Ambani's wedding: కుమారుడి పెళ్లి వేడుక సందర్భంగా పేదలకు సామూహిక వివాహాలు చేసిన ముకేశ్ అంబానీ దంపతులు-mukesh ambani nita ambani hold mass wedding ahead of anant radhika wedding ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ambani's Wedding: కుమారుడి పెళ్లి వేడుక సందర్భంగా పేదలకు సామూహిక వివాహాలు చేసిన ముకేశ్ అంబానీ దంపతులు

Ambani's wedding: కుమారుడి పెళ్లి వేడుక సందర్భంగా పేదలకు సామూహిక వివాహాలు చేసిన ముకేశ్ అంబానీ దంపతులు

HT Telugu Desk HT Telugu
Jul 02, 2024 06:20 PM IST

తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు పేద కుటుంబాలకు చెందిన జంటలకు ఉచితంగా సామూహిక వివాహాలు జరిపించారు. ఈ సామూహిక వివాహ కార్యక్రమానికి ముకేష్ అంబానీ, నీతా అంబానీ హాజరయ్యారు.

ముకేశ్ అంబానీ, నీతా అంబానీ
ముకేశ్ అంబానీ, నీతా అంబానీ (File Photo)

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా నవీ ముంబైలో మంగళవారం సామూహిక వివాహ కార్యక్రమాలను జరిపించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన జంటలకు ఉచితంగా పెళ్లి జరిపించారు. ఈ వివాహాలు జరుగుతున్న వేదిక వద్దకు వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ వచ్చారు.

వీడియోలు వైరల్..

నవీ ముంబైలో జరిగిన ఈ నిరుపేదల సామూహిక వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫోటోగ్రాఫర్ వరీందర్ చావ్లా ఈ సామూహిక వివాహాలు జరిగే వేదిక వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఫొటోగ్రాఫర్ విరాల్ భయానీ మరో వీడియోను కూడా షేర్ చేశారు. ఈ వీడియోలో ముకేశ్, నీతా అంబానీ వేదిక వద్దకు వస్తున్నారు. ముకేశ్ అంబానీ నలుపు రంగు ప్యాంటు, తెలుపు చొక్కా ధరించగా, నీతా అంబానీ ఎరుపు రంగు చీరను ధరించారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ సామూహిక వివాహాల వేడుక అంబానీ దంపతుల సమక్షంలో ప్రారంభమైంది.

సామూహిక వివాహ ఆహ్వానం

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా 2024 జూలై 2 మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు నిరుపేదల సామూహిక వివాహాన్ని ఏర్పాటు చేసినట్లు ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. నీతా అంబానీ, ముకేష్ అంబానీ ఈ మహోన్నత కార్యానికి తమ వంతు సహకారం అందిస్తున్నారని, కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు.

ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్

గుజరాత్ లోని జామ్ నగర్ లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ తొలి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ సెలబ్రేషన్స్ కు బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్ వంటి వ్యాపార దిగ్గజాలతో పాటు భారతదేశం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో రిహన్నా ప్రదర్శనతో పాటు పలువురు కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.

రెండో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్

ఇక రెండో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ విషయానికొస్తే అంబానీ దంపతులు నాలుగు రోజుల పాటు మధ్యధరా విహారయాత్రను నిర్వహించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్కోర్ హెల్త్కేర్ ఉద్యోగులతో సహా 1200 మంది అతిథుల జాబితా కోసం వారు ఈ వేదికను ఎంచుకున్నారు. అతిథుల జాబితాలో ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రమే ఉన్నారు. కాగా, జులై 12న ముంబైలోని ప్రతిష్టాత్మక జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహం జరగనుంది.

WhatsApp channel