women's day gift : 5 బెస్ట్ టెక్ గిఫ్ట్స్.. మీ జీవితంలోని మహిళల కోసం!
05 March 2023, 20:35 IST
- women's day gifts under 10000 : 2023 మహిళా దినోత్సవం నేపథ్యంలో.. రూ. 10వేల బడ్జెట్లో బెస్ట్ టెక్ గిఫ్ట్స్ లిస్ట్‌ను మీకోసం రూపొందించాము. వీటిపై మీరూ ఓ లుక్కేయండి..
5 బెస్ట్ టెక్ గిఫ్ట్స్.. మీ జీవితంలోని మహిళల కోసం!
women's day gifts under 10000 : అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇంకా 2,3 రోజుల సమయమే ఉంది. ఈ సందర్భంగా.. చాలా మంది.. తమ జీవితాల్లోని మహిళలకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఫోన్స్, గ్యాడ్జెట్స్ వంటివి చూస్తున్నారు. అయితే.. మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉండటంతో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో.. రూ. 10వేలలోపు ఇవ్వగలిగే ది బెస్ట్ గిఫ్ట్స్ లిస్ట్‌ను మీకోసం మేము రూపొందించాము. మీరూ ఓ లుక్కేయండి..
ఇన్ఫీనిక్స్ నోట్ 12ఐ..
Infinix note 12i : రూ. 10వేల బడ్జెట్లో చాలా స్మార్ట్‌ఫోన్స్ లభిస్తున్నాయి. వీటిల్లో ఇన్ఫీనిక్స్ నోట్ 12ఐ ప్రత్యేకం. ఇందులో 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి దీని సొంతం. ఈ మొబైల్ ధర రూ. 9,999 మాత్రమే. బెస్ట్ డీల్!
బోట్ ఎక్స్టెండ్ స్మార్ట్‌వాచ్..
Boat Xtend Smartwatch price : ఈ బడ్జెట్ స్మార్ట్‌వాచ్ ధర మరింత తగ్గింది! రూ. 7,990గా ఉండే ఈ స్మార్ట్‌వాచ్.. అమెజాన్, క్రోమా, విజయ్ సేల్స్‌లో లభిస్తున్న ఆఫర్లతో రూ. 2,299కే వస్తోంది. ఇందులో 1.69 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 50 వాచ్ ఫేసెస్, హార్ట్ రేట్ ట్రాకర్, ఎస్పీఓ2, స్లీపింగ్ పాటర్న్ ట్రాకర్ వంటి ఫీచర్స్ లభిస్తున్నాయి.
జబ్రా ఇలైట్ 4 యాక్టివ్..
Jabra Elite 4 Active price : జబ్రా ఇలైట్ 4 యాక్టివ్‌లో మైక్రోఫోన్, యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్ సెటప్, బ్లూటూత్ 5.2 కనెక్టివిటి వంటివి వస్తున్నాయి. ఇదొక ఐపీ57 రేటింగ్ డివైజ్. అమెజాన్‌లో దీని ధర రూ. 6,999గా ఉంది.
గూగుల్ పిక్సెల్ బడ్స్ ఏ- సిరీస్..
Google Pixel Buds A series : ఇది కూడా ఒక హెడ్సెటే. గూగుల్ అసిస్టెన్స్‌తో వస్తున్న ఈ డివైజ్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 7999గా ఉంది. ఇందులో 12ఎంఎం డైనమిక్ డ్రైవర్స్, బ్లూటూత్ వర్షెన్ 4, ఐపీఎక్స్4 రేటింగ్, పాసివ్ నాయిస్ రిడక్షన్ వంటి ఫీచర్స్ వస్తున్నాయి.
కిండిల్ పేపర్‌వైట్..
Kindle Paperwhite price in Amazon : ఎవరికైనా పుస్తకాలు చదివే అలవాటు ఉంటే.. వారికి ఇది ది బెస్ట్ గిఫ్ట్..! కిండిల్ పేపర్‌వైట్ ధర అమెజాన్‌లో రూ. 9999గా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా మార్చ్ 8ని అంతర్జాతీయ మహిళల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈలోపు మీకు నచ్చనవారికే మంచి మంచి గిఫ్ట్స్ కొని సర్ప్రైజ్ చేసేయండి మరి..