తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Toyota Suv's Launch : ఇండియాలో 3 కొత్త ఎస్​యూవీల లాంచ్​కు టయోటా ప్లాన్​!

Toyota SUV's launch : ఇండియాలో 3 కొత్త ఎస్​యూవీల లాంచ్​కు టయోటా ప్లాన్​!

Sharath Chitturi HT Telugu

26 March 2023, 11:11 IST

google News
  • Toyota new SUV's launch in India : ఇండియాలో 3 కొత్త ఎస్​యూవీలను లాంచ్​ చేసేందుకు టయోటా సంస్థ ప్లాన్​ చేస్తోంది. వీటిల్లో నెక్స్ట్​ జెన్​ ఫార్చ్యునర్​ కూడా ఉంది.

ఇండియాలో 3 కొత్త ఎస్​యూవీల లాంచ్​కు టయోటా ప్లాన్​!
ఇండియాలో 3 కొత్త ఎస్​యూవీల లాంచ్​కు టయోటా ప్లాన్​!

ఇండియాలో 3 కొత్త ఎస్​యూవీల లాంచ్​కు టయోటా ప్లాన్​!

Toyota new SUV's launch in India : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎస్​యూవీ సెగ్మెంట్​కు ఈ మధ్య కాలంలో విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే వివిధ ఆటోమొబైల్​ సంస్థలు.. కొత్త కొత్త ఎస్​యూవీలను లాంచ్​ చేస్తున్నాయి. ఈవీలతో పాటు ఇప్పుడు చాలా కంపెనీల లైనప్​లో ఎస్​యూవీలే ఉంటున్నాయి! ఇండియా మార్కెట్​లో ఇన్నోవా హైక్రాస్​, హైరైడర్​ వంటి మోడల్స్​ను ఇటీవలే లాంచ్​ చేసిన టాయోటా మోటార్స్​.. రానున్న కాలంలో మరో మూడు ఎస్​యూవీలను లాంచ్​ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఎస్​యూవీలే.. ఎస్​యూవీలు..!

రానున్న 2,3 ఏళ్లల్లో.. మూడు ఎస్​యూవీలను లాంచ్​ చేయనుంది టయోటా సంస్థ. ఇండియాలో మారుతీ సుజుకీకి టయోటా మోటార్స్​కు మధ్య ఒప్పందం ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ను రీనేమ్​ చేసి టయోటా సంస్థ కూడా లాంచ్​ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ మోడల్​కు ఏ15 అన్న కోడ్​నేమ్​ పెట్టినట్టు తెలుస్తోంది. 1.0 లీటర్​ 3 సిలిండర్​ బూస్టర్​జెట్​ టర్బో, 1.2 లీటర్​ డ్యూయెల్​ జెట్​ 4 సిలిండర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఇది లాంచ్​ అవుతుందని అంచనాలు ఉన్నాయి.

Toyota new SUV's : మారుతీ ఫ్రాంక్స్​.. వచ్చే నెలలో లాంచ్​ కానుంది. బుకింగ్స్​ పరంగా చూసుకుంటే.. ఈ మోడల్​కు ఇప్పటికే మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఇక తమ ప్రాడక్ట్​కి కూడా అదే తరహా డిమాండ్​ వస్తుంది జపాన్​ ఆధారిత సంస్థ భావిస్తోంది.

మరోవైపు.. టయోటా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో ఒకటిగా ఉన్న ఫార్చ్యునర్​కు లేటెస్ట్​ వర్షెన్​ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే.. నెక్స్ట్​ జెనరేషన్​ ఫార్చ్యునర్​.. 2025 నాటికి ఇండియా రోడ్ల మీద చక్కర్లు కొడుతుంది. 2024లోనే ఇది అంతర్జాతీయంగా లాంచ్​ కానుంది. బ్రాండ్​- న్యూ డిజైన్​, అప్డేటెడ్​ కేబిన్​, కొత్త ఇంజిన్​ ఆప్షన్​ వంటివి ఇందులో కనిపించనున్నాయి. టయోటా టీఎన్​జీఏ-ఎఫ్​ ఆర్కిటెక్చర్​ అనే ప్లాట్​ఫామ్​పై దీనిని రూపొందిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్లాట్​ఫామ్​పై 2,500ఎంఎం- 4,180ఎంఎం వీల్​బేస్​తో కూడిన వాహనాలను తయారు చేయవచ్చని తెలుస్తోంది.

Toyota motors latest launch : వీటితోపాటు ఓ కొత్త 3-రో ఎస్​యూవీని ప్రత్యేకంగా ఇండియన్​ మార్కెట్​ కోసం టయోటా అభివృద్ధి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంత్జాతీయంగా ఉన్న కొరొల్లా క్రాస్​ ఎస్​యూవీ ప్లాట్​ఫామ్​పై దీనిని డెవెలప్​ చేస్తున్నట్టు సమాచారం. ఇదొక 7- సీటర్​ అని తెలుస్తోంది. ఈ 7 సీటర్​ కొరొల్లా క్రాస్​.. హ్యుందాయ్​ అల్కజార్​, మహీంద్రా ఎక్స్​యూవీ700, జీప్​ మెరీడియన్​ వంటి డిమాండ్​ ఉన్న మోడల్స్​కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం