కేంద్రంగా సాగుతుంది. వాటిపైననే సంపాదన ఆధారపడి ఉంటుంది. అందువల్ల క్రెడ్ ఫౌండర్ కునాల్ షా చెప్పిన ఈ టిప్స్ తో సోషల్ మీడియాను ఏలేయండి.
CRED founder Kunal Shah: ఫిన్ టెక్ స్టార్ట్ అప్ క్రెడ్ (CRED) సీఈఓ కునాల్ షా (Kunal Shah) ఇటీవల సంపాదన అవకాశాల కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంపై తన అభిప్రాయాలను, అధ్యయనాన్ని పంచుకున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ అండ్ లైక్స్ పెరగడానికి కొన్ని టిప్స్ ను కూడా అందించారు.
సోషల్ మీడియా టిప్స్
ఎక్స్ (X) లో షేర్ చేసిన ఒక పోస్టులో సోషల్ మీడియాలో వ్యూస్ అండ్ లైక్స్ పెరగడానికి ఏడు కీలక వ్యూహాలతో కూడిన పిరమిడ్ చార్ట్ ను కునాల్ షా వివరించారు. అతను ఇలా వ్రాశాడు, "పాల్ గ్రాహం రూపొందించిన ఈ చార్ట్ లో సోషల్ మీడియాలోని ఇతర పోస్ట్ () లతో ఎలా విభేదించాలి వంటి యూజ్ ఫుల్ టిప్స్ ఉన్నాయి. అయితే ట్విట్టర్ లో లైక్స్ రావాలంటే.. వాటిలోని టిప్ నంబర్ 3ని ఫాలో కండి. మీకు పేరు ప్రఖ్యాతులు రావు కానీ లైక్స్ వస్తాయి’’ అని కునాల్ షా వ్యాఖ్యానించారు.
ఆ టిప్స్ ఇవే..
- పోస్ట్ లోని కేంద్ర బిందువును ఖండించడం. ఆ పోస్ట్ ప్రధానంగా దేనికి సంబంధించిందో ఆ ప్రధాన అంశాన్ని ఖండించడం.
- ఆ పోస్ట్ లోని తప్పులను గుర్తించడం. అవి ఎందుకు తప్పో నిర్మాణాత్మకంగా వివరించడం.
- ఆ పోస్ట్ లో వివరించిన అంశానికి విరుద్ధంగా వాదించడం. ఆ పోస్ట్ లోని అంశాలను లాజికల్ గా, అవసరమైన సాక్ష్యాధారాలతో వ్యతిరేకించడం.
- ఆ పోస్ట్ లోని అంశాలను వ్యతిరేకించడానికి సరైన సాక్ష్యాధారాలు లేకపోయినా.. ఆ పోస్ట్ ను లాజికల్ గా గట్టిగా వ్యతిరేకించడం. ఇక్కడ ఆ పోస్ట్ తో పెద్దగా సంబంధం లేని అంశాలను కూడా తీసుకురావచ్చు.
- ఆ పోస్ట్ లోని విషయాన్ని పట్టించుకోకుండా, ఆ పోస్ట్ రాసిన విధానాన్ని లేదా ఆ పోస్ట్ ‘టోన్’ ను విమర్శించడం.
- ఏ విషయంపై అయితే ఆ పోస్ట్ ఉందో, దాన్ని పట్టించుకోకుండా, ఆ రచయిత గతంలో చేసిన పోస్ట్ లను ప్రస్తావిస్తూ, వాటికి, ప్రస్తుత పోస్ట్ కు మధ్య వైరుద్ధ్యాన్ని వెల్లడిస్తూ, కఠిన పదజాలంతో దాడి చేయడం.
- ఆ పోస్ట్ రాసిన వ్యక్తి వ్యక్తిగత, లేదా వృత్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ విమర్శించడం. అవమానకర పదజాలాన్ని ఉపయోగించడం.
క్రెడ్ లో కునాల్ షా నెల జీతం రూ. 15 వేలే.
విజయవంతమైన ఫిన్ టెక్ స్టార్ట్ అప్ ‘క్రెడ్ (CRED)‘ ఫౌండర్ అయిన కునాల్ షా క్రెడ్ లో తన నెల వేతనం రూ. 15 వేలేనని వెల్లడించారు. ఇంత తక్కువ జీతం ఎందుకు తీసుకుంటున్నావని అడిగిన ప్రశ్నకు ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో కునాల్ షా (Kunal Shah) సమాధానమిచ్చారు. ‘‘కంపెనీ లాభదాయకంగా ఉన్నంత వరకు నేను మంచి జీతం తీసుకోవాలని అనుకోను. క్రెడ్ లో నా జీతం నెలకు రూ. 15,000 మాత్రేమ. నేను గతంలో నా కంపెనీ ఫ్రీఛార్జ్ ను అమ్మినందున వచ్చిన డబ్బుతో నేను జీవించగలను’’ అని కునాల్ షా వివరించారు. ఫిలాసఫీ తనకు ఇష్టమైన సబ్జెక్ట్ అన్నారు. బిజినెస్ మైండ్ సెట్ ఉన్నప్పటికీ.. ఫిలాసఫీ తనకు చాలా ఇష్టమైన అంశమని వెల్లడించారు. తన కుటుంబ వ్యాపారం దివాళా తీసిన సమయంలో డెలివరీ బాయ్ గా, డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేయడం సహా తన (Kunal Shah) గత అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు.