Audi Q3 Sportback vs BMW X1 : ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ వర్సెస్ బీఎండబ్ల్యూ ఎక్స్1.. ది బెస్ట్ ఏది?
Audi Q3 Sportback vs 2023 BMW X1 : లగ్జరీ కార్ల సెగ్మెంట్లో ఇటీవలే రెండు కొత్త వెహికిల్స్ లాంచ్ అయ్యాయి. అవి ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్, బీఎండబ్ల్యూ ఎక్స్1. వీటని పోల్చి.. ది బెస్ట్ ఏదనేది తెలుసుకుందాము..
Audi Q3 Sportback vs 2023 BMW X1 : ఇండియా మార్కెట్లోని లగ్జరీ కార్ల సెగ్మెంట్‌పై పట్టు సాధించేందుకు అంతర్జాతీయ బ్రాండ్స్ పోటీపడుతున్నాయి! ఆడీ, బీఎండబ్ల్యూ సంస్థలు ఈ రేస్‌లో ముందున్నాయి. కొత్త కొత్త లాంచ్‌లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ లగ్జరీ వెహికిల్‌ని ఇటీవలే లాంచ్ చేసింది ఆడీ. ఇక సరికొత్త బీఎండబ్ల్యూ ఎక్స్1 గత నెలలో బయటకొచ్చింది. ఈ క్రమంలో ఈ రెండు లగ్జరీ వాహనాలను ఓ సారి పోల్చి.. ది బెస్ట్ ఏది? అన్నది తెలుసుకుందాము..
ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ వర్సెస్ 2023 బీఎండబ్ల్యూ ఎక్స్1- లుక్స్..
2023 BMW X1 on road price in India : 2023 బీఎండబ్ల్యూ ఎక్స్1 బానెట్ మస్క్యులర్‌గా, పెద్దగా ఉంటుంది. క్రోమ్ కిడ్నీ గ్రిల్, సీ- షేప్‌లోని డీఆర్ఎల్స్తో కూడిన స్వెప్ట్‌బ్యాక్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, ఫ్లష్- ఫిట్టెడ్ డోర్ హ్యాండిల్స్, రూఫ్ రెయిల్స్, వ్రాప్ అరౌండ్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ ఉంటాయి.
ఇక ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్‌లో హుడ్ పెద్దగా ఉంటుంది. హనీకూంబ్ మెష్ పాటర్న్‌తో కూడిన బ్లాక్ గ్రిల్ ఉంటుంది. మాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, స్లోపింగ్ రూఫ్‌లైన్, ఓఆర్వీఎంలు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చీస్, ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ ఉన్నాయి.
ఈ రెండు వాహనాల్లోనూ 18 ఇంచ్ డిజైనర్ అలాయ్ వీల్స్ ఉంటాయి.
ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ వర్సెస్ 2023 బీఎండబ్ల్యూ ఎక్స్1- ఇంజిన్..
Audi Q3 Sportback on road price Hyderabad : బీఎండబ్ల్యూ ఎక్స్1లో 1.5 లీటర్, త్రీ సిలిండర్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 136 హెచ్‌పీ పవర్‌ను, 230ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక 2.0 లీటర్, ఇన్లైన్ 4, డీజిల్ మోటర్ కూడా ఉంది. ఇది 150 హెచ్‌పీ పవర్‌ను, 360 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్‌లో 2.0 లీటర్, ఫోర్ సిలిండర్ టీఎఫ్ఎస్ఐ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 187.4 హెచ్‌పీ పవర్‌ను, 320 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఈ రెండు ఎస్‌యూవీల్లోనూ 7 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. 2023 బీఎండబ్ల్యూ ఎక్స్1లో డీసీటీ యూనిట్ ఉండగా.. ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్‌లో టార్క్ కన్వర్టర్ ట్రాన్స్మిషన్ సెటప్ ఉంటుంది.
ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ వర్సెస్ 2023 బీఎండబ్ల్యూ ఎక్స్1- ఫీచర్స్..
2023 BMW X1 India launch : 2023 బీఎండబ్ల్యూ ఎక్స్1లో డ్యూయెల్- టోన్ డాష్‌బోర్డ్, లెథర్ అప్‌హోలిస్ట్రీ, వయర్లెస్ ఛార్జర్, పానారోమిక్ సన్‌రూఫ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.7 ఇంచ్ ఐడ్రైవ్ 8 ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఇక ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్‌లో డ్యూయెల్- టోన్ క్యాబిన్, మల్టీ కలర్ యాంబియెంట్ లైటింగ్, పానారోమిక్ సన్‌రూఫ్, అడ్జెస్టెబుల్ ఫ్రెంట్ సీట్స్, వర్చుయవల్ కాక్‌పిట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ వంటి ఫీచర్స్ ఉంటాయి.
ఈ రెండు లగ్జరీ ఎస్‌యూవీల్లోనూ 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి.
ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ వర్సెస్ 2023 బీఎండబ్ల్యూ ఎక్స్1- ధర..
Audi Q3 Sportback facelift 2023 launch : ఇండియాలో 2023 బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎక్స్‌షోరూం ధర రూ. 45.9లక్షలు- రూ. 47.9లక్షల మధ్యలో ఉంది. ఇక ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 51.43లక్షలుగా ఉంది.