Lalit Modi Break up with Suhmita Sen: లలిత్ మోదీ-సుష్మితా సేన్ బ్రేకప్ అయ్యారా.. కారణం అదేనా?
Lalit Modi broke up with Sushmita Sen: మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్.. ఐపీఎల్ వ్యవస్థాపకులు విడిపోయారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. ఆయన.. సుష్మితాతో ఉన్న డీపీని తొలగించడంతో వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.
Lalit Modi and Sushmita Sen Broke up: మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్.. ఐపీఎల్ వ్యవస్థాపకులు లలిత్ మోదీ రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తామిద్దరం ప్రేమలో ఉన్నామంటూ లలిత్ మోదీనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అంతేకాకుండా ఆమెతో కలిసి దిగిన ఫొటోలను కూడా షేర్ చేశారు. అవి నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో వీరిపై విస్తృతంగా ఊహాగానాలు వచ్చాయి. తాజాగా వీరిద్దరూ విడిపోయారనే ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయి.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
లలిత్ మోదీ.. సుష్మితా సేన్‌తో పీకల్లోతూ ప్రేమలో ఉండి ఆమె పేరును తన ఇన్‌స్టాలో జోడించాడు. అంతేకాకుండా ఆమెతో కలిసి ఉన్న డీపీని కూడా పెట్టారు. అయితే తాజాగా ఆయన సుష్మితా పేరును ఇన్‌స్టాలో తీసివేయడమే కాకుండా డీపీని కూడా తొలగించారు. ఇన్‌స్టా ప్రొఫైల్‌లో మార్పులు చేయడంతో లలిత్ మోదీ సుష్మితా సేన్‌తో విడిపోయారని నెటిజన్లు భావిస్తున్నారు.
అయితే లలిత్ మోదీ- సుష్మితా సేన్ విడిపోవడానికి ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ కారణమని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా సుష్మితా.. తన మాజీ ప్రియుడు రోహమన్‌తో కలిసి సనినిమాలకు, షాపింగ్ మాల్స్‌కు వెళ్తోంది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని బాహాటంగానే తిరగుతుండటంతో లలిత్ మోదీ.. సుష్మితాకు బ్రేకప్ చెప్పారని స్పష్టమవుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత మేరకు వాస్తవముందో తెలియాల్సి ఉంది.
నాలుగు పదుల వయస్సు దాటినా సుష్మితా సేన్ ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. వివాహం చేసుకోనప్పటికీ సింగిల్‌గా మాత్రం ఈ విశ్వసుందరి లేదు. ఇంతకుముందు పలువురు క్రికెట్, వ్యాపార ప్రముఖలతో ప్రేమాయాణం నడిపింది. గతేడాది తన మాజీ బాయ్ ఫ్రెండ్ రోహమన్‌తో బ్రేకప్ చెప్పిన తర్వాత ఖాళీగానే ఉంది. అయితే ఇటీవల కాలంలో లలిత్ మోదీ తాను సుష్మితాతో రిలేషన్‌లో ఉన్నానని ప్రకటించడంతో ఆమె వ్యక్తిగత జీవితం గురించి మళ్లీ చర్చ మొదలైంది.
సంబంధిత కథనం