Retire with 5 crores : ఇలా చేస్తే.. రూ. 5కోట్లతో రిటైర్ అవ్వొచ్చు!
24 February 2024, 8:15 IST
- Retire with 5 crores : రూ. 5 కోట్ల సంపాదించడం ప్రాక్టికల్‌గా సాధ్యమే! ఇలా చేస్తే.. రిటైర్మెంట్ నాటికి మీరు రూ. 5కోట్లు సంపాదించుకుంటారు.
ఇలా చేస్తే.. రూ. 5కోట్లతో రిటైర్ అవ్వొచ్చు!
How to invest for retirement : రాత్రికి రాత్రే ఎవరు కోటీశ్వరులు అవ్వలేరు. దాని వెనుక చాలా ప్రక్రియ ఉంటుంది. అయితే.. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళితే, కోటీశ్వరులు అవ్వాలన్న కల కచ్చితంగా నెరవేరుతుంది! మరీ ముఖ్యంగా.. సరిగ్గా ప్లాన్ చేస్తే, రిటైర్మెంట్ సమయానికి రూ. 5 కోట్లు సంపాదించుకోవచ్చు. అదెలా సాధ్యం? ఏం చేస్తే.. రిటైర్మెంట్ ఫండ్ రూ. 5 కోట్లు అవుతుంది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రూ. 5కోట్ల రిటైర్మెంట్ ఫండ్ కోసం..
భారీ రిటైర్మెంట్ ఫండ్‌ని సృష్టించుకోవడంలో సిప్ (సిస్టెమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) కీలక పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో.. కెరీర్ తొలినాళ్లల్లోనే సిప్‌ని ప్రారంభిస్తే.. కాంపౌండింగ్ ఎఫెక్ట్‌తో అద్భుత ఫలితాలు చూస్తారని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు చెబుతున్నారు. అందుకే.. ఎంత వీలైతే అంత తొందరగా సిప్‌ని మొదలుపెట్టాలని సూచిస్తున్నారు.
రూ. 5కోట్ల కోసం 20ఏళ్ల వయస్సు నుంచి ఎంత సిప్ చేయాలి అన్న విషయంపై అక్యూబ్ వెంచర్స్ డైరక్టర్ ఆశిష్ అగర్వాల్ స్పందించారు.
How to become a crorepati: "రూ. 5కోట్లు సంపాదించాలన్న కలని ప్రాక్టికల్‌గా నెరవేర్చుకోవచ్చు. లైఫ్‌లో తొందరగా ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేస్తే.. కాంపౌండింగ్ ద్వారా అద్భుతాలు చూస్తారు. 20ఏళ్ల వయస్సులో ప్రతి నెల రూ. 8వేలు సిప్ చేస్తే, 12శాతం సీఏజీఆర్‌తో.. మీరు.. 45ఏళ్లకే కోటీశ్వరులు అవ్వొచ్చు. 60ఏళ్ల వయస్సు వచ్చే సరికి రిటైర్మెంట్ ఫండ్ రూ. 5కోట్లు అవుతుంది," అని ఆశిష్ అగర్వాల్ తెలిపారు.
మరి 30ఏళ్ల వయస్సులో ఇన్వెస్ట్మెంట్ మొదలుపెడితే రూ. 5కోట్లు ఎలా సంపాదించాలి? అన్న ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చారు అగర్వాల్.
"30ఏళ్ల వయస్సులో సిప్ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్‌ని మొదలుపెట్టినా.. కాస్త ఎక్కువే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రతి నెల రూ. 21వేలు ఇన్వెస్ట్ చేస్తే.. 12శాతం సీఏజీఆర్‌తో 60ఏళ్ల వయస్సు వచ్చేసరికి రూ. 5కోట్లు సంపాదించుకోవచ్చు," అని ఆశిష్ అగర్వాల్ స్పష్టం చేశారు.
How to create retirement fund in Telugu : సిప్ కాల్క్యులేటర్ ప్రకారం.. 25ఏళ్ల పాటు ప్రతి నెల రూ. 27వేలు ఇన్వెస్ట్ చేస్తే.. మీరు పెట్టుబడి పెట్టిన అమౌంట్ రూ. 81లక్షలు అవుతుంది. 12శాతం సీఏజీఆర్ వృద్ధితో అది 25ఏళ్ల తర్వాత.. రూ. 5,12,36,147 అవుతుంది.
అదే.. 35ఏళ్లకు ఇన్వెస్ట్మెంట్ మొదలుపెడితే?
సిప్ కాల్క్యులేటర్ ప్రకారం.. 35ఏళ్ల వయస్సులో సిప్ మొదలుపెడితే.. 60ఏళ్లకు రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ప్రతి నెల రూ. 27వేలు ఇన్వెస్ట్ చేయాలి. దానిపై 12శాతం సీఏజీఆర్ రిటర్ను వస్తే రూ. 5 కోట్లు అవుతుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రూ. 79,20,000గా ఉంటుంది. దాని మీద 12శాతం సీఏజీఆర్‌తో మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ రూ. 5,00,26,514 అవుతుంది.
అయితే.. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ అనేవి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. అందుకే రిటైర్మెంట్ ఫండ్స్ కోసం డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో ఉండాలని గుర్తుపెట్టుకోవాలి.