MS Dhoni IPL : ధోనీపై డికాక్​ భార్య పోస్ట్​ వైరల్​.. ఆ 'వార్నింగ్​'ని చూపిస్తూ..-ms dhoni ipl 2024 lsg vs csk de kocks wife receives hearing loss warning as ms comes out to bat ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni Ipl : ధోనీపై డికాక్​ భార్య పోస్ట్​ వైరల్​.. ఆ 'వార్నింగ్​'ని చూపిస్తూ..

MS Dhoni IPL : ధోనీపై డికాక్​ భార్య పోస్ట్​ వైరల్​.. ఆ 'వార్నింగ్​'ని చూపిస్తూ..

Sharath Chitturi HT Telugu
Apr 20, 2024 09:26 AM IST

MS Dhoni IPL 2024 : ఎల్​ఎస్​జీతో మ్యాచ్​లో ధోనీ మెరుపులు చూసి ఫ్యాన్స్​ థ్రిల్​ అయ్యారు. ఈ నేపథ్యంలో ధోనీపై ఎల్​ఎస్​జీ ప్లేయర్​ డికాక్​ భార్య చేసిన ఓ పోస్ట్​ ఇప్పుడు వైరల్​గా మారింది.

ఎంఎస్​ ధోనీ
ఎంఎస్​ ధోనీ (HT_PRINT)

MS Dhoni IPL LSG : ఐపీఎల్ 2024లో ఎంఎస్ ధోనీ ఇస్తున్న కేమియోలు.. అతడి అభిమానులను పిచ్చెక్కిస్తోంది. ధోని మెరుపులు చూసి.. ఫ్యాన్స్​ థ్రిల్​ అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం.. ముంబై ఇండియన్స్​తో మ్యాచ్​లో అతని క్విక్ ఫైర్.. జట్టు గెలుపునకు కారణమైంది. తొలి ఇన్నింగ్స్ చివరి ఓవర్​లో బ్యాటింగ్ కు వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్​మన్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్​లో హ్యాట్రిక్ సిక్సర్లు, డబుల్స్​తో రాణించాడు. ఈ షాట్​లు చూసిన వారు.. వింటేజ్​ ధోనీ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక అది మర్చిపోకముందే.. ఫ్యాన్స్​కి మరోసారి ట్రీట్​ ఇచ్చాడు ధోనీ. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్​తో జరిగిన మ్యాచ్​లో.. 9 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 28 పరుగులు చేసి.. ఫ్యాన్స్​ని ఉర్రూతలూగించాడు. వీటన్నింటి మధ్య.. ధోనీపై ఎల్​ఎస్​జీ ప్లేయర్​ డికాక్​ భార్య చేసిన ఓ పోస్ట్​ ఇప్పుడు వైరల్​గా మారింది. అదేంటంటే..

ధోనీ వస్తుంటే.. చెవులకు చిల్లే!

ధోనీకి ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. అతడిని చూడాలని.. చాలా మంది స్టేడియంలకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా.. ధోనీ ఎప్పుడు బ్యాటింగ్​కి వచ్చినా.. స్టేడియం మొత మోగిపోతోంది. ఐపీఎల్​ 2024లో ధోనీ ఆడిన ప్రతీ మ్యాచ్​లో ఇదే పరిస్థితి. ఇక శుక్రవారం ఎల్​ఎస్​జీతో మ్యాచ్​లో కూడా ఇదే జరిగింది! అతను బ్యాటింగ్​కు వచ్చినప్పుడు లక్నోలోని ప్రేక్షకులు అతని బ్యాటింగ్ కోసం మాత్రమే ఎదురు చూస్తున్నట్లు అనిపించింది. వారి అరుపులకు హద్దు లేకుండా పోయింది. ధోనీ ఎంట్రీకి సంబంధించి.. స్టేడియంలో సౌండ్ లెవల్ ఆకాశమంత ఎత్తుకు వెళ్లిందంటూ ఎల్ఎస్​జీ స్టార్ క్వింటన్ డికాక్ భార్య సాషా ఓ పోస్ట్​ చేశారు. తన స్మార్ట్​వాచ్​లో కనిపించిన వార్నింగ్​ని.. ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశారు.

MS Dhoni IPL latest news : తన స్మార్ట్​వాచ్ ప్రకారం.. సౌండ్ లెవల్ 95 డెసిబుల్స్​ను తాకిందని ఆమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఆ స్మార్ట్​వాచ్​లోని సందేశమే అందరి దృష్టిని ఆకర్షించింది. సౌండ్ లెవల్స్ 95 డెసిబుల్స్​కు చేరుకున్నాయి. ఈ స్థాయిలో కేవలం 10 నిమిషాలు ఉన్నా.. తాత్కాలిక వినికిడి లోపానికి కారణమవుతాయి.

డికాక్​ భార్య పోస్ట్​..
డికాక్​ భార్య పోస్ట్​..

ఇక మ్యాచ్​ విషయానికొస్తే.. ధోనీ, జడేజా రాణించినా చెన్నైకి ఓటమి తప్పలేదు! 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎల్ఎస్​జీ జట్టు 19 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఈ సీజన్​లో ఏడు మ్యాచులాడిన ధోనీ.. ఐదుసార్లు బ్యాటింగ్ చేసి 37*అత్యధిక స్కోరుతో 87 పరుగులు చేశాడు.

మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. “మేము బ్యాట్​తో బాగా ఆడాం. పవర్ ప్లే తర్వాత మాకు లభించిన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేక క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూనే ఉన్నాం. మేం 10-15 పరుగులు తక్కువగా ఉన్నామని చెప్పగలను. ఇంతటి స్కోరుతో కాస్త కష్టమే, ఇంపాక్ట్ ప్లేయర్​ రూల్​తో 10-15 లేదా 20 పరుగులు అదనంగా అవసరం,” అని తెలిపాడు.

IPL 2024 latest news : ఇలాంటి పిచ్​లలో ఆరంభంలో మందకొడిగా అనిపించినా మంచు కురవడంతో 190 పరుగులు మంచి స్కోర్ అయ్యేవని గైక్వాడ్​ అన్నాడు. “పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాం. దీంతో ప్రతిపక్షాలపై ఒత్తిడి పెరుగుతుంది. దానిపై మనం పనిచేయాలి. మళ్లీ (చెపాక్ లో తదుపరి మ్యాచ్) ఆడటం బాగుంది. ఇప్పుడు మూడు హోమ్ మ్యాచులు ఉన్నందున మంచి హోంవర్క్​తో బరిలోకి దిగుతాం,” అని తెలిపాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం