రిటైర్మెంట్ లైఫ్ ప్లానింగ్ అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన దశ. వృద్ధాప్యంలో తమను తాము చూసుకోవడానికి తగినంత పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం.  

pexels

By Bandaru Satyaprasad
Nov 05, 2023

Hindustan Times
Telugu

పెన్షన్ ప్లాన్ అనేది ఒక వ్యక్తి పదవీ విరమణ దశలో నిత్యావసరాలు, వ్యయాలు, వైద్య ఖర్చులు, గృహ ఖర్చులతో సహా ఇతర ఆర్థిక అవసరాలను తీర్చడానికి సాయపడుతుంది.   

pexels

ఎక్కువ మొత్తంలో పొదుపు చేసేందుకు ముందు నుంచీ పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. మీ ఆదాయంలో కొంత భాగాన్ని మీ పదవీ విరమణ జీవితానికి పొదుపుగా మార్చుకోవాలి.   

pexels

జాతీయ పెన్షన్ స్కీమ్- ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన ఉద్యోగుల సామాజిక భద్రతను అందించే ప్రభుత్వ పథకం. రెగ్యులర్ ప్రీమియంలు చెల్లిస్తూ పదవీ విరమణ కోసం కార్పస్ ఫండ్‌ను ఏర్పాటుచేసుకోవచ్చు. 60 ఏళ్ల తర్వాత, పెట్టుబడిదారులు కార్పస్ ఫండ్‌లో 60 శాతం తీసుకోవచ్చు. మిగిలిన 40 శాతం బ్యాలెన్స్‌తో యాన్యుటీ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. 

pexels

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)- ఇది ప్రభుత్వ పొదుపు పథకం, పదవీ విరమణ తర్వాత ఆకర్షణీయమైన రాబడిపై ప్లాన్ చేసుకోవచ్చు. 15 సంవత్సరాల పాటు పెట్టుబడి చేసుకోవచ్చు. కేవలం రూ.500 ఖాతా తెరవవచ్చు. ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఏడాదికి 7.1 శాతం వడ్డీని అందిస్తోంది. 

pexels

మ్యూచువల్ ఫండ్స్ - ప్రైవేట్ పెట్టుబడి పథకం. 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి కాలవ్యవధిలో...రాబడి ఏడాదికి 12 శాతం నుంచి 15 శాతం వరకు ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ పదవీ విరమణ తర్వాత ఎక్కువ మొత్తాన్ని పొందవచ్చు. అయితే మార్కెట్ నష్టాలను పరిగణనలోకి తీసుకోవాలి. 

pexels

బ్యాంక్ డిపాజిట్లు- డబ్బును ఆదా చేసే సంప్రదాయ పథకం. మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలలో రెగ్యులర్ డిపాజిట్లు చేసుకోవచ్చు. సాధారణ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో పోలిస్తే అధిక రాబడితో పాటు రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్‌లను అనుమతించడంతో రికరింగ్ డిపాజిట్‌లను కూడా చేసుకోవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో (FD) కూడా పెట్టుబడులు పెట్టవచ్చు.  

బీమా పథకాలు- పెన్షన్ ప్లాన్‌లు జీవిత బీమా కవరేజీని, అలాగే యాన్యుటీ ఎంపికలను అందిస్తాయి. వీటిలో కొన్ని ఎస్బీఐ లైఫ్ సరళ్ రిటైర్‌మెంట్ సేవర్, మాక్స్ లైఫ్ గ్యారెంటీడ్ లైఫ్‌టైమ్ ఇన్‌కమ్ ప్లాన్, ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్, కోటక్ ప్రీమియర్ పెన్షన్ ప్లాన్ వంటివి ఉన్నాయి.  

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels