KKR vs SRH : 'రూ. 25 కోట్లు ఉఫ్'- మిచెల్ స్టార్క్‌పై దారుణంగా ట్రోలింగ్!
24 March 2024, 10:08 IST
- Mitchell Starc IPL : కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో 4 ఓవర్లకు 53 రన్స్ ఇచ్చిన మిచెల్ స్టార్క్‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు! స్టార్క్.. ఐపీఎల్‌ని మధ్యలోనే వదిలేస్తాడని అంటున్నారు.
కేకేఆర్ ప్లేయర్ మిచెల్ స్టార్క్..
Mitchell Starc IPL 2024 price : ఐపీఎల్ రెండో రోజే.. రసవత్తర మ్యాచ్ చూసి క్రికెట్ లవర్స్ థ్రిల్ అయిపోయారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని 4 పరుగులు తేడాతో ఓడించింది కోల్‌కతా నైట్ రైడర్స్. చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన పోరులో కేకేఆర్ పైచేయి సాధించింది. హెన్రిక్ క్లాసెన్ వీర మాస్ హిట్టింగ్(29 బాల్స్‌లో 63 పరుగులు) వృథా అయ్యింది. వీటన్నింటి మధ్య.. ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్, కేకేఆర్ ప్లేయర్ మిచెల్ స్టార్క్‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఐపీఎల్ 2024లో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా ఉన్న స్టార్క్.. మొదటి మ్యాచ్‌లోనే బౌలింగ్‌లో హాఫ్ సెంచరీ కొట్టడం ఇందుకు కారణం.
'రూ. 25 కోట్లు ఉఫ్..'!
ఆస్ట్రేలియా జట్టులో సీనియర్ ప్లేయర్‌గా ఉన్న మిచెల్ స్టార్క్.. ఐపీఎల్లో ఆడి 9ఏళ్లు అయ్యింది. కానీ.. ఐపీఎల్ 2024 కోసం మిచెల్ స్టార్క్‌ని రూ. 24.75 కోట్లు కొనుక్కుంది కేకేఆర్. అప్పట్లో ఇది పెద్ద షాకింగ్‌గానే అనిపించింది. ఇక శనివారం జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్స్, తన స్పెల్‌లో మూడు ఓవర్లకు 27 పరగులు ఇచ్చాడు మిచెల్ స్టార్క్. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో.. 19వ ఓవర్ వేశాడు ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్. ఆ ఒక్క ఓవర్లో.. ఏకంగా 26 పరుగులు సమర్పిచుకున్నాడు. ఆ ఓవర్లో 4 సిక్స్‌లు ఇచ్చుకున్నాడు. చివరికి.. 4 ఓవర్లకు 53 పరగులు ఇచ్చాడు స్టార్క్.
ఐపీఎల్ 2024లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ ప్రదర్శన చూసిన కేకేఆర్ అభిమానులు, క్రికెట్ లవర్స్ షాక్ అవుతున్నారు. అతడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
KKR vs SRH highlights : "మిచెల్ స్టార్క్.. ఐపీఎల్‌ని మధ్యలోనే ఒదిలేస్తాడు. అతడి బౌలింగ్‌ని మరీ దారుణంగా కొట్టకండి," అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
"ప్రతి మ్యాచ్‌లోనూ బౌలింగ్‌తో హాఫ్ సెంచరీ కొట్టడానికి.. మిచెల్ స్టార్క్‌ని రూ. 25 కోట్లు పెట్టి కొంది కేకేఆర్," అని మరో క్రికెట్ లవర్ రాసుకొచ్చారు.
"మిచెల్ స్టార్క్‌ని గ్రౌండ్ మొత్తం స్మాష్ చేశారు. విధ్వంసం సృష్టించారు," అని మరో వ్యక్తి ట్వీట్ చేశాడు.
ప్యాట్ కమిన్స్ పరిస్థితేంటి..?
టీ20 మ్యాచ్‌లో స్కోర్ 200 దాటిందంటేనే.. ప్రత్యర్థి జట్టు బౌలింగ్ ప్రదర్శన ఎలా ఉందో అర్థమైపోతుంది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా తేలిపోయింది. మోస్ట్ ఎక్స్పీరియెన్స్డ్ బౌలర్ భువనేశ్వర్ అయితే.. 4 ఓవర్లలో ఏకంగా 51 పరుగులు ఇచ్చేశాడు. మార్కో జాన్సన్ 3 ఓవర్లకు 40 రన్స్ ఇచ్చేశాడు.
KKR vs SRH live score : ఇక.. ఐపీఎల్లో మరో ఎక్స్పెన్సివ్ ప్లేయర్, ఎస్ఆర్హెచ్ సారథి ప్యాట్ కమిన్స్ కూడా అంచనాలను అందుకోలేకపోయాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 4 ఓవర్లకు 32 పరుగులు తీసి, 1 వికెట్ తీశాడు. ఇతరులతో పోల్చుకుంటే పర్లేదు కానీ.. అతని ఎకనామీ కూడా 8లోనే ఉంది.
ఐపీఎల్ 2024 ఇప్పుడే మొదలైంది. ఒక్క మ్యాచ్ చూసి మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ప్రదర్శనను అంచనా వేయకూడదు. మరి.. ఈ సీజన్లో వీరిద్దరు ఏ మేరకు ప్రదర్శన చేస్తారో చూడాలి!