Glenn Maxwell IPL : ‘వస్తాడు.. ఔట్​ అవుతాడు.. రిపీట్​’- 6 మ్యాచు​ల్లో 3 డకౌట్స్​- ఇదేం చెత్త బ్యాటింగ్​?-glenn maxwell out for duck for the third time in ipl 2024 netizens react ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Glenn Maxwell Ipl : ‘వస్తాడు.. ఔట్​ అవుతాడు.. రిపీట్​’- 6 మ్యాచు​ల్లో 3 డకౌట్స్​- ఇదేం చెత్త బ్యాటింగ్​?

Glenn Maxwell IPL : ‘వస్తాడు.. ఔట్​ అవుతాడు.. రిపీట్​’- 6 మ్యాచు​ల్లో 3 డకౌట్స్​- ఇదేం చెత్త బ్యాటింగ్​?

Sharath Chitturi HT Telugu
Apr 12, 2024 06:34 AM IST

Glenn Maxwell IPL 2024 : ‘మ్యాక్స్​వెల్​ని ఇంకా టీమ్​లో ఎందుకు ఉంచుతున్నారు?’ అని ఆర్సీబీపై మండిపడుతున్నారు ఫ్యాన్స్​. ఐపీఎల్​ 2024లో ఆడిన ఆరు మ్యాచుల్లో.. 3సార్లు డకౌట్​ అయ్యాడు మ్యాక్స్​వెల్​.

ఐపీఎల్​ 2024లో మ్యాక్స్​వెల్​ దారుణ ప్రదర్శన..
ఐపీఎల్​ 2024లో మ్యాక్స్​వెల్​ దారుణ ప్రదర్శన..

Glenn Maxwell IPL 2024 stats : ఐపీఎల్​ 2024లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు (ఆర్సీబీ)తో పాటు ఆ జట్టు స్టార్​ ప్లేయర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్​తో గురువారం జరిగిన మ్యాచ్​లో చిత్తుగా ఓడింది ఆర్సీబీ. మరీ ముఖ్యంగా.. ఈ సీజన్​లో ఆడిన 6 మ్యాచ్​లలో మ్యాక్స్​వెల్​ 3సార్లు డకౌట్​ అవ్వడం గమనార్హం! మ్యాక్స్​వెల్​పై, అతడిని ఇంకా జట్టులో ఉంచిన ఆర్సీబీపై ఫ్యాన్స్​ విరుచుకుపడుతున్నారు.

ఐపీఎల్​ 2024లో మ్యాక్స్​వెల్​ చెత్త ప్రదర్శన..

నిజం చెప్పాలంటే.. ఐపీఎల్​లో డ్యాషింగ్​, ఎక్స్​ప్లోజివ్​ బ్యాటర్స్​లో ఒకడు మ్యాక్స్​వెల్​. ఒంటి చేత్తో మ్యాచ్​లను గెలిపించే సత్తా అతడి సొంతం. గతంలో చాలా మ్యాచ్​లను మలుపు తిప్పాడు కూడా. కానీ ఐపీఎల్​ 2024లో మాత్రం.. అసలు బ్యాటింగ్​ చేయడమే రాని వ్యక్తిగా ఆడుతున్నాడు ఈ ఆస్ట్రేలియన్​ స్టార్​ ప్లేయర్​.

Maxwell IPL 2024 stats : ఈ సీజన్​ తొలి మ్యాచ్​లో డకౌట్​ అయిన మ్యాక్స్​వెల్​.. రెండో మ్యాచ్​లో 3 పరుగులు, మూడో మ్యాచ్​లో 28 పరుగులు, నాలుగో మ్యాచ్​లో సున్నా, ఐదో మ్యాచ్​లో 1 పరుగు మాత్రమే చేశాడు. ఇక గురువారం.. ముంబై ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో కూడా.. ఇలా క్రీజ్​లోకి వచ్చి, అలా డకౌట్​ అయ్యి వెళ్లిపోయాడు. మొత్తం మీద చూసుకుంటే.. ఐపీఎల్​ 2024లో ఆరు మ్యాచ్​లు ఆడిన గ్లెన్​ మ్యాక్స్​వెల్​ చేసింది.. 32 పరుగులే!

