తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl Auction Fixing: ఐపీఎల్ వేలంలో ఫిక్సింగ్.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన లలిత్ మోదీ.. ఆయన చేయించారంటూ!

IPL Auction Fixing: ఐపీఎల్ వేలంలో ఫిక్సింగ్.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన లలిత్ మోదీ.. ఆయన చేయించారంటూ!

Sanjiv Kumar HT Telugu

28 November 2024, 12:40 IST

google News
  • Lalit Modi On IPL Auction Fixing N Srinivasan CSK: ఐపీఎల్ వేలంలో ఫిక్సింగ్ జరిగిందని ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్‌ ఐపీఎల్‌ వేలంలో రిగ్గింగ్ చేసినట్లు సంచలన కామెంట్స్ చేశారు లలిత్ మోదీ.

ఐపీఎల్ వేలంలో ఫిక్సింగ్.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన లలిత్ మోదీ.. ఆయన చేయించారంటూ!
ఐపీఎల్ వేలంలో ఫిక్సింగ్.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన లలిత్ మోదీ.. ఆయన చేయించారంటూ!

ఐపీఎల్ వేలంలో ఫిక్సింగ్.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన లలిత్ మోదీ.. ఆయన చేయించారంటూ!

Lalit Modi On IPL Auction Fixing: ఇటీవలే ఐపీఎల్ 2025కు సంబంధించి వేలం విజయవంతంగా పూర్తి అయింది. ఈ నేపథ్యంలో గతంలో ఐపీఎల్ వేలంలో ఫిక్సింగ్ జరిగినట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ సంచలన కామెంట్స్ చేశారు.

చైన్నై సూపర్ కింగ్స్ కోసం

ఐపీఎల్ వేలంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు లలిత్ మోదీ. అతను తన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఐపిఎల్ సమయంలో వేలం వేయడమే కాకుండా, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ల సమయంలో చెన్నైకి చెందిన అంపైర్లను కూడా ఉంచినట్లు వెల్లడించారు.

ఐపీఎల్‌కు అనుకూలంగా

యూట్యూబర్ రాజ్ షమానీ 'ఫిగరింగ్ అవుట్' పాడ్ కాస్ట్‌లో లలిత్ మోదీ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న శ్రీనివాసన్ ఐపీఎల్‌కు అనుకూలంగా లేడని, అతను తనకు వ్యతిరేకంగా వెళ్లడమే కాకుండా చెన్నై నుంచి అంపైర్లను నియమించి.. సీజన్‌లో సీఎస్‌కే మ్యాచ్‌లను ఫిక్స్ చేశారని లలిత్ మోదీ ఆరోపించారు.

అంపైర్ ఫిక్సింగ్

"ఆయనకు (ఎన్ శ్రీనివాసన్) ఐపీఎల్ అంటే ఇష్టం లేదు. ఐఎపీఎల్ వర్కౌట్ అవుతుందని అతను అనుకోలేదు. కానీ, అది వర్కౌట్ అవడం ప్రారంభించినప్పుడు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారు. ఆయన బోర్డు సభ్యుడిగా, కార్యదర్శిగా కూడా ఉన్నారు. అలాగే, ఆయన నాకు పెద్ద ప్రత్యర్థి. నేను అతనికి వ్యతిరేకంగా వెళ్లాను. దాంతో అతను చాలా పనులు చేశారు. అంపైర్ ఫిక్సింగ్ చేసినట్లు చెప్పారు" అని లలిత్ మోదీ తెలిపారు.

బయటపెట్టాలని చూశాను

"నేను ఈ ఒక్క విషయంలోనే అతనిపై ఆరోపణలు చేస్తున్నాను. ఆయన అంపైర్‌ను మార్చేవాడు. కానీ, అప్పుడు నేను రెండు విషయాలు ఆలోచించలేదు. కానీ, అతను చెన్నై మ్యాచ్‌లలో చెన్నై అంపైర్‌ను ఉంచుతున్నాడని అప్పుడు నేను గ్రహించాను. ఇది నాకు సమస్యగా మారింది. దాన్నే ఫిక్సింగ్ అంటారు. కాబట్టి ఆ విషయాన్ని నేను బహిర్గతం చేయడానికి ప్రయత్నించినప్పుడు అతను నాకు పూర్తి వ్యతిరేకం అయ్యాడు" అని లలిత్ మోదీ వెల్లడించారు.

ఆండ్రూ ఫ్లింటాఫ్‌పై వేలం వేయకుండా

లలిత్ మోదీ ఇంకా చెబుతూ.. 2009 సీజన్‌కు ముందు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ను కొనుగోలు చేసేందుకు శ్రీనివాసన్ ఐపీఎల్ వేలాన్ని ఫిక్స్ చేశాడని ఆరోపించారు. దీంతో ఆ ఆటగాడిపై వేలం వేయొద్దని మిగతా ఫ్రాంచైజీలకు సందేశం పంపినట్లు లలిత్ మోదీ అన్నారు.

మేము చేసినట్లు అందరికీ తెలుసు

"వేలంలోని ప్రతి వస్తువును బయటకు తీయండి. శ్రీనివాసన్‌కు ఫ్లింటాఫ్ దక్కేలా నేనే చేశాను. అవును, మేము చేసాము. ఈ విషయం ప్రతి జట్టుకు తెలుసు అనడంలో సందేహం లేదు. శ్రీనివాసన్ ఐపీఎల్ జరగనివ్వడం లేదు. ఆండ్రూ ఫ్లింటాఫ్‌పై వేలం వేయొద్దని మేమే అందరికీ సందేశం పంపాం" అని లలిత్ మోదీ షాకింగ్ విషయాలు బయటపెట్టారు.

మూడు నెలలు మాత్రమే

"శ్రీనివాసన్ నాకు ఫ్లింటాఫ్ కావాలని చెప్పాడు కాబట్టే అలా చేశాను. కానీ, మీరు ఐపీఎల్ లాంటి ఈవెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఒంటిచేత్తో నిర్వహిస్తున్నప్పుడు.. మీరు ప్రతి సమస్యను తొలగించాలి. ఆటకు ఏది పెద్దది అనేదే చూసుకోవాలి. ప్రతి ఆటగాడు మూడు నెలలు మాత్రమే ఒక ఫ్రాంఛైజీకి ఉంటాడు" అని లలిత్ మోదీ పేర్కొన్నారు.

శ్రీనివాసన్ అల్లుడు అరెస్ట్

ఇదిలా ఉంటే, చెన్నై సూపర్ కింగ్స్ 2013లో పెద్ద స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకుంది. దీనికి ఫ్రాంచైజీ ఉన్నతాధికారిగా ఉన్న శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్‌ను ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్ ఆరోపణలపై అరెస్టయ్యాడు. పోలీసుల దర్యాప్తులో బుకీలతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన నటుడు వీరేందర్ "విందూ" దారా సింగ్‌తో గురునాథ్ నిరంతరం ఫోన్‌లో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడైంది.

రెండు సీజన్స్‌లో నిషేధం

ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో విందూ తరచూ సీఎస్‌కే బాక్స్‌లో కనిపించేవాడు. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల యజమానులైన ఇండియా సిమెంట్స్, జైపూర్ ఐపీఎల్‌లను కూడా రెండేళ్ల పాటు సస్పెండ్ చేసిన ఆర్ఎం లోధా కమిటీ అతడిపై జీవితకాల నిషేధం విధించింది. దీంతో సీఎస్‌కే 2016, 2017 సీజన్లలో ఐపీఎల్ ఆడలేదు.

తదుపరి వ్యాసం