IPL 2024 Today: ఐపీఎల్‍లో నేడు డబుల్ ధమాకా- రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచ్‍లు.. ఆ ఇద్దరిపైనే అందరి దృష్టి.. తుది జట్లు ఇలా!-ipl 2024 day 3 rr will take on lsg and all eyes on rohit sharma hardik pandya in mumbai indian vs gujarat titans clash ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Today: ఐపీఎల్‍లో నేడు డబుల్ ధమాకా- రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచ్‍లు.. ఆ ఇద్దరిపైనే అందరి దృష్టి.. తుది జట్లు ఇలా!

IPL 2024 Today: ఐపీఎల్‍లో నేడు డబుల్ ధమాకా- రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచ్‍లు.. ఆ ఇద్దరిపైనే అందరి దృష్టి.. తుది జట్లు ఇలా!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 24, 2024 09:05 AM IST

IPL 2024 Today Matches - RR vs LSG, MI vs GT: ఐపీఎల్ 2024 టోర్నీలో నేడు కూడా రెండు మ్యాచ్‍లు జరగనున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మపై అందరి కళ్లు ఉండనున్నాయి.

IPL 2024 Today: ఐపీఎల్‍లో నేడు డబుల్ ధమాకా- రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచ్‍లు.. ఆ ఇద్దరిపైనే అందరి దృష్టి.. తుది జట్లు ఇలా!
IPL 2024 Today: ఐపీఎల్‍లో నేడు డబుల్ ధమాకా- రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచ్‍లు.. ఆ ఇద్దరిపైనే అందరి దృష్టి.. తుది జట్లు ఇలా! (IPL)

IPL 2024 Today: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 టోర్నీలో మూడో రోజైన నేడు (మార్చి 24) రెండు మ్యాచ్‍లు జరగనున్నాయి. వీకెండ్‍‍లో డబుల్ హెడర్ ధమాకా ఉండనుంది. నేడు మధ్యాహ్నం మ్యాచ్‍లో రాజస్థాన్ రాయల్స్ జట్టును లక్నో సూపర్ జెయింట్స్ ఢీకొట్టనుంది. కాగా, రాత్రి జరగనున్న ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‍పై విపరీతమైన ఆసక్తి ఉంది. ఈ రెండు మ్యాచ్‍ల వివరాలివే..

రాజస్థాన్, లక్నో పోరు

RR vs LSG: ఐపీఎల్ 2024 సీజన్‍లో తమ తొలి పోరుకు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ రెడీ అయ్యాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‍సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. హోం గ్రౌండ్‍లో గెలిచి శుభారంభం చేయాలని సంజూ శాంసన్ సారథ్యంలోని రాయల్స్ తహతహలాడుతోంది. మరోవైపు, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇటీవలే గాయం నుంచి కోలుకున్నాడు. ఫిట్‍నెస్ క్లియరెన్స్ సాధించాడు. గతేడాది ప్లేఆఫ్స్ వరకు లక్నో చేరగలిగింది. ఈసారి కూడా సత్తాచాటాలని పట్టుదలగా ఉంది.

రాజస్థాన్ రాయల్స్ తుదిజట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రన్ హిట్మైర్, రియాన్ పరాగ్, రావ్మన్ పోవెల్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, యజువేంద్ర చాహల్

లక్నో సూపర్‌జెయింట్స్ తుదిజట్టు (అంచనా): క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), దేవ్‍దత్ పడిక్కల్, దీపక్ హుడా, కేఎల్ రాహుల్ (కెప్టెన్), నికోలస్ పూరన్, మార్కస్ స్టొయినిస్, ఆయుశ్ బదోనీ, కృణాల్ పాండ్యా, షెమార్ జోసెఫ్ / నవీనుల్ హక్, రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్

టైమ్: రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఈ మ్యాచ్ నేటి మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలవుతుంది.

ముంబై vs గుజరాత్.. ముంబై సారథిగా హార్దిక్

MI vs GT: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నేటి రాత్రి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. 2015 నుంచి 2021 వరకు ఐపీఎల్‍లో ముంబై తరఫున ఆడిన హార్దిక్ పాండ్యా.. రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఆ జట్టులోకి వచ్చేశాడు. 2022, 2023 సీజన్లలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్దిక్ కెప్టెన్సీ చేశాడు. 2022లో గుజరాత్‍కు టైటిల్ అందించిన పాండ్యా.. గతేడాది జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అలాంటి పాండ్యాను మళ్లీ ముంబై తిరిగి తీసుకొచ్చుకొని కెప్టెన్సీ ఇచ్చింది. గత రెండు సీజన్లుగా తాను సారథిగా వ్యవహరించిన గుజరాత్‍పై.. ఇప్పుడు ముంబై కెప్టెన్‍గా పాండ్యా ఆడనున్నాడు.

రోహిత్, హార్దిక్‍పై అందరి కళ్లు

2024 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ నుంచి తీసుకొచ్చిన హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‍ను చేసింది. జట్టుకు ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను తప్పించి మరీ.. హార్దిక్‍కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. దీంతో ఈ సీజన్‍లో హార్దిక్ కెప్టెన్సీలో రోహిత్ ఆటగాడిగా బరిలోకి దిగనున్నాడు. దీంతో ఈ మ్యాచ్‍లో అందరి దృష్టి హార్దిక్, రోహిత్‍పైనే ఉండనుంది.

గిల్ కెప్టెన్సీలో..

హార్దిక్ పాండ్యా.. ముంబైకు వెళ్లిపోవటంతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‍గా యంగ్ ప్లేయర్ శుభ్‍మన్ గిల్ నియమితుడయ్యాడు. అతడు జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడోనని కూడా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మొత్తంగా ముంబై, గుజరాత్ పోరు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‍గా సాగనుంది. ఈ సీజన్‍లో శుభారంభం చేసేందుకు ముంబై, గుజరాత్ పట్టుదలగా ఉన్నాయి.

గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు (అంచనా): శుభ్‍మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్/అజ్మతుల్లా ఒమర్‌జాయి, డేవిడ్ మిల్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, స్పెన్సెర్ జాన్సన్, మోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్ తుదిజట్టు (అంచనా): రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నేహాల్ వదేరా, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, పియూష్ చావ్లా, జస్‍ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారా/క్వెనా ఎంఫకా, ఆకాశ్ మధ్వాల్

టైమ్: ముంబై, గుజరాత్ మధ్య మ్యాచ్ నేటి (మార్చి 24) రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానెళ్లు, జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఐపీఎల్ 2024 మ్యాచ్‍ల లైవ్ చూడొచ్చు.

Whats_app_banner