Tata Safari vs Mahindra XUV700 : టాటా సఫారీ వర్సెస్​ మహీంద్రా ఎక్స్​యూవీ700- ది బెస్ట్​ ఏది?-2023 tata safari vs mahindra xuv700 check features and detailed comparison here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  2023 Tata Safari Vs Mahindra Xuv700 Check Features And Detailed Comparison Here

Tata Safari vs Mahindra XUV700 : టాటా సఫారీ వర్సెస్​ మహీంద్రా ఎక్స్​యూవీ700- ది బెస్ట్​ ఏది?

Sharath Chitturi HT Telugu
Feb 27, 2023 03:12 PM IST

2023 Tata Safari vs Mahindra XUV700 : 2023 టాటా సఫారీలో అనేక అప్డేట్స్​ చేసింది ఆటమొబైల్​ సంస్థ. ఫలితంగా మహీంద్రా ఎక్స్​యూవీ700కి టాటా సఫారీ మధ్య పోటీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ రెండింట్లో ది బెస్ట్​ ఏది? అనేది ఇక్కడ తెలుసుకుందాము.

టాటా సఫారీ వర్సెస్​ మహీంద్రా ఎక్స్​యూవీ700- ది బెస్ట్​ ఏది?
టాటా సఫారీ వర్సెస్​ మహీంద్రా ఎక్స్​యూవీ700- ది బెస్ట్​ ఏది?

2023 Tata Safari vs Mahindra XUV700 : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎస్​యూవీలకు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్​లోని ఎస్​యూవీ మోడల్స్​పై కస్టమర్ల దృష్టి రోజురోజుకు పెరుగుతోంది. ఇక బెస్ట్​ సెల్లింగ్​గా ఉన్న సఫారీకి పలు కీలక అప్డేట్స్​ని తీసుకొచ్చి, పోటీని మరింత పెంచింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​. 2023 టాటా సఫారీకి ఏడీఏఎస్​ ఫంక్షన్స్​ని తీసుకొచ్చింది. కాగా.. ఇదే సెగ్మెంట్​లో మహీంద్రా ఎక్స్​యూవీ700 కూడా ఉంది. దీనికీ మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటిని ఓసారి పోల్చి.. ది బెస్ట్​ ఏదనేది తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

టాటా సఫారీ వర్సెస్​ మహీంద్రా ఎక్స్​యూవీ700-

Tata Safari on road price Hyderabad : 2023 టాటా సఫారీలో స్కల్ప్​టెడ్​ హుడ్​, క్రోమ్​ గ్రిల్​, బంపర్​- మౌంటెడ్​ ప్రొజెక్టర్​ హెడ్​లైట్స్​, వైడ్​ ఎయిర్​ డ్యామ్​, రేక్​డ్​ విండ్​స్క్రీన్​, రూఫ్​ రెయిల్స్​, ఫ్లేర్​డ్​ వీల్​ ఆర్చీస్​, 18 ఇంచ్​ అలాయ్​ వీల్స్​, వ్రాప్​ అరౌండ్​ ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​ ఉంటాయి.

ఇక మహీంద్రా ఎక్స్​యూవీ700లో మస్క్యులర్​ బానెట్​, క్రోమ్​ స్లేటెడ్​ గ్రిల్​, స్కిడ్​ ప్లేట్స్​, ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, సీ షెప్​ డీఆర్​ఎల్స్​, ఫ్లష్​ ఫిట్టెడ్​ డోర్​ హ్యాండిల్స్​, 18 ఇంచ్​ అలాయ్​ వీల్స్​, వ్రాప్​ అరౌండ్​ ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​, షార్క్​ ఫిన్​ యాంటీనా ఉంటాయి.

ఈ రెండింటినీ పోల్చి చూస్తే.. డీజైన్​పరంగా మహీంద్రా ఎక్స్​యూవీ700 చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

టాటా సఫారీ వర్సెస్​ మహీంద్రా ఎక్స్​యూవీ700- ఇంజిన్​..

టాటా సఫారీలో 2.0 లీటర్​ క్రియోటెక్​, టర్బోఛార్జ్​డ్​ డీజిల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 178 హెచ్​పీ పవర్​ను, 350 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ టార్క్​ కన్వర్టర్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉంటాయి.

Mahindra XUV700 on road price Hyderabad : ఇక మహీంద్రా ఎక్స్​యూవీ700లో 2.2 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ గరిష్ఠంగా 182 హెచ్​పీ పవర్​ను, 450 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేగలదు. కాగా.. 2.0 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ 197 హెచ్​పీ పవర్​ను, 380 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. వీటిల్లో 6 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

ఇంజిన్​ పరంగా చూసుకుంటే.. మహీంద్రా ఎక్స్​యూవీ700 కాస్త పవర్​ఫుల్​!

టాటా సఫారీ వర్సెస్​ మహీంద్రా ఎక్స్​యూవీ700- ఫీచర్స్​..

Tata Safari latest updates : 2023 టాటా సఫారీలో ఫౌక్స్​ వుడ్​ డాష్​బోర్డ్​, ప్రీమియం లెథర్​ అప్​హోలిస్ట్రీ, వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​, పానారోమిక్​ సన్​రూఫ్​, బ్లూ కలర్డ్​ యాంబియెంట్​ లైటింగ్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 10.25 ఇంచ్​ ఫ్రీ స్టాండింగ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ కన్సోల్​, 6 ఎయిర్​బ్యాగ్స్​ వంటివి వస్తున్నాయి.

ఇక మహీంద్రా ఎక్స్​యూవీ700లో పానారోమిక్​ సన్​రూఫ్​, యాంబియెంట్​ లైటింగ్​, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​, 12 స్పీకర్​ సోనీ సౌండ్​ సిస్టెమ్​, 7 ఎయిర్​బ్యాగ్స్​ వస్తున్నాయి.

టాటా సఫారీ వర్సెస్​ మహీంద్రా ఎక్స్​యూవీ700- ధర..

Mahindra XUV700 price details : 2023 టాటా సఫారీ ఎక్స్​షోరూం ధర రూ. 15.65లక్షలు- రూ. 24.82లక్షల మధ్యలో ఉంటుంది. ఇక మహీంద్రా ఎక్స్​యూవీ700 ఎక్స్​షోరూం ధర రూ. 13.45లక్షలు- రూ. 25.48లక్షల మధ్యలో ఉంటుంది.

WhatsApp channel