Andrew Flintoff Accident: రోడ్డు ప్రమాదంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఫ్లింటాఫ్‌కు గాయాలు
Andrew Flintoff Accident: ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. రేసింగ్ షో చిత్రీకరణలో అతడు ప్రమాదానికి గురైనట్లు తెలిసింది.
Andrew Flintoff Accident: ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. టాప్ గేర్ అనే టీవీ షోలో జరిగిన ప్రమాదంలో అతడు గాయపడ్డట్లు తెలిసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఫ్లింటాఫ్ చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
అతడి ప్రాణాలకు ముప్పు లేదని వైద్యులు ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ క్రికెటర్‌గా వెలుగొందిన ఫ్లింటాఫ్ 2010 ఆటకు గుడ్‌బై చెప్పాడు. టాప్ గేర్ అనే రేసింగ్ షోకు 2019 నుంచి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నాడు ఫ్లింటాఫ్. సౌత్ లండన్‌లోని డన్ ఫోల్డ్ పార్క్ ఎయిర్‌డ్రోమ్ వద్ద ఈ షో షూటింగ్ చేస్తుండగా ఫ్లింటాఫ్ కారు ప్రమాదానికి గురైనట్లు తెలిసింది.
షో నిర్వహకులు ఎయిర్ అంబులెన్స్ ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఫ్లింటాఫ్ ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపినట్లు షో నిర్వహకులు ప్రకటించారు. ఫ్టింటాఫ్ గాయపడటంతో షో చిత్రీకరణను నిలపివేసినట్లు తెలిసింది. ఇంగ్లాండ్ తరఫున 141 వన్డేలకు ప్రాతినిథ్యం వహించిన ఫ్లింటాఫ్ 3394 రన్స్, 169 వికెట్లు తీశాడు. 79 టెస్ట్‌లలో 3845 రన్స్, 226 వికెట్లు తీశాడు.