తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Alibaba To Sell Zomato Shares: జొమాటో షేర్లను అమ్మేస్తున్న ‘అలీబాబా’

Alibaba to sell Zomato shares: జొమాటో షేర్లను అమ్మేస్తున్న ‘అలీబాబా’

HT Telugu Desk HT Telugu

29 November 2022, 23:35 IST

  • Alibaba to sell Zomato shares: చైనా దిగ్గజ పారిశ్రామిక వేత్త జాక్ మా ప్రారంభించిన ఈ-  కామర్స్ సంస్థ ‘అలీబాబా’.. ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలోని తన వాటాలో కొంత భాగాన్ని అమ్మాలని నిర్ణయించుకుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

ప్రతీకాత్మక చిత్రం

Alibaba to sell Zomato shares: అలీపే సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా జొమాటో లోని 262.9 మిలియన్ షేర్లను అమ్మాలని అలీబాబా సంస్థ నిర్ణయించుకుంది. ఇది జొమాటోలోని 3.07 శాతానికి సమానం.

ట్రెండింగ్ వార్తలు

iPad Air 2024: రెండేళ్ల నిరీక్షణకు తెర; లేటెస్ట్ ఎం2 చిప్ తో ఐప్యాడ్ ఎయిర్ 2024 సిరీస్ లాంచ్

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

Indegene Limited IPO: అదిరిపోయే జీఎంపీతో ఓపెన్ అయిన ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ; ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు..

Stock market crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?

Alibaba to sell Zomato shares: 193 మిలియన్ డాలర్లు

జొమాటో లోని తన వాటాలో సుమారు 193 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను అలీబాబా అమ్మనుంది. ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు బ్లాక్ ట్రేడ్ ద్వారా ఈ షేర్లను విక్రయించాలని భావిస్తోంది. ఒక్కొక్క షేరును రూ. 60 ధరను డీల్ ప్రైస్ గా నిర్ణయించింది. ఇది మంగళవారం ట్రేడ్ లో క్లోజింగ్ ప్రైజ్ కన్నా 5.59% తక్కువ. ఈ డీల్ ద్వారా రూ. 1580 కోట్లను పొందాలని అలీబాబా భావిస్తోంది. ఈ షేర్లను అమ్మిన తరువాత కూడా జొమాటోలో అలీబాబాకు దాదాపు 10% వరకు వాటా ఉంటుంది.

Alibaba to sell Zomato shares: ఉబర్ కూడా..

ఈ బ్లాక్ డీల్ కు మోర్గాన్ స్టాన్లీ ఏకైక బ్రోకర్ గా వ్యవహరిస్తోంది. నవంబర్ 30న ఈ డీల్ ముగియనుంది. కాగా, జొమాటో నుంచి ఉబర్, టైగర్ గ్లోబల్ సంస్థలు తమ వాటాను ఇప్పటికే విక్రయించాయి. ఉబర్ ఈ ఆగస్ట్ లో జొమాటోలో ఉన్న తమ మొత్తం 7.8% వాటాను అమ్మేసింది. ఈ డీల్ తో ఉబర్ రూ. 3,088 కోట్లు పొందింది. పేటీఎం, నైకా, పాలసీ బజార్ వంటి సంస్థల నుంచి కూడా ఇలా బ్లాక్ డీల్స్ ద్వారా మేజర్ షేర్ హోల్డర్లు వైదొలగుతున్నారు.

టాపిక్