Maruti Suzuki Ciaz vs Skoda Slavia : సియాజ్ వర్సెస్ స్లావియా.. ది బెస్ట్ ఏది?
Maruti Suzuki Ciaz vs Skoda Slavia : మారుతీ సుజుకీ సియాజ్, స్కోడా స్లావియా.. ఈ రెండు సెడాన్ మోడల్స్‌లో ది బెస్ట్ ఏది? ఏది కొనుగోలు చేయాలి? వంటివి ఇక్కడ తెలుసుకుందాము.
Maruti Suzuki Ciaz vs Skoda Slavia : దేశంలో వాహనాల విక్రయలు జోరుగా సాగుతున్నాయి. ఫలితంగా.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటో మార్కెట్‌గా ఇండియా ఎదిగింది. అటు ఎస్‌యూవీలు, ఇటు సెడాన్ మోడల్స్‌తో ఆటోమొబైల్ సెగ్మెంట్ కళకళలాడిపోతోంది. ముఖ్యంగా మిడ్- సెడాన్ సెగ్మెంట్లో మారుతీ సుజుకీ సియాజ్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది. అయితే.. సియాజ్‌కు గట్టిపోటీనిస్తోంది స్కోడా స్లావియా. ఈ నేపథ్యంలో ఈ రెండింటిని ఓసారి పోల్చి చూసి, ది బెస్ట్ ఏది? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
మారుతీ సుజుకీ సియాజ్ వర్సెస్ స్కోడా స్లావియా- లుక్స్..
Maruti Suzuki Ciaz on road price in Hyderabad : మారుతీ సుజుకీ సియాజ్‌లో బానెట్ పెద్దగా ఉంటుంది. క్రోమ్ సరౌండింగ్స్‌తో కూడిన బ్లాక్ గ్రిల్స్ రావడంతో మరింత అట్రాక్టివ్ లుక్ వస్తుంది. డీఆర్ఎల్లతో కూడిన స్వెప్ట్‌బ్యాక్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, 16 ఇంచ్ డిజైనర్ ఆలాయ్ వీల్స్, వ్రాప్ అరౌండ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ వంటివి.. సెడాన్‌కు మరింత ఆకర్షణీయమైన లుక్‌ను తెచ్చిపెడతాయి.
ఇక స్కోడా స్లావియాలో బానెట్ మస్క్యులర్ లుక్‌ని ఇస్తుంది. క్రోమ్ సరౌండెడ్ బటర్‌ఫ్లై గ్రిల్స్, యాంగ్యులర్ డ్యూయెల్- పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, 16 ఇంచ్ డ్యూయెల్ టోన్ అలాయ్ వీల్స్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ వంటివి అట్రాక్టివ్‌గా ఉన్నాయి.
మారుతీ సుజుకీ సియాజ్ వర్సెస్ స్కోడా స్లావియా- ఇంజిన్..
మారుతీ సుజుకీ సియాజ్‌లో 1.5 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 102 హెచ్‌పీ పవర్‌ను, 138 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మేన్యువల్, 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉంటాయి.
Skoda Slavia on road price in Hyderabad : ఇక స్కోడా స్లావియాలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ ఉంటుంది. ఇది 113హెచ్‌పీ పవర్‌ను, 175ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అయితే.. ఇందులో 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంటుంది. ఇది 148 హెచ్‌పీ పవర్‌ను, 250 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. రెండింట్లోనూ.. 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమెటిక్, 7 స్పీడ్ డీఎస్జీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి.
మారుతీ సుజుకీ సియాజ్ వర్సెస్ స్కోడా స్లావియా- ఫీచర్స్..
Maruti Suzuki Ciaz features : మారుతీ సుజుకీ సియాజ్‌లో డ్యూయెల్- టోన్ డాష్‌బోర్డ్, ప్రీమియం ఫాబ్రిక్ అప్‌హోలిస్ట్రీ, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్ విత్ రేర్ ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, 7 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్పీ, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఇక స్కోడా స్లావియాలో లెథరెట్ అప్‌హోలిస్ట్రీ, వెటిలేటెడ్ ఫ్రెంట్ సీట్స్, సన్‌రూఫ్, వయర్లెస్ ఛార్జర్, యాంబియెట్ లైటింగ్, 8 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 8 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, రేర్ వ్యూ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి.
మారుతీ సుజుకీ సియాజ్ వర్సెస్ స్కోడా స్లావియా- ధర..
Skoda Slavia mileage : మారుతీ సుజుకీ సియాజ్ ఎక్స్‌షోరూం ధర రూ. 9.19లక్షలు- రూ. 12.34లక్షల మధ్యలో ఉంటుంది. స్కోడా స్లావియా ఎక్స్‌షోరూం ధర రూ. 11.29లక్షలు- రూ. 18.4లక్షల మధ్యలో ఉంది.