Mahindra Scorpio N vs Scorpio Classic : మహీంద్రా స్కార్పియో ఎన్​ వర్సెస్​ క్లాసిక్​.. ఏది బెటర్​?-mahindra scorpio n vs classic check detailed comparison here and choose the best ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Mahindra Scorpio N Vs Classic Check Detailed Comparison Here And Choose The Best

Mahindra Scorpio N vs Scorpio Classic : మహీంద్రా స్కార్పియో ఎన్​ వర్సెస్​ క్లాసిక్​.. ఏది బెటర్​?

Sharath Chitturi HT Telugu
Feb 26, 2023 06:50 AM IST

Mahindra Scorpio N vs Scorpio Classic : మహీంద్రా స్కార్పియో ఎన్​, స్కార్పియో క్లాసిక్​లో ఏది కొంటే బెటర్​? అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే..

మహీంద్రా స్కార్పియో ఎన్​ వర్సెస్​ క్లాసిక్​.. ఏది బెటర్​?
మహీంద్రా స్కార్పియో ఎన్​ వర్సెస్​ క్లాసిక్​.. ఏది బెటర్​?

Mahindra Scorpio N vs Scorpio Classic : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో మహీంద్రా అండ్​ మహీంద్రా వాహనాలకు మంచి డిమాండ్​ ఉంది. ముఖ్యంగా ఎస్​యూవీ సెగ్మెంట్​లో ఎం అండ్​ ఎం కార్లు దూసుకెళుతున్నాయ. అందుకు తగ్గట్టుగానే వెయిటింగ్​ పీరియడ్​ కూడా భారీగానే ఉంది. స్కార్పియో ఎన్​, ఎక్స్​యూవీ 700, స్కార్పియో క్లాసిక్​ వంటి మోడల్స్​ హాట్​కేక్స్​లాగా అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏది కొంటే బెటర్​? అని కస్టమర్లలో సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో స్కార్పియో ఎన్​, స్కార్పియో క్లాసిక్​ను పోల్చి.. ఏది తీసుకుంటే బెటర్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

స్కార్పియో ఎన్​ వర్సెస్​ స్కార్పియో క్లాసిక్​- లుక్స్​..

Mahindra Scorpio N on road price : స్కార్పియో క్లాసిక్​కు పాత కాలం నాటి స్కార్పియో లుక్స్​ వచ్చాయి. అయితే.. నేటి తరం ఇష్టాలకు తగ్గట్టు డిజైన్​ను కాస్త మాడిఫై చేశారు. బానెట్​ స్కూప్​, కింక్​డ్​ రూఫ్​ వంటివి ఇంకా ఉన్నాయి. ఇక స్కార్పియో ఎన్​ చాలా బోల్డ్​గా, చాలా స్టైలిష్​గా కనిపిస్తుంది. డిజైన్​ పరంగా సరికొత్త ఎక్స్​పీరియన్స్​ని ఇస్తుంది. అయితే.. దీనిలోనూ పాత స్కార్పియో డిజైన్​కు చెందిన కొన్ని అంశాలు కనిపిస్తాయి. సైడ్​ హింజ్​డ్​ టెయిల్​గేట్​, కింక్​డ్​ రూఫ్​ వంటివి ఉదాహరణలు.

స్కార్పియో ఎన్​ వర్సెస్​ స్కార్పియో క్లాసిక్​- ఇంజిన్​..

Mahindra Scorpio classic on road price in Hyderabad : మహీంద్రా స్కార్పియో క్లాసిక్​లో డీజిల్​ ఇంజిన్​ మాత్రమే ఉంటుంది. 2.2 లీటర్​ డీజిల్​ ఇంజిన్​.. 3,650 ఆర్​పీఎం వద్ద 130 బీహెచ్​పీ పవర్​ను, 1600- 2800 ఆర్​పీఎం వద్ద 300 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్​ గేర్​బాక్స్​ మాత్రమే ఉంటుంది.

ఇక స్కార్పియో ఎన్​లో ఉన్న 2.2 లీటర్​ డీజిల్​ ఇంజిన్​.. 173 బీహెచ్​పీ పవర్​ను, 370 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 2.0 లీటర్​ టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్​ ఇంజిన్​ కూడా ఇందులో ఉంది. ఇది 200 బీహెచ్​పీ పవర్​ను, 380 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 6 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ టార్క్​ కన్వర్టర్​ గేర్​బాక్స్​లు ఉంటాయి.

స్కార్పియో ఎన్​ వర్సెస్​ స్కార్పియో క్లాసిక్​- ఫీచర్స్​..

Mahindra Scorpio N features : ఫీచర్స్​ విషయానికొస్తే.. స్కార్పియో ఎన్​ చాలా మోడర్న్​గా ఉంటుంది. సరికొత్త ఫీచర్స్​ ఇందులో ఉంటాయి. ఎల్​ఈడీ ప్రొజెక్టర్​ హెడ్​ల్యాంప్స్​, ఎల్​ఈడీ టెయిల్​ ల్యాంప్స్​, ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, రేర్​ ఏసీ వెంట్స్​, 8 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ విత్​ ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​పలే, క్రూజ్​ కంట్రోల్​, కనెక్టెడ్​ కార్​ టెక్నాలజీతో పాటు ఇతర ఫీచర్స్​ ఇందులో కనిపిస్తాయి.

ఇక స్కార్పియో క్లాసిక్​లో హాలోజెన్​ ప్రోజెక్టర్​ హెడ్​ల్యాంప్స్​, 9 ఇంచ్​ టచ్​స్క్రీన్​, రేర్​ పార్కింగ్​ కెమెరా, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, రేర్​ ఏసీ వెంట్స్​, క్రూజ్​ కంట్రోల్​ వంటివి వస్తాయి.

స్కార్పియో ఎన్​ వర్సెస్​ స్కార్పియో క్లాసిక్​- ధరలు..

Mahindra Scorpio N price : స్కార్పియో క్లాసిక్​ ఎస్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 12.64లక్షలు. ఎస్​11 వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 16.14లక్షలు. ఇక స్కార్పియో ఎన్​ ఎక్స్​షోరూం ధరలు రూ. 12.74లక్షలు- రూ. 24.05లక్షల మధ్యలో ఉంటుంది.

WhatsApp channel