మరీ ముఖ్యంగా అతను ఔట్​ అవుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాల్​ని బ్యాట్​కు టచ్​ చేయడమే కష్టంగా మారింది. అయితే ఎల్​బీడబ్ల్యూ.. లేకపోతే క్లీన్​ బౌల్డ్​ అన్నట్టు ఉంది ఆర్సీబీ డ్యాషింగ్​ ప్లేయర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​ పరిస్థితి.

MI vs RCB IPL 2024 : గురువారం కూడా ఇదే జరిగింది! ముంబై ఇండియన్స్​తో మ్యాచ్​లో.. రజత్​ పటీదార్​ ఔటైన తర్వాత క్రీజ్​లోకి వచ్చిన మ్యాక్స్​వెల్​.. 4 బంతులాడి.. శ్రేయస్​ గోపాల్​ బౌలింగ్​లో, ఎల్​బీడబ్ల్యూ రూపంలో వికెట్​ సమర్పించుకుని పెవీలియన్​ చేరాడు.

ఐపీఎల్​ 2024లో ఇలా క్రీజ్​లోకి వచ్చి, ఇలా వెళుతున్న మ్యాక్స్​వెల్​పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. చాలా మంది ఫన్నీ మీమ్స్​ పోస్ట్​ చేస్తున్నారు.

"గ్లెన్​ మ్యాక్స్​వెల్​.. ఆస్ట్రేలియాకు పులిలా ఆడుతాడు. ఆర్సీబీకి పిల్లిలా ఆడతాడు," అని ఓ నెటిజెన్​ పోస్ట్​ చేశారు. "ఈ ఐపీఎల్​లో ఆస్ట్రేలియా ప్లేయర్స్​ అందరు దారుణంగా ఆడుతున్నారు," అని మరో వ్యక్తి పేర్కొన్నారు. "బ్యాటింగ్​ చేయడు, బౌలింగ్​ చేయడు.. తింటాడు, తాగుతాడు.. ఫీల్డ్​లోకి వస్తాడు," అని ఓ నెటిజన్​ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Maxwell RCB IPL 2024 : "మ్యాక్స్​వెల్​ని వదిలించుకోండి. అతను ఆర్సీబీకి ఇక ఎప్పటికీ ఆడకూడదు," అని మరో నెటిజన్​ కామెంట్​ చేశారు. "4 బాల్స్​ ఆడిన ఔటైన్​ మ్యాక్స్​వెల్​.. సంతోషం! కనీసం అతడైనా కన్సిస్టెంట్​గా డిసప్పాయింట్​ చేస్తున్నాడు," అని మరో వ్యక్తి పేర్కొన్నారు. "ఆడితే.. గ్రేటెస్ట్​ ఇన్నింగ్స్​ ఆడతాడు.. లేకపోతే ది మోస్ట్​ ఇర్రెస్పాన్సిబుల్​ ఇన్నింగ్స్​ ఆడతాడు," అని మరో నెటిజన్​ రాసుకొచ్చారు.

ఇక డేటా విషయానికొస్తే.. ఐపీఎల్​ చరిత్రలో అత్యధిక డకౌట్స్​ రేసులో ముగ్గురు ప్లేయర్లు పోటీపడుతున్నారు! దినేశ్​ కార్తిక్​, రోహిత్​ శర్మ, గ్లెన్​ మ్యాక్స్​వెల్​లు.. ఇప్పటివరకు 17సార్లు సున్నా చేసి పెవీలియన్​కి వెళ్లారు. ఆ తర్వాతి స్థానంలో.. 15 డకౌట్స్​ల రషీద్​ ఖాన్​, పీయుష్​ చావ్లా, సునీల్​ నరైనీ, మన్​దీప్​ సింగ్​లు ఉన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం