Personal finance: ఈ 5 ముఖ్యమైన పర్సనల్ ఫైనాన్స్ పనులు చేశారా? ఈ నెలాఖరే అందుకు గడువు..-five personal finance rule changes taking place from next month ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Personal Finance: ఈ 5 ముఖ్యమైన పర్సనల్ ఫైనాన్స్ పనులు చేశారా? ఈ నెలాఖరే అందుకు గడువు..

Personal finance: ఈ 5 ముఖ్యమైన పర్సనల్ ఫైనాన్స్ పనులు చేశారా? ఈ నెలాఖరే అందుకు గడువు..

HT Telugu Desk HT Telugu
Sep 21, 2023 04:01 PM IST

Personal finance: వ్యక్తిగత ఆర్థిక అంశాలకు సంబంధించిన ఐదు పనులకు ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుంది. సెప్టెంబర్ 30 లోగా ఆ పనులు చేయకపోతే, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటంటే..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Personal finance: పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన అంశాల్లో అక్టోబర్ 1 నుంచి పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన నిబంధనలు కొన్ని ఇటీవల మారాయి. వాటికి సంబంధించిన మార్పు చేర్పులను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ ముఖ్యమైన ఐదు పర్సనల్ ఫైనాన్స్ పనులు ఏంటంటే..

మ్యూచువల్ ఫండ్స్ కు నామినీలు

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్ ను ఎంపిక చేసుకున్న వారు తమ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ ఫొలియోలకు నామినీలను ఆడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు లాస్ట్ డేట్ సెప్టెంబర్ 30వ తేదీ. ఆ తేదీ లోగా మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ ఫొలియోలకు నామినీలను ఆడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నామినేషన్ యాడ్ చేయనట్లయితే ఆ అకౌంట్ లు ఫ్రీజ్ అవుతాయి.

కొత్త టీసీఎస్ నిబంధనలు

భారత్ లో తీసుకున్న క్రెడిట్ కార్డును విదేశాల్లో రూ. 7 లక్షలకు మించి వినియోగించినట్లయితే ఆ అదనపు మొత్తం పై 20% టిసిఎస్ విధిస్తారు. రూ. 7 లక్షల వరకు ఎలాంటి టీసీఎస్ ఉండదు. ఈ నిబంధన అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అయితే ఆ ఖర్చు వైద్య చికిత్స నిమిత్తం గాని, విద్య కోసం గాని వినియోగించినట్లయితే రూ. 7 లక్షలకు మించిన మొత్తంపై టీసీఎస్ 5% మాత్రమే ఉంటుంది. విదేశీ విద్య కోసం లోన్ తీసుకున్నవారు రూ. 7 లక్షలకు మించిన మొత్తంపై కేవలం 0.5% టి సి ఎస్ చెల్లిస్తే సరిపోతుంది.

డీమ్యాట్ ఖాతాలకు నామినీలు

స్టాక్ మార్కెట్లో డీమ్యాట్ ఖాతాల ద్వారా ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ చేస్తున్నవారు తమ డీమ్యాట్ ఖాతాలకు నామినీలను ఆడ్ చేయడానికి సెప్టెంబర్ 30వ తేదీ లాస్ట్ డేట్. ఈలోపే నామినేలను ఆడ్ చేయాల్సి ఉంటుంది. అలా నామినీలను ఆడ్ చేయని ఖాతాలు ఫ్రీజ్ చేయబడతాయి. ఈ విషయాన్ని సెబీ ఇప్పటికే స్పష్టం చేసింది. నిజానికి ఈ గడువు మార్చి 31వ తేదీతో ముగియాల్సి ఉండగా, సెబి మరో ఆరు నెలలు ఈ గడువును పొడిగించింది. ఇప్పటికే తమ డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలకు నామినీలను యాడ్ చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు.

స్మాల్ సేవింగ్ ఖాతాలకు ఆధార్ లింక్

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), పోస్ట్ ఆఫీస్ డిపాజిట్, తదితర స్మాల్ సేవింగ్స్ పథకాల (Small savings schemes) లబ్ధిదారులు తమ ఖాతాలకు ఆధార్ నెంబర్ ను లింక్ చేయాల్సి ఉంటుంది. ఇలా లింక్ చేయడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 30. ఆధార్ నంబర్ ను లింక్ చేయని స్మాల్ సేవింగ్స్ ఖాతాల్లో లావాదేవీలు నిలిపివేయబడతాయి. ఇప్పటికే తమ స్మాల్ సేవింగ్స్ ఖాతాలకు నామినీలను యాడ్ చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు.

రూ 2000 నోట్ల మార్పిడి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లను చెలామణి నించి తొలగించిన విషయం తెలిసిందే. ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2000 నోట్లను తమ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా బ్యాంకు శాఖకు వెళ్లి వేరే నగదుతో మార్పిడి చేసుకోవచ్చు. అయితే అందుకు గడువు సెప్టెంబర్ 30 మాత్రమే. సెప్టెంబర్ 30 లోగా ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2,000 నోట్లు బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడం కానీ లేదా ఏదైనా బ్యాంకు శాఖలో లేదా పోస్ట్ ఆఫీస్ లో మార్చుకోవడం కానీ చేయవచ్చు.