MS Dhoni IPL : ధోనీ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ ఇచ్చిన ఫ్లెమింగ్- ఇక బ్యాటింగ్ కష్టమే!
MS Dhoni batting IPL 2024 : ఎంఎస్ ధోనీ ముందే ఎందుకు బ్యాటింగ్‌కి రావట్లేదు? అన్న ప్రశ్నకు సీఎస్కే హెడ్ కోచ్ ఫ్లెమింగ్ జవాబు ఇచ్చాడు. ఇది ధోనీ ఫ్యాన్స్‌కి కాస్త బాధకలిగించే విషయమే!
MS Dhoni IPL 2024 : ఇప్పుడు చాలా మంది.. ఎంఎస్ ధోనీ కోసమే ఐపీఎల్ చూస్తున్నారు! చాలా మంది.. ధోనీ చూసేందుకే స్టేడియంకు వెళుతున్నారు. అందుకు తగ్గట్టుగానే.. ధోనీ కూడా తన కేమియోలతో ఫ్యాన్స్‌ని అలరిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చివర్లో వచ్చి, తన మెరుపులతో ఫ్యాన్స్‌ని సంతోషపెట్టడమే కాదు.. ప్రత్యర్థి బౌలర్లను కూడా వణికిస్తున్నాడు. మొన్న ముంబై ఇండియన్స్, నిన్న లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో ఇదే జరిగింది. కానీ ధోనీ ఫ్యాన్స్‌లో ఏదో వెలితి! ధోనీని చివరి వరకు ఎందుకు పంపడం లేదు? బ్యాటింగ్ ఆర్డర్లో ముందే ధోనీని పెట్టొచ్చు కదా? చివర్లో పంపడం వల్ల ధోనీ బ్యాటింగ్‌ని ఎక్కువ సేపు చూడలేకపోతున్నాము అని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ విషయంపై సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తాజాగా స్పందించాడు. అతని మాటలు వింటే.. ధోనీ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూసే!
ధోనీ ఎందుకు ముందు బ్యాటింగ్‌కి రావట్లేదు?
ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్ తర్వాత.. మీడియాతో మాట్లాడాడు స్టీఫెన్ ఫ్లెమింగ్.
"ధోనీ ఒక ఇన్స్పిరేషన్. ట్రైనింగ్‌లో చాలా గ్యాప్ వచ్చినా, తక్కువసేపే ట్రైనింగ్ చేసినా.. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వాస్తవానికి.. ధోనీ బ్యాటింగ్ మా టీమ్‌కి ఆశ్చర్యం అనిపించలేదు. ప్రీ సీజన్లో అతను చూపించిన స్కిల్‌ని చూస్తే.. ఈ సీజన్లో ఎలా ఆడతాడే మాకు అర్థమైపోయింది. ఇక.. ధోనీని బ్యాటింగ్ ఆర్డర్లో ఎందుకు ముందు పంపడం లేదని అడుగుతున్నారు. ధోనీకి మోకాలు సమస్య ఉన్న విషయం తెలిసిందే. దాని నుంచి ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాడు. అందుకే.. లిమిటెడ్ బాల్స్ ఆడాల్సి వస్తోంది," అని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు.
LSG vs CSK IPL 2024 : అంటే.. ఐపీఎల్ 2024 మిగిలిన మ్యాచుల్లో కూడా.. ధోనీ ముందు బ్యాటింగ్‌కి రాకపోవచ్చు! జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉంటే తప్ప.. ధోనీ ఇప్పుడు ఆడుతున్న స్థానంలోనే కొనసాగవచ్చు. ధోనీ బ్యాటింగ్‌ని చూద్దామనుకుంటున్న వారికి ఇది కాస్త బాధకలిగించే వార్తే!
ఇదీ చూడండి:- MS Dhoni IPL : ధోనీపై డికాక్ భార్య పోస్ట్ వైరల్.. ఆ 'వార్నింగ్'ని చూపిస్తూ..
"ధోనీ 2-3 ఓవర్ల కామియోలో అద్భుతంగా రాణిస్తున్నాడు. మిగిలిన బాధ్యత బ్యాటింగ్ యూనిట్‌దే. వారు మంచిగా ఆడితే.. చివర్లో ధోనీ వచ్చి, స్కోర్‌ని మరింత పెంచుతాడు. అతని బ్యాటింగ్ చూడటానికి చాలా బాగుంది. ధోనీ ఘనతలకు మాకు చాలా గర్వంగా ఉంది. అతనికి దక్కుతున్న ప్రేమ చూసి మార్వెల్ అవుతున్నాము. ధోనీ మా టీమ్‌లో ఉండటం.. మాకు చాలా గర్వంగా ఉంది. సీఎస్కే గుండెచప్పుడు.. ధోనీ," అని చెప్పుకొచ్చాడు ఫ్లెమింగ్.
ఎల్ఎస్జీ చేతిలో సీఎస్కే ఓటమి..
శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2024 మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతమే చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కు చిత్తుగా ఓడించింది. 177 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ మరో ఓవర్ మిగిలి ఉండగానే చేజ్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం