తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ipl 2024 Orange Cap: డేంజర్‌లో కోహ్లి ఆరెంజ్.. బుమ్రా పర్పుల్ క్యాప్స్.. ముప్పు వీళ్ల నుంచే..

IPL 2024 Orange Cap: డేంజర్‌లో కోహ్లి ఆరెంజ్.. బుమ్రా పర్పుల్ క్యాప్స్.. ముప్పు వీళ్ల నుంచే..

06 May 2024, 8:30 IST

IPL 2024 Orange Cap: విరాట్ కోహ్లి ఆరెంజ్ క్యాప్ డేంజర్ లో పడింది. ఈ సీజన్ లో దాదాపు మొదటి వారం నుంచే ఆరెంజ్ క్యాప్ పదిలంగా దాచుకుంటూ వస్తున్న కోహ్లికి సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ నుంచి ముప్పు పొంచి ఉంది. ఆదివారం (మే 5) రెండు మ్యాచ్ ల తర్వాత ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లిస్ట్ ఇలా ఉంది.

  • IPL 2024 Orange Cap: విరాట్ కోహ్లి ఆరెంజ్ క్యాప్ డేంజర్ లో పడింది. ఈ సీజన్ లో దాదాపు మొదటి వారం నుంచే ఆరెంజ్ క్యాప్ పదిలంగా దాచుకుంటూ వస్తున్న కోహ్లికి సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ నుంచి ముప్పు పొంచి ఉంది. ఆదివారం (మే 5) రెండు మ్యాచ్ ల తర్వాత ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లిస్ట్ ఇలా ఉంది.
IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానానికి దూసుకెళ్లాడు కేకేఆర్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్. అతడు 11 మ్యాచ్ లలో ఏకంగా 183.66 స్ట్రైక్ రేట్ తో 461 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దీంతో ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లి, రుతురాజ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
(1 / 5)

IPL 2024 Orange Cap: మరో కేకేఆర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ కూడా ఈ సీజన్లో 11 ఇన్నింగ్స్ లో 429 రన్స్ చేశాడు. లక్నోపై ఆదివారం (మే 5) 32 రన్స్ చేసిన అతడు.. ఈ రేసులో ఐదో స్థానానికి దూసుకెళ్లాడు. నాలుగో స్థానంలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ 431 రన్స్ తో ఉన్నాడు.
(2 / 5)
IPL 2024 Orange Cap: మరో కేకేఆర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ కూడా ఈ సీజన్లో 11 ఇన్నింగ్స్ లో 429 రన్స్ చేశాడు. లక్నోపై ఆదివారం (మే 5) 32 రన్స్ చేసిన అతడు.. ఈ రేసులో ఐదో స్థానానికి దూసుకెళ్లాడు. నాలుగో స్థానంలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ 431 రన్స్ తో ఉన్నాడు.(IPL)
IPL 2024 Orange Cap: ఆరెంజ్ క్యాప్ ఇప్పటికే ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి దగ్గరే ఉంది. అతడు ఈ సీజన్లో 11 ఇన్నింగ్స్ లో 542 రన్స్ చేశాడు. ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ నుంచి అతనికి గట్టి పోటీ ఉంది. రుతురాజ్ ప్రస్తుతం కోహ్లి కంటే కేవలం ఒకే ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. అతడు 11 ఇన్నింగ్స్ లో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో 541 రన్స్ చేశాడు.
(3 / 5)

IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఈ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. లక్నోపై మూడు వికెట్లు తీసిన వరుణ్.. ప్రస్తుతం 11 మ్యాచ్ లలో 16 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక మరో బౌలర్ సునీల్ నరైన్ కూడా 11 మ్యాచ్ లలో 14 వికెట్లు తీశాడు. నరైన్ ఆరో స్థానంలో ఉన్నాడు. సన్ రైజర్స్ బౌలర్ నటరాజన్, పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ చెరో 15 వికెట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
(4 / 5)

IPL 2024 Orange Cap: ప్రస్తుతం ఐపీఎల్ 2024 పర్పుల్ క్యాప్ ముంబై బౌలర్ బుమ్రా దగ్గరే ఉంది. అతడు 11 మ్యాచ్ లలో 17 వికెట్లతో ఉన్నాడు. అయితే పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షల్ పటేల్ నుంచి అతనికి పోటీ ఉంది. చెన్నైపై 3 వికెట్లు తీసిన హర్షల్.. ఈ సీజన్లో 11 మ్యాచ్ లలో 17 వికెట్లతో బుమ్రాను సమం చేశాడు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి