Virat Kohli - Rohit Sharma: ఆర్సీబీ క్యాంప్‍లో జాయిన్ అయిన కోహ్లీ.. ముంబై డెన్‍లో రోహిత్ శర్మ: వీడియోలు చూసేయండి
IPL 2024 Virat Kohli - Rohit Sharma: ఐపీఎల్ 2024 సమీపిస్తోంది. ఈ తరుణంలో భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ ఫ్రాంచైజీల క్యాంప్‍లకు నేడు వెళ్లారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీలు పోస్ట్ చేశాయి. ఆ వివరాలివే..
Virat Kohli - Rohit Sharma: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) సమీపిస్తోంది. మరో మూడు రోజుల్లో మార్చి 22వ తేదీన ఈ టోర్నీ షురూ కానుంది. ఈ తరుణంలో భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నేడు (మార్చి 18) తమ ఫ్రాంచైజీలతో కలిశారు. ముంబై ఇండియన్స్ క్యాంప్(MI)లో రోహిత్ శర్మ అడుగుపెట్టాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ క్యాంప్‍కు విరాట్ కోహ్లీ వెళ్లాడు.
పుల్ షాట్‍గా మాస్టర్.. ముంబై కా రాజా
రోహిత్ శర్మ వచ్చేశాడంటూ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ నేడు ఓ వీడియో పోస్ట్ చేసింది. ముందుగా ఇద్దరి పిల్లలతో ఈ వీడియో మొదలైంది. రోహిత్ వచ్చేస్తున్నాడంటూ ఓ పిల్లాడు అంటారు. “పుల్ షాట్ కా మాస్టర్.. ముంబై కా రాజా” వచ్చేస్తున్నాడని చెబుతాడు. అప్పుడు రోహిత్ శర్మ కారులో నుంచి దిగుతారు. బ్యాక్ పట్టుకొని అలా హోటల్‍లోకి హిట్ మ్యాన్ వచ్చేశాడు. ఈ వీడియోకు అదిరిపోయే బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍ను యాడ్ చేసింది ముంబై ప్రాంచైజీ.
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్‍గా ఐదు టైటిళ్లను అందించి సక్సెస్ ఫుల్ టీమ్‍గా నిలిపిన రోహిత్ శర్మ.. ఈసారి కేవలం ఆటగాడిగానే ఆడనున్నాడు. ఐపీఎల్ 2024 కోసం రోహిత్‍ను తప్పించి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్‍ను చేసింది. గుజరాత్ టైటాన్స్ నుంచి తిరిగి తీసుకొచ్చి మరీ పాండ్యాకు సారథ్య పగ్గాలు అప్పగించింది.
అయితే, రోహిత్ చేయి ఎప్పుడూ తన భుజంపై ఉంటుందని, అతడి సాయం ఎప్పుడూ తనకు అవసరమని హార్దిక్ పాండ్యా చెప్పాడు. రోహిత్ శర్మ టీమిండియాకు కెప్టెన్ అని, అది కూడా తనకు చాలా తోడ్పాటుగా ఉంటుందని అన్నాడు.
ఆర్సీబీ క్యాంప్‍లో కోహ్లీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కలిశాడు. రెండో సంతానం కలగడటంతో స్వదేశంలో ఇంగ్లండ్‍తో జరిగిన టెస్టు సిరీస్‍కు కోహ్లీకి పూర్తిగా దూరమయ్యాడు. రెండు నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాడు. దీంతో ఐపీఎల్ 2024లో కోహ్లీ ఆడతాడా లేదా అనే సందేహాలు కూడా వచ్చాయి. అయితే, నేడు బెంగళూరు క్యాంపుకు కోహ్లీ రావడంతో అనుమానాలు తీరిపోయాయి. ఆర్సీబీ తరఫున బరిలోకి దిగేందుకు కోహ్లీ సిద్ధమయ్యాడు. నేడు ట్రైనింగ్ సెషన్‍లోనూ కోహ్లీ పాల్గొన్నాడు.
విరాట్ కోహ్లీ వచ్చిన వీడియోను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో నేడు పోస్ట్ చేసింది. బెంగళూరుకు రావడం తనకు ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందని కోహ్లీ అన్నాడు. చాలా ఉత్సాహంగా ఉందని చెప్పాడు. అభిమానులు కూడా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నానని అన్నాడు.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు ఫిబ్రవరి 15న రెండో సంతానంగా అకాయ్ అనే కుమారుడు జన్మించారు. ఇందుకోసం క్రికెట్‍కు రెండు నెలలు బ్రేక్ తీసుకున్నాడు కోహ్లీ. ఆదివారమే ఇండియాకు తిరిగి వచ్చాడు.
ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22వ తేదీన మొదలుకానుంది. తొలి మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ సీజన్‍లో మొదటి మ్యాచ్‍ను గుజరాత్ టైటాన్స్ జట్టుతో మార్చి 24న ఆడనుంది ముంబై ఇండియన్స్.