IPL 2024 Schedule: ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసింది.. ధోనీ డెన్‍లోనే తొలి పోరు.. 21 మ్యాచ్‍ల తేదీలు ఖరారు
IPL 2024 Schedule in Telugu: ఐపీఎల్ 2024 తొలి దశ షెడ్యూల్‍ను బీసీసీఐ ప్రకటించింది. 21 మ్యాచ్‍ల తేదీలను వెల్లడించింది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (RCB) జట్ల మధ్య జరగనుంది.
IPL 2024 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22వ తేదీన ఈ ఏడాది ఐపీఎల్ 2024 టోర్నీ షురూ కానుంది. ఈ ఏడాది లోక్‍సభ ఎన్నికల కారణంగా షెడ్యూల్‍ను రెండు దశల్లో ప్రకటించాలని బీసీసీఐ ఫిక్స్ అయింది. ఇందులో భాగంగా నేడు (ఫిబ్రవరి 22) తొలి దశ షెడ్యూల్ వెల్లడించింది. తొలి 21 మ్యాచ్‍ల తేదీలను ఖరారు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (RBC) జట్ల మధ్య ఐపీఎల్ 2024లో మొదటి మ్యాచ్ జరగనుంది.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ డెన్‍గా భావించే ఎంఏ చిదంబరం చెపాక్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. సీఎస్‍కే, ఆర్సీబీ ఫస్ట్ పోరులో మార్చి 22న తలపడనున్నాయి. ఈ మ్యాచ్‍కు ముందు స్టేడియంలో భారీ స్థాయిలో ఓపెనింగ్ సెర్మనీ కూడా ఉండనుంది. 15 రోజుల పాటు ఏప్రిల్ 7వ తేదీ వరకు జరిగే 21 మ్యాచ్‍ల షెడ్యూల్‍ను ఈ తొలి దశలో బీసీసీఐ వెల్లడించింది. ఈ 15 రోజుల్లో నాలుగు రోజులు డబుల్ హెడర్స్ (ఒక రోజే రెండు మ్యాచ్‍లు) ఉండనున్నాయి.
ఈ 15 రోజుల్లో నాలుగు రోజులు డబుల్ హెడర్స్ (ఒక రోజే రెండు మ్యాచ్‍లు) ఉండనున్నాయి. ప్రతీ రోజు మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది. డబుల్ హెడర్ ఉన్న రోజుల్లో మధ్యాహ్నం మ్యాచ్ 3.30 గంటలకు ప్రారంభం అవుతుంది. తొలి నాలుగు రోజుల్లోనే 10 జట్లు ఒక్కో మ్యాచ్ ఆడేలా ఐపీఎల్ 2024 సీజన్ తొలి దశ షెడ్యూల్‍ను బీసీసీఐ రూపొందించింది.
ఈ ఐపీఎల్ 2024 తొలి దశలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), గుజరాత్ టైటాన్స్ (GT), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు చెరో ఐదు మ్యాచ్‍లు ఆడనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), పంజాబ్ కింగ్స్ (PBKS), లక్నో సూపర్ జెయింట్స్ (LGS), ముంబై ఇండియన్స్ (MI), రాజస్థాన్ రాయల్స్ (RR) చెరో నాలుగు మ్యాచ్‍లు ఆడనున్నాయి. కోల్‍కతా నైట్ రైడర్స్ (KKR) టీమ్ మూడు మ్యాచ్‍లు ఆడనుంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఇలా..
ఈ తొలి దశలో సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగు మ్యాచ్‍లు ఆడనుంది. కోల్‍కతా వేదికగా మార్చి 23న కోల్‍కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడుతుంది. మార్చి 27న హైదరాబాద్‍లో ముంబై ఇండియన్స్ టీమ్‍తో, మార్చి 31న గుజరాత్ టైటాన్స్‌తో, ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాద్‍లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సన్‍రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
ఐపీఎల్ 2024 తొలి దశ 21 మ్యాచ్‍ల షెడ్యూల్
చెన్నై vs బెంగళూరు - మార్చి 22 - చెన్నైలో - రాత్రి 7:30 గంటలకు..
పంజాబ్ vs ఢిల్లీ - మార్చి 23 - మొహాలీలో - మధ్యాహ్నం 3:30 గంటలకు..
కోల్‍కతా vs హైదరాబాద్ - మార్చి 23 - కోల్‌కతాలో - రాత్రి 7:30 గంటలకు..
రాజస్థాన్ vs లక్నో - మార్చి 24 - జైపూర్లో - మధ్యాహ్నం 3:30 గంటలకు..
గుజరాత్ vs ముంబై - మార్చి 24 - అహ్మదాబాద్‍లో - రాత్రి 7:30 గంటలకు..
బెంగళూరు vs పంజాబ్ - మార్చి 25 - బెంగళూరులో - రాత్రి 7:30 గంటలకు..
చెన్నై vs గుజరాత్ - మార్చి 26 - చెన్నైలో - రాత్రి 7:30 గంటలకు..
హైదరాబాద్ vs ముంబై - మార్చి 27 - హైదరాబాద్‍లో - రాత్రి 7:30 గంటలకు..
రాజస్థాన్ vs ఢిల్లీ - మార్చి 28 - జైపూర్లో - రాత్రి 7:30 గంటలకు..
బెంగళూరు vs కోల్‍కతా - మార్చి 29 - బెంగళూరులో - రాత్రి 7:30 గంటలకు..
లక్నో vs పంజాబ్ - మార్చి 30 - లక్నోలో - రాత్రి 7:30 గంటలకు..
గుజరాత్ vs హైదరాబాద్ - మార్చి 31 - అహ్మదాబాద్‍లో - మధ్యాహ్నం 3:30 గంటలకు..
ఢిల్లీ vs చెన్నై - మార్చి 31 - విశాఖపట్నంలో - రాత్రి 7:30 గంటలకు..
ముంబై vs రాజస్థాన్ - ఏప్రిల్ 1 - ముంబైలో - రాత్రి 7:30 గంటలకు..
బెంగళూరు vs లక్నో - ఏప్రిల్ 2 - బెంగళూరులో - రాత్రి 7:30 గంటలకు..
ఢిల్లీ vs కోల్‍కతా - ఏప్రిల్ 3 - విశాఖపట్నంలో - రాత్రి 7:30 గంటలకు..
గుజరాత్ vs పంజాబ్ - ఏప్రిల్ 4 - అహ్మదాబాద్‍లో - రాత్రి 7:30 గంటలకు..
హైదరాబాద్ vs చెన్నై - ఏప్రిల్ 5 - హైదరాబాద్‍లో - రాత్రి 7:30 గంటలకు..
రాజస్థాన్ vs బెంగళూరు - ఏప్రిల్ 6 - జైపూర్‌లో - రాత్రి 7:30 గంటలకు..
ముంబై vs ఢిల్లీ - ఏప్రిల్ 7 - ముంబైలో - మధ్యాహ్నం 3:30 గంటలకు..
లక్నో vs గుజరాత్ - ఏప్రిల్ 7 - లక్నోలో - రాత్రి 7:30 గంటలకు..