తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni Ipl 2024 : ‘ధోనీని తీసేసి.. ఫాస్ట్​ బౌలర్​కి ఛాన్స్​ ఇవ్వడం బెటర్​’- హర్భజన్​ సింగ్​

MS Dhoni IPL 2024 : ‘ధోనీని తీసేసి.. ఫాస్ట్​ బౌలర్​కి ఛాన్స్​ ఇవ్వడం బెటర్​’- హర్భజన్​ సింగ్​

Sharath Chitturi HT Telugu

06 May 2024, 11:50 IST

google News
    • MS Dhoni IPL 2024 : ఎంఎస్​ ధోనీ బ్యాటింగ్​ ఆర్డర్​పై సంచలన కామెంట్స్​ చేశాడు హర్భజన్​ సింగ్​. ధోనీని తీసేసి, ఫాస్ట్​ బౌలర్​ని ఆడించాలని సీఎస్కేకి సూచించాడు!
ఎంఎస్​ ధోనీ డకౌట్​..
ఎంఎస్​ ధోనీ డకౌట్​.. (ANI )

ఎంఎస్​ ధోనీ డకౌట్​..

CSK vs PBKS 2024 : ఐపీఎల్​ 2024లో పంజాబ్​ కింగ్స్​తో ఆదివారం జరిగిన మ్యాచ్​లో 9వ నెంబర్​లో బ్యాటింగ్​కి వచ్చి అందరిని షాక్​కు గురిచేశాడు ఎంఎస్​ ధోనీ. తన టీ20 కెరీర్​లో.. ఇలా 9వ నెంబర్​లో బ్యాటింగ్​కి రావడం ఇదే తొలిసారి. అంతేకాకుండా.. హర్షల్​ పటేల్​ బౌలింగ్​లో డకౌట్​ అవ్వడం మరో షాకింగ్​ విషయం. ఇలా.. రోజురోజుకు ధోనీ బ్యాటింగ్​ ఆర్డర్​ కిందకు పడిపోతుండటంపై ఫ్యాన్స్​ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా మాజీ స్పిన్నర్​, చెన్నై సూపర్​ కింగ్స్​ మాజీ ప్లేయర్​ హర్భజన్​ సింగ్​.. ఈ విషయంపై స్పందించాడు. ధోనీని జట్టు నుంచి తీసేసి, వేరే ప్లేయర్​ని తీసుకోవాలని అన్నాడు. ఇది ఇప్పుడు వైరల్​గా మారింది.

'ధోనీని తీసేసి.. ఫాస్ట్​ బౌలర్​ని పెట్టుకోండి..'

"ఐపీఎల్​లో సీఎస్కే తరఫున నెంబర్​ 9 స్లాట్​లో ఆడాలని అనుకుంటే.. ఎంఎస్​ ధోనీ అస్సలు ఆడకూడదు! అతని స్థానంలో ప్లేయింగ్​ 11లో మరో ఫాస్ట్​ బౌలర్​ని పెట్టుకోవడం బెటర్​. ధోనీ ఒక డెసీషన్​ మేకర్​. ముందు బ్యాటింగ్​కి రాకుండా.. జట్టును దెబ్బతీశాడు," అని కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించాడు హర్భజన్​ సింగ్​.

సీఎస్​కేనే కాదు.. టీమిండియాలో కూడా బెస్ట్​ ఫినీషర్​గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎంఎస్​ ధోనీ. కానీ ఈ ఐపీఎల్​ 2024లో సీఎస్కే బ్యాటింగ్​ ఆర్డర్​లో ధోనీ చాలా లాస్ట్​లో కనిపిస్తున్నాడు. మొదటి కొన్ని మ్యాచ్​లు.. 5,6 వికెట్లు పడినా బ్యాటింగ్​కి దిగలేదు. ఆ తర్వాత.. ఆడిన మ్యాచుల్లో చాలా బాగా ఆడాడు. చివరి 1,2 ఓవర్స్​లో వచ్చి ఫోర్లు, సిక్స్​లు కొట్టి.. ఫ్యాన్స్​ని అలరించాడు. కానీ.. ధోనీ ఇలా మరీ నెంబర్​ 9లో బ్యాటింగ్​కి వస్తాడని ఎవరూ ఉహించలేదు. పంజాబ్​ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో మిచెల్​ సాంట్నర్​, శార్దూల్​ ఠాకూర్​లను ముందు బ్యాటింగ్​కి పంపించాడు. 19వ ఓవర్​లో తాను బ్యాటింగ్​కి దిగాడు. కానీ.. హర్షల్​ పటేల్​ వేసిన ఆ ఓవర్​లో.. క్లీన్​ బౌల్డ్​ అయ్యి, డకౌట్​తో వెనుదిరిగాడు. ఆ సమయంలో.. ధోనీ ఫ్యాన్స్​ అందరు షాక్​కు గురయ్యారు.

MS Dhoni IPL 2024 : "ధోనీ కన్నా ముందు శార్దూల్​ ఠాకూర్​ బ్యాటింగ్​కి వచ్చాడు. ధోనీలాగా.. శార్దూల్​ ఎప్పుడు ఆడలేడు. కానీ ధోనీ ఈ తప్పు ఎందుకు చేశాడో నాకు అర్థం కావడం లేదు. అతని అనుమతి లేనిదే జట్టులో ఏం జరగదు. కానీ ధోనీ ఇలా చివరి స్థానాల్లో బ్యాటింగ్​కి వస్తాడంటే నేను ఒప్పుకోలేను. పంజాబ్​ కింగ్స్​ మ్యాచ్​లో.. ధోనీ అవసరం సీఎస్కేకి పడింది. క్విక్​ రన్స్​ కావాల్సిన సమయంలో ధోనీ బ్యాటింగ్​కి రాలేదు. ఇంతటి కీలక మ్యాచ్​లో ధోనీ ముందు బ్యాటింగ్​కి రాకపోవడం షాకింగ్​గా ఉంది. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నాకు కరెక్ట్​ అనిపించిందే చెప్తా. ఐపీఎల్​ 2024లో ఇలా నెంబర్​ 9లో ఆడే బదులు.. ధోనీని తీసేసి, ఫాస్ట్​ బౌలర్​ని పెట్టుకోవడం బెటర్​," అని హర్భజన్​ సింగ్​ చెప్పుకొచ్చాడు.

అయితే.. ధోనీ బ్యాటింగ్​ ఆర్డర్​ మారడంపై ఈ ఐపీఎల్​ 2024 తొలినాళ్లల్లో.. సీఎస్కే కోచ్​ స్టీఫెన్​ ఫ్లెమింగ్​ స్పందించాడు. ధోనీ మోకాలికి సర్జరీ అయ్యిందని, నొప్పి నుంచి కోలుకుంటుండటంతో, ఎంత వీలైతే అంత తక్కువ బ్యాటింగ్​ చేస్తున్నాడని చెప్పాడు.

MS Dhoni latest news : ఇక ఆదివారం జరిగిన మ్యాచ్​ విషయానికొస్త.. రవీంద్ర జడేజా ఆల్​రౌండ్​ ప్రదర్శనతో.. పంజాబ్​ కింగ్స్​పై చెన్నై సూపర్​ కింగ్స్​ విజయం సాధించింది. ఫలితంగా.. ఐపీఎల్​ 2024 పాయింట్స్​ టేబుల్​లో.. మూడో స్థానానికి చేరుకుంది.

తదుపరి వ్యాసం