తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Airtel Ipl Plans : ఐపీఎల్​ లవర్స్​కి ఎయిర్​టెల్​ క్రేజీ ఆఫర్స్​- ప్లాన్​​ ధరలు తగ్గింపు!

Airtel IPL plans : ఐపీఎల్​ లవర్స్​కి ఎయిర్​టెల్​ క్రేజీ ఆఫర్స్​- ప్లాన్​​ ధరలు తగ్గింపు!

Sharath Chitturi HT Telugu

23 March 2024, 9:19 IST

    • Airtel recharge plans 2024 : ఐపీఎల్​ 2024 నేపథ్యంలో డేటా ప్యాక్​ని తగ్గించింది ఎయిర్​టెల్. వోడాఫోన్​ ఐడియా కూడా పలు ఆసక్తికరమైన ఆఫర్స్​ని ఇస్తోంది. ఆ వివరాలు..
ఐపీఎల్​ లవర్స్​కి ఎయిర్​టెల్​ గుడ్​ న్యూస్​..
ఐపీఎల్​ లవర్స్​కి ఎయిర్​టెల్​ గుడ్​ న్యూస్​.. (HT_PRINT)

ఐపీఎల్​ లవర్స్​కి ఎయిర్​టెల్​ గుడ్​ న్యూస్​..

Airtel IPL Bonanza Data Packs : ఐపీఎల్​ 2024 లవర్స్​కి క్రేజీ న్యూస్​ ఇచ్చింది ఎయిర్​టెల్​. తమ కస్టమర్ల కోసం లిమిటెడ్​ పీరియడ్​ ఐపీఎల్​ ఆఫర్స్​ని తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు.. న్యూ డేటా ప్యాక్స్​ లాంచ్​ చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న డేటా ప్యాక్స్​ని సవరించింది. అంతేకాకుండా.. ఎయిరెట్​ల్​ డిజిటల్​ యూజర్స్​ కోసం స్టార్​స్పోర్ట్స్​తో టైఅప్​ అయ్యింది. వాటిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాము..

ట్రెండింగ్ వార్తలు

Gold price today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

Trading Guide: ఎన్టీపీసీ, వీ గార్డ్ సహా ఈ 8 స్టాక్స్ పై ఈ రోజు దృష్టి పెట్టండి

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

ఎయిర్​టెల్​ ఐపీఎల్​ బొనాన్జా డేటా ప్యాక్స్​..

ప్రస్తుతం ఉన్న రూ. 49, రూ. 99 డేటా ప్యాక్స్​ని రివైజ్​ చేసింది ఎయిర్​టెల్​. వాటిని వరుసగా రూ. 39, రూ. 79కి తీసుకొచ్చింది. ఐపీఎల్​ 2024కోసం క్రికెట్​ అభిమానులకు ఈ డేటా ప్యాక్​ యూజ్​ అవుతుందని సంస్థ చెబుతోంది.

ఎయిర్​టెల్​ 39 డేటా ప్యాక్​ వివరాలు:- 1 డే వాలిడిటీ. అన్​లిమిటెడ్​ డేటా విత్​ ఎఫ్​యూపీ 20 జీబీ. అది దాటితే డేటా స్పీడ్​ 64 కేబీపీఎస్​కి చేరుతుంది.

Airtel data pack recharge plans : ఎయిర్​టెల్​ 79 డేటా ప్యాక్​ వివరాలు:- 2 డే వాలిడిటీ. అన్​లిమిటెడ్​ డేటా విత్​ ఎఫ్​యూపీ 20 జీబీ. ఆ తర్వాత.. డేటా స్పీడ్​ 64 కేబీపీఎస్​కి చేరుతుంది. అంటే.. ఈ ఎయిర్​టెల్​ డేటా ప్యాక్​తో 40 జీబీ హై స్పీడ్​ డేటాని పొందొచ్చు!

ఎయిర్​టెల్​ డిజిటల్​ టీవీ యూజర్స్​ కోసం స్టార్​ స్పోర్ట్స్​ 4జీ..

ప్రీపెయిడ్​ యూజర్స్​కి డేటా ప్యాక్స్​ని తగ్గించిన ఎయిర్​టెల్​.. తమ డీటీహెచ్​ యూజర్స్​, డిజిటల్​ టీవీ వినియోగదారులకు స్టార్​ స్పోర్ట్స్​ 4కే సర్వీస్​ని ప్రవశపెటటింది. ఫలితంగా.. ఈ ఐపీఎల్​ 2024 సీజన్​లో యూజర్​ ఎక్స్​పీరియన్స్​ మరింత మెరుగుపడుతుందని చెబుతోంది. మార్చ్​ 22 నుంచి అన్​ఇంటర్ప్​టెడ్​ లైవ్​ స్ట్రీమింగ్​ పొందొచ్చని అంటోంది.

వోడాఫోన్​ ఐడియా కూడా..

Vodafone Idea IPL 2024 data pack offers : ఐపీఎల్​ 2024 నేపథ్యంలో వోడాఫోన్​ ఐడియా కూడా ప్రత్యేక ఆఫర్స్​ని తీసుకొచ్చింది. రూ. 181 ప్యాక్​పై 50శాతం అదనపు డైలీ డేటా ఇస్తున్నట్టు చెప్పింది. అదే సమయంలో.. రూ. 75 ప్యాక్​పై అదనంగా 25శాతం డైలీ డేటాను ఇస్తున్నట్టు పేర్కొంది.

అంతేకాదు.. వివిధ ప్రీపెయిడ్​ ప్లాన్స్​ ధరలను కట్​ చేసింది వోడాఫోన్​ ఐడియా. రూ. 699 నుంచి రూ. 3,199 వరకు.. రూ. 50- రూ. 100 డిస్కౌంట్స్​ని ఇస్తోంది. ఐపీఎల్​ సీజన్​ మొత్తం ఈ డిస్కౌంట్స్​ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.

వీఐ యాప్​ ద్వారా ఈ ఆఫర్స్​, డిస్కౌంట్స్​ని యాక్సెస్​ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం