Ambani's wedding: ‘మామేరు’ సంప్రదాయ వేడుకలో మెరిసిపోయిన అంబానీల పెళ్లికూతురు రాధిక మర్చంట్
03 July 2024, 21:08 IST
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల ప్రి వెడ్డింగ్ వేడుకలు కొనసాగుతున్నాయి. జూలై 3, బుధవారం రాధిక మర్చంట్ ఇంట్లో గుజరాతీ సంప్రదాయమైన మామేరు వేడుక జరిగింది. ఈ సందర్భంగా రాధిక మర్చంట్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది.
మామేరు వేడుకలో కొత్త పెళ్లి కూతురు రాధిక మర్చంట్
Mameru wedding ritual: రాధికా మర్చంట్, అనంత్ అంబానీ పెళ్లి పీటలెక్కబోతున్నారు. జులై 12న తమ పెళ్లి తేదీని ప్రకటించారు. వివాహానికి ముందు, రెండు విలాసవంతమైన ప్రీ-వెడ్డింగ్ వేడుకలను అంబానీ కుటుంబం నిర్వహించింది. అందులో ఒకటి జామ్ నగర్ లో జరిగిన, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల సెలబ్రిటీలు హాజరైన వేడుక కాగా, మరొకటి, ఈ జంట తమ కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖులతో కలిసి యూరప్ అంతటా విహారయాత్రకు వెళ్లారు.
సామూహిక వివాహాలు
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహం సందర్భంగా ముకేశ్ అంబానీ దంపతులు జూలై 2వ తేదీన నవీ ముంబైలో నిరుపేద కుటుంబాలకు చెందిన జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. ఈ సందర్భంగా వారికి ఖరీదైన బహుమతులను అందజేశారు. ఆ కార్యక్రమానికి ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ స్వయంగా హాజరై, నూతన వధూవరవులను ఆశీర్వదించారు.
మామేరు అంటే ఏమిటి?
కాగా, బుధవారం, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహ వేడుకల్లో భాగంగా మామేరు సంప్రదాయ కార్యక్రమం (Mameru wedding ritual) జరిగింది. ఇది గుజరాతీ ప్రత్యేక సంప్రదాయం. ఈ సంప్రదాయం ప్రకారం.. పెళ్లికి ముందు వధువు మేనమామ ఆమెకు పెళ్లి కానుకలు అందజేస్తారు. మామేరు అంటే గుజరాతీలో మేనమామ అని అర్థం. మామేరు అనేది వధువు తన మేన మామ బహుమతులను స్వీకరించే వేడుక.
మామేరు వేడుకలో మెరిసిపోయిన అంబానీలు
మామేరు వేడుకలో అంబానీ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని రాధిక మర్చంట్ కుటుంబం ఘనంగా నిర్వహించింది. బుధవారం మధ్యాహ్నం వధువు రాధిక మర్చంట్ బంగారు అలంకరణలతో అద్భుతమైన నారింజ, గులాబీ రంగు లెహంగా ధరించి మామేరు వేదికపైకి అడుగుపెట్టింది. అంబానీ కుటుంబం మొత్తం హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ముకేష్ అంబానీ కుమార్తె, వరుడు అనంత్ అంబానీ సోదరి ఇషా అంబానీ తన భర్త ఆనంద్ పిరమల్, పిల్లలతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. గోల్డెన్ జరీ వర్క్, క్లిష్టమైన గోల్డెన్ థ్రెడ్ వర్క్ తో కూడిన ఆరెంజ్ సిల్క్ చీరలో ఇషా చాలా అందంగా కనిపించింది. ఎథ్నిక్ వేర్ లో ఫ్యామిలీ ఫోటోలకు ఫోజులిచ్చి అదరగొట్టింది. అంబానీ కుటుంబానికి చెందిన పెద్ద కోడలు శ్లోకా అంబానీ పింక్ అండ్ ఆరెంజ్ సల్వార్ సూట్ ధరించి భారీ బంగారు అలంకరణలతో అలంకరించారు. డైమండ్ డ్రాప్ చెవిపోగులతో డైమండ్ నెక్లెస్ లో శ్లోకా అందంగా కనిపించారు.
చిన్ననాటి స్నేహితులు
జూలై 12న వివాహం చేసుకోబోతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లు చిన్ననాటి స్నేహితులు. తరువాత, కాలక్రమేణా ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో, జూలై 12న ఒక్కటవుతున్నారు. ప్రీ వెడ్డింగ్ క్రూయిజ్ రైడ్ కోసం రాధిక ధరించిన గౌన్లలో ఒకదానిలో అనంత్ ఆమెకు రాసిన ప్రేమ లేఖ ఉంది. అనంత్, రాధిక 2018లో ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటోతో తమ రిలేషన్ షిప్ ను అధికారికంగా ప్రకటించారు.