Radhika Merchant: అనంత్ అంబానీ కాబోయే భార్య రాధికా మర్చంట్ గురించి ఈ వివరాలు తెలుసా?-here are few radhika merchants unknown facts in photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Radhika Merchant: అనంత్ అంబానీ కాబోయే భార్య రాధికా మర్చంట్ గురించి ఈ వివరాలు తెలుసా?

Radhika Merchant: అనంత్ అంబానీ కాబోయే భార్య రాధికా మర్చంట్ గురించి ఈ వివరాలు తెలుసా?

Feb 29, 2024, 04:06 PM IST HT Telugu Desk
Feb 29, 2024, 04:06 PM , IST

  • Radhika Merchant: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్ తో జరగనుంది. ఈ వివాహానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్ నగర్ లో ప్రారంభమయ్యాయి. అయితే, అనంత్ అంబానీని వివాహ చేసుకోబోతున్న రాధిక మర్చంట్ వివరాలు మీ కోసం..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్ తో జూలై 12న ముంబైలో జరగనుంది.

(1 / 9)

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్ తో జూలై 12న ముంబైలో జరగనుంది.

రాధికా మర్చంట్ ఎన్ కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్, పారిశ్రామికవేత్త షైలా మర్చంట్ ల చిన్న కుమార్తె.  

(2 / 9)

రాధికా మర్చంట్ ఎన్ కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్, పారిశ్రామికవేత్త షైలా మర్చంట్ ల చిన్న కుమార్తె.  

(ANI)

రాధికా మర్చంట్ 1994 డిసెంబర్ 18న జన్మించింది. ఆమె ఎకోల్ మోండియేల్ వరల్డ్ స్కూల్లోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో చదివింది. బిడి సోమానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి డిప్లొమా పొందింది. 

(3 / 9)

రాధికా మర్చంట్ 1994 డిసెంబర్ 18న జన్మించింది. ఆమె ఎకోల్ మోండియేల్ వరల్డ్ స్కూల్లోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో చదివింది. బిడి సోమానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి డిప్లొమా పొందింది. 

(ANI)

ఆ తర్వాత రాధికా మర్చంట్ న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ చదివి 2017లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 

(4 / 9)

ఆ తర్వాత రాధికా మర్చంట్ న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ చదివి 2017లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. (HT Photo/Varinder Chawla)

కన్సల్టింగ్ సంస్థ దేశాయ్ అండ్ దివాన్జీలో ఇంటర్న్ షిప్ తో రాధికా మర్చంట్ తన ప్రొఫెషనల్ జర్నీని ప్రారంభించారు. ఆ తర్వాత ముంబైకి చెందిన ఇస్ప్రావా అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో జూనియర్ సేల్స్ మేనేజర్ గా చేరారు. 

(5 / 9)

(HT Photo/Varinder Chawla)

రాధికా మర్చంట్ ప్రస్తుతం ఎన్ కోర్ హెల్త్ కేర్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. 

(6 / 9)

రాధికా మర్చంట్ ప్రస్తుతం ఎన్ కోర్ హెల్త్ కేర్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. 

(HT File Photo)

రాధికా మర్చంట్ అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ వలె నైపుణ్యం కలిగిన భరతనాట్యం నృత్యకారిణి. 

(7 / 9)

రాధికా మర్చంట్ అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ వలె నైపుణ్యం కలిగిన భరతనాట్యం నృత్యకారిణి. (HT File Photo)

ముంబైలోని శ్రీ నిభా ఆర్ట్స్ అకాడమీలో గురు భావన థాకర్ మార్గదర్శకత్వంలో రాధికా మర్చంట్ తన నాట్య నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నారు. 2022లో జియో వరల్డ్ సెంటర్లో ఆమె అరంగేట్రం కార్యక్రమం జరిగింది.

(8 / 9)

ముంబైలోని శ్రీ నిభా ఆర్ట్స్ అకాడమీలో గురు భావన థాకర్ మార్గదర్శకత్వంలో రాధికా మర్చంట్ తన నాట్య నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నారు. 2022లో జియో వరల్డ్ సెంటర్లో ఆమె అరంగేట్రం కార్యక్రమం జరిగింది.

(X)

తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, రాధికా మర్చంట్ జంతు సంక్షేమం, విద్య, మానవ హక్కులతో సహా పలు సామాజిక అంశాలపై చాలా ఆసక్తిని కలిగి ఉంది. 

(9 / 9)

తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, రాధికా మర్చంట్ జంతు సంక్షేమం, విద్య, మానవ హక్కులతో సహా పలు సామాజిక అంశాలపై చాలా ఆసక్తిని కలిగి ఉంది. 

(Instagram)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